యువకుడి ఆత్మహత్యాయత్నం | men sucicideatempt | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

Published Sun, Nov 20 2016 12:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

men sucicideatempt

  • స్టేషన్‌ ఎదుటే బ్లేడుతో చేయి, గొంతు కోసుకున్న వైనం
  • కాకినాడ కాకినాడ క్రైం : 
    వేరు కాపురానికి రావడం లేదంటూ భార్య పెట్టిన పోలీస్‌ కేసు పెట్టడంతో మనస్తాపానికి గురైన భర్త బ్లేడుతో చేతి మణికట్టు,గొంతుపై కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాకినాడలో శనివారం చోటుచేసుకున్న ఘటనపై పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ సూర్యనారాయణపురం, రంగయ్యనాయుడువీధికి చెందిన 28 ఏళ్ల మద్ది రాంబాబురెడ్డి స్థానిక పెద్దబజారులో హోల్‌సేల్‌ పళ్ల దుకాణంలో పనిచేస్తూంటాడు. ఇతనికి ఎనిమిదేళ్లక్రితం విజయనగరం జిల్లా  పూసపాటిరేగకు చెందిన నందినితో వివాహం జరిగింది. నాలుగేళ్ల నుంచి కుటుంబ కలహాల నేపథ్యంలో వేరే కాపురం పెట్టాలంటూ భర్తపై ఆమె ఒత్తిడి తీసుకొచ్చేది. నాన్న వెంకటరామారెడ్డికి రెండుసార్లు గుండెకు ఆపరేష¯ŒS జరిగింది. వేరే కాపురం పెట్టడం కుదరదని స్పష్టం చేశాడు. దాంతో భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్యను కాపురానికి పంపాలంటూ ఈ నెల 6న కాకినాడ మూడో పట్టణ పోలీస్‌స్టేష న్లో  ఫిర్యాదు చేశాడు. ప్రతిగా ఆమె 11వ తేదీన భర్తపై పూసపాటిరేగలో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం అక్కడి స్టేష¯ŒSకు రావాలంటూ పోలీసులు కబురు పడంతో  నాకు న్యాయం చేయాలంటూ స్థానిక మూడో పోలీస్టేçÙ¯ŒSకు వచ్చి తీవ్ర మనస్తాపంతో వెంట తెచ్చుకున్న బ్లేడుతో చేతిమణికట్టుపై కోసుకుని గాయం చేసుకున్నాడు. గొంతుపై గాటు పెట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అంతటితో ఆగక రోడ్డుపై కొచ్చి నేను చనిపోతానంటూ హడావుడి చేశాడు.  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాంబాబురెడ్డిని పోలీసులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఎస్సై ఎస్‌. గౌరీశంకర్‌   కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement