సిద్దిపేటే నా ధైర్యం... కేసీఆర్ మాటే వేదం | Minister Harish Rao's interview with Sakshi | Sakshi
Sakshi News home page

సిద్దిపేటే నా ధైర్యం... కేసీఆర్ మాటే వేదం

Published Mon, Dec 5 2016 3:30 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

సిద్దిపేటే నా ధైర్యం... కేసీఆర్ మాటే వేదం - Sakshi

సిద్దిపేటే నా ధైర్యం... కేసీఆర్ మాటే వేదం

ప్రజలు, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే నగదు రహితం
- మోదీని నెత్తిన ఎక్కించుకోవడానికో.. వ్యతిరేకించడానికో కాదు
- మంత్రి హరీశ్‌రావుతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ
 
 సాక్షి, సిద్దిపేట: పెద్ద నోట్ల రద్దుతో ఉత్పన్నమయ్యే సమస్యల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నిర్వాహణ పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇక్కడి అనుభవాలు, ఫలితాలను బేరీజు వేసుకుని తరువాత రాష్ట్రం అంతటా విస్తరింపజేస్తామన్నారు. ఇది మోదీని నెత్తిన ఎక్కించుకోవడానికో... వ్యతిరేకించేందుకో కాదంటున్న హరీశ్... నగదు రహిత లావాదేవీలు, టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లరుున సందర్భంగా ’సాక్షి’తో తన అభిప్రాయాలు పంచుకున్నారు...

 మేము మోదీ నిర్ణయానికి వ్యతిరేకమో.. అనుకూలమో కాదు. నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. కొన్ని మార్పులు చేయాలని ప్రధానికి సూచనలు ఇచ్చాం. రైతులు, పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రయోజనాలు చేపడతారని భావించాం. కానీ కేంద్రం మేం అనుకున్నంతగా ముందుకు రాలేదు. ఈ క్రమంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తే కరెన్సీ కష్టాలు పోతాయని సీఎం కేసీఆర్ భావించారు. దాన్ని అమలు చేయడానికి సిద్దిపేటను ప్రయోగాత్మకంగా ఎంచుకున్నాం.

 గ్రామాల్లో బ్యాంకుల అవసరం లేదు
 నగదు రహితం ఓ సామాజిక కార్యక్రమం. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలను తగ్గించటానికి, లేదా నివారించడానికి చేపట్టిన కార్యక్రమం. ఇందుకోసం ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు. బ్యాంకు సిబ్బందే ప్రతి ఇంటికీ వస్తారు. ఆ కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉంటే రూపే కార్డు ఇస్తారు. లేకుంటే అక్కడికక్కడే ఖాతా తెరిచి రూపే కార్డు ఇస్తారు. దీన్ని అధార్ కార్డుతో అనుసంధానం చేస్తారు. ఆధార్ లేకుంటే 5 నిమిషాల్లో అది కూడా ఇస్తారు. జీఎస్టీ పాలసీ వచ్చాక రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ జీరో సరుకు తేవటానికి, అమ్మటానికి అవకాశం ఉండదు. అదే విషయాన్ని వ్యాపారులకు చె ప్పాం. తాత్కాలికంగా కొంతమంది ఇబ్బందిగా భావించినా వారు కూడా దీర్ఘకాలికంగా ఈ ఫలాలు పొందుతరు. నగదు రహిత లావాదేవీల కోసం గ్రామాల్లో బ్యాంకుల అవసరం లేనే లేదు. గ్రామీణులు ఎరువులు, విత్తనాలు, ధాన్యం, బస్సు టికెట్, చివరకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా రూపే కార్డు, స్మార్టు ఫోన్‌తో కొనగలుగుతారు. ఇది కాకుండా చిన్న చిన్న నగదు అవసరాల కోసం గ్రామాల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాం.

