observe
-
రేపే బ్యాంకు యూనియన్ల సమ్మె
న్యూఢిల్లీ: తొమ్మిది బ్యాంకుల సంఘాల ఆధ్వర్యంలో రేపే భారీ ఎత్తున సమ్మె నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా, ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీసీ, ఏబబీఓఏ,బీఈఎఫ్ఐ, ఐఎన్‌బీఈ ఎఫ్, ఐఎన్ బీఓసీ, ఎన్ఓబీడబ్ల్యు, ఎన్ఓబీఓ యూనిమయన్ల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28 న ఒక రోజు సమ్మె చేపట్టనున్నారు. బ్యాంకుయూనియన్లతో కేంద్ర ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వరంలో జరిగిన సమావేశంలో విఫలం కావడంతో ఈ సమ్మె అనివార్యమైంది. యూనియన్ల డిమాండ్లను బ్యాంకుల మేనేజ్ మెంట్ బాడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తిరస్కరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, పాత తరం ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులుఈ సమ్మెలో పాల్గొననున్నాయి. మొండి బకాయిలను రాబట్టడంలో బ్యాంకు ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి, అన్ని స్థాయిల్లో ఖాళీల భర్తీ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు కఠిన శిక్షలు వంటి పలు డిమాండ్లతో సమ్మెకు దిగనున్నట్లు బ్యాంకు సంఘాల ఐక్య వేదిక(యుఎఫ్‌బియు) నేతృత్వంలోని బ్యాంకు సంఘాలు తెలిపాయి. అయితే జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం, జాతీయ బ్యాంకు అధికారుల సంఘాలు మాత్రం సమ్మెలో పాల్గొనట్లేదు. ఫిబ్రవరి 21న భారత బ్యాంకుల సమాఖ్య(ఐబిఎ)తో జరిపిన చర్చలు విఫలమైనట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య(ఎఐబిఇఎ) ప్రకటించింది. సమ్మె యథావిధిగా కొనసాగుతందని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ఆదివారం మీడియాకు చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక సంస్కరణలపై కూడా బ్యాంకు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సంఘాలు ప్రభుత్వం ప్రజావ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టనున్నాయి. ముఖ్యంగ గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీమానిటైజేషన్ కాలంలో అదనంగా పనిచేసిన ఉద్యోగులకు పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మంగళవారం వివిధ యూనియన్ల ఆద్వర్యంలో సమ్మెను చేపట్టనున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు కొన్ని ఇప్పటికే వినియోగదారులకు సమాచారాన్ని అందించాయి. ముఖ్యంగా సమ్మె కారణంగా తమ బ్యాంక్ కార్యకలాపాలకు, సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్న ముందస్తు సూచనలను అందించాయి. -
ముంపుప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
కట్టంగూర్ మండల కేంద్రంలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టులను, కాలువలను, డ్రెయినేజీలను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం కట్టంగూర్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గాంధీనగర్ ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. గాంధీనగర్ నుంచి కట్టంగూర్ పెద్ద చెరువు వరకు డ్రెయినేజీ పనులు పునరద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ సమీపంలో గల పెద్దవాగు వద్ద ధ్వంసమైన కల్వర్టును ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, గడుసు శంకర్‌రెడ్డి, ఐతగోని నర్సింహ్మ, మర్రి రాజు, బొల్లెద్ద యాదయ్య, ధార భిక్షం, బాలనర్సింహ్మ, మేడి రాములు, గోపాల్, సిరిశాల శంకర్ తదితరులున్నారు. -
ముస్లింలు పూజ.. హిందువులు ఉపవాసం!
జైసల్మీర్: గణపతి ఉత్సవాల సంబరాల్లో పాల్గొంటూ ముస్లింలు.. రంజాన్ మాసంలో హిందువులు ఉపవాసం ఉంటూ రాజస్థాన్ లోని ఓ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. రాష్ట్రంలోని బర్మర్, జైసల్మీర్ జిల్లాల్లో ముస్లింలు దీపావళి జరుపుకొంటూ పాటలు ఆలపిస్తారు. మరికొందరు గణేశ్ ను పూజిస్తారు. తమ తోటి హిందువులతో ఆచారాలను పాటిస్తారు. అలాగే ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ నెలలో హిందువులు వారితో పాటే ఉపవాసం చేస్తారు. మరికొందరు రోజుకు అయిదు సార్లు నమాజు చేస్తున్నారు. కాగా, ఈ ఆచార సంప్రదాయం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయాక సింధ్ నుంచి చాలా హిందూ కుటుంబాలు రాజస్థాన్ కు వచ్చి స్థిరపడ్డాయి. అక్కడి గ్రామాల్లో ప్రజలు ధరించే వేషధారణ సైతం ఇంచుమించు అందరిదీ ఒకేలాగ ఉండటంతో హిందువులెవరో.. ముస్లింలు ఎవరో? చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై గోహడ్ కా తల అనే గ్రామంలో నివసించే డా. మేఘారామ్ గద్ వీర్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆనందాలు, బాధలను అందరూ పంచుకుంటారని, కుల, మత, వర్గ తారతమ్యాలకు ఇక్కడ చోటు లేదని తెలిపారు. పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పాక్ తో యుద్ధ సమయంలో కూడా ఇలానే జీవించాం అని వివరించారు. బర్మార్ జిల్లాలోని గోహడ్ కా తల, రబసర్, సట, సిన్హానియా, బఖాసర్, కెల్నోర్ గ్రామాల్లోని ఎక్కువమంది ప్రజలు దీనిని పాటిస్తున్నారు. వివాహాల సమయంలో హిందూ దేవుళ్ల పాటలను పాడుతూ… గణేశుడి పూజతో ప్రారంభిస్తున్నారు. -
గుంటూరులో 26న రాజ్యాంగ పరిరక్షణ దినం
-
నేడు మందుల దుకాణాలు బంద్