ముంపుప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
ముంపుప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
Published Sat, Sep 24 2016 9:52 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
కట్టంగూర్
మండల కేంద్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టులను, కాలువలను, డ్రెయినేజీలను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం కట్టంగూర్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గాంధీనగర్ ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. గాంధీనగర్ నుంచి కట్టంగూర్ పెద్ద చెరువు వరకు డ్రెయినేజీ పనులు పునరద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ సమీపంలో గల పెద్దవాగు వద్ద ధ్వంసమైన కల్వర్టును ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, గడుసు శంకర్‌రెడ్డి, ఐతగోని నర్సింహ్మ, మర్రి రాజు, బొల్లెద్ద యాదయ్య, ధార భిక్షం, బాలనర్సింహ్మ, మేడి రాములు, గోపాల్, సిరిశాల శంకర్ తదితరులున్నారు.
Advertisement
Advertisement