కులవృత్తులకు ప్రోత్సాహం | mlc sathish kumar says we encourage artifacts | Sakshi
Sakshi News home page

కులవృత్తులకు ప్రోత్సాహం

Published Wed, Jun 21 2017 1:39 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

కులవృత్తులకు ప్రోత్సాహం

కులవృత్తులకు ప్రోత్సాహం

► రాష్ట్ర వ్యాప్తంగా 100 సంచార వైద్యశాలలు
► వచ్చే మూడేళ్లలో గొల్లకుర్మలు లక్షాధికారులు కావాలి
► ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌  
► 75 శాతం రాయితీపై గొర్రెలు పంపిణీ


ఆసిఫాబాద్‌: అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని, కులవృత్తులను తమ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ అన్నారు. గొల్లకుర్మల సంక్షేమం కోçసం టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన గొర్రెల అభివృద్ధి పథకం కింద మంగళవారం 11 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ    చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను గొంగళితో సన్మానించారు. గొర్రె పిల్లను బహూకరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ గత పాలకులు కులవృత్తులను విస్మరించగా, తమ ప్రభుత్వ గౌరవిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,427మంది గొల్లకుర్మలుండగా, తొలి విడతలో 2,227 మందిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశామన్నారు. 75 శాతం రాయితీపై ఒక్కొక్కరికి  రూ.1.25 వేల విలువైన 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేస్తున్నామన్నారు.  గొర్రెలకు బీమా చేసినట్లు తెలిపారు.

వచ్చే మూడేళ్లలో గొల్లకుర్మలు లక్షాధికారులు కావాలని ఆకాంక్షించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఐదు మాసాల్లో పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, షాదీ ముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్, బీసీలు, మైనార్టీలకు గురుకులాలతోపాటు పలుసంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కలెక్టర్‌ చంపాలాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సబ్సిడీపై గొర్రెల మేత గడ్డి కిలో రూ.15కు స్కైలో గ్రాస్‌ అందజేస్తామన్నారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు, వాంకిడి జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ రెