జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య
Published Mon, Jan 30 2017 12:33 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
కాకినాడ వైద్యం :
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో వంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం అర్థరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఐ.పోలవరం మండలం కేసనకుర్రు గ్రామానికి చెందిన సాలిగ్రామ త్రిమూర్తులు (30) ఫిట్స్ వ్యాధితో కొన్నేళ్లుగా బాధపడుతున్నాడు. కొంతకాలంగా అతడు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని సమస్య ఎంతకీ తగ్గకపోవడంతో శనివారం రాత్రి సర్జికల్ వార్డు ఎదురుగా ఉన్న సుభోజనం హŸటల్ వద్దనున్న రోగుల వెయిటింగ్ బ్లాక్ వద్దకు చేరుకుని, కొంతసేపు పడుకుని, అందరూ వెళ్లిపోయాకా తన వెంట తెచ్చుకున్న పెట్రోలును వంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో కాలిపోతూ హాహాకారాలు చేస్తున్న మృతుడ్ని గుర్తించిన స్థానికులు దుప్పట్లతో మంటలు ఆర్పి చికిత్స కోసం అత్యవసర విభాగంలో చేర్చారు. శరీరం 96 శాతానికి పైగా కాలిపోవడంతో కొద్దిసేపటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు.
Advertisement
Advertisement