 రైతాంగం దీవెనలు...
 తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధుల కోసం జరిగింది. నీటి పారుదల శాఖ మంత్రిగా సీఎం నాకు గురుతర బాధ్యత అప్పగించా రు. మిషన్ కాకతీయతో పేదలు, వ్యవసాయ కూలీలు, రైతాంగం దీవెనలు నాకు దొరికినరుు. మిషన్ కాకతీయ విజయవంతం కావటం సంతృప్తినిచ్చింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను దశల వారీగా పూర్తి చేస్తున్నాం. ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం వర్గల్‌లో తిరిగినప్పుడు పూడిక మట్టి వేస్తున్న రైతుల పొలాల్లోకి వెళ్లి చూసిన.. వాళ్లతో మాట్లాడిన. పత్తి, టమాట, మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందని, బోరుబావుల్లో నీటి ఊటలు పెరిగాయని వారు చెప్పారు.

 రైతు బజార్లలోనూ నగదు రహితం...
 రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో నగదు రహిత లావాదేవీలను అమలు చేయబోతున్నాం. హైదరాబాద్‌లో 5 రైతు బజార్లు, సిద్దిపేట రైతు బజారులో నగదు రహిత క్రయవిక్రయాలు జరుగుతున్నారుు. వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లతోపాటు సీసీఐ, సివిల్ సప్లై, మార్క్‌ఫెడ్ లాంటి కొనుగోలు సంస్థలకు ఆదేశాలివ్వడం జరిగింది. ప్రయోగాత్మకంగా వరంగల్ జిల్లా ఎనుమాముల, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్‌లో వీటిని ప్రారంభించాం. మంచి ఫలితాలు వస్తున్నారుు. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని వ్యవసాయ మార్కెట్లకు విస్తరిస్తాం.
 
 సీఎం ఏం ఆదేశించినా విజయవంతం చేస్తా...

 సిద్దిపేటనే పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడానికి అనేక కారణాలున్నారుు. సిద్దిపేటే నా ధైర్యం.. ముఖ్యమంత్రి మాటే నాకు వేదం. ఆయన ఏం ఆదేశిస్తే అది విజయవంతం చేసి తీరుతా. కొంత కాలంగా సీఎం, నేను చేసిన పనులతో ఇక్కడి ప్రజల విశ్వాసం చూరగొన్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తాం. తెలంగాణ ఉద్యమం పుట్టింది ఇక్కడే కదా..! నగదు రహిత లావాదేవీలను కూడా ఒక ఉద్యమంలా చేసి.. వచ్చిన ఫలాలు, ఫలితాలు, అనుభవాలు రాష్ట్రం అంతటికీ విస్తరింపజేయాలనుకుంటున్నాం. కేసీఆర్ 20 ఏళ్ల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం, ప్రజా ప్రతినిధులు 99 శాతం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వాళ్లే కావడం, అన్నిటికీ మించి ఇక్కడి ప్రజలు మార్పు ఆహ్వానించేవాళ్లు కావటం, సీఎం నమ్మకం, ఉద్యమం నుంచి మొదలుకొంటే హరితహారం, స్వచ్ఛభారత్ కార్యక్రమాలవంటివన్నీ ఇక్కడ విజయవంతంగా జరిగారుు.
 
 ప్రజలు నలిగిపోకూడదు...
 పెద్దనోట్ల రద్దు లాభమా.. నష్టమా.. అనేది నిజానికి ఈ నిమిషం వరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు. గొప్ప ఆర్థికవేత్తగా పేరొందిన మన్మోహన్‌సింగ్ నష్టం అంటున్నారు. ప్రధాని లాభమంటున్నారు. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నష్టమే జరుగుతుందంటే... ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బాగుంటుందని చెప్తున్నారు. మేము భవిష్యత్తు పరిణామాలను గమనిస్తుంటం. ఈ లాభనష్టాల మధ్య ప్రజలు నలిగిపోకూడదు. ప్రజలు, రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నంలో సీఎం సిద్దిపేటను నగదు రహిత లావాదేవీల కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement