కలెక్టరేట్‌లో అర్జీదారులకు భోజన సదుపాయం | Meals for the petitioner in the collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో అర్జీదారులకు భోజన సదుపాయం

Published Mon, May 29 2017 10:28 PM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM

Meals for the petitioner in the collectorate

అనంతపురం అర్బన్‌ : 

కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన మీ కోసంలో అర్జీలు ఇచ్చేందుకు జిల్లా నలమూలల నుంచి వచ్చిన వారికి రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప భోజన వసతి కల్పించారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ పరిపాలనాధికారి వరదరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరామప్ప మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వస్తుంటారని, హోటళ్లలో భోజనం చేయాలంటే ఆర్థికంగా ఇబ్బంది అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సామాజిక సేవలో భాగంగా ఉచితంగా భోజన వసతి కల్పించామన్నారు. కార్యక్రమంలో అక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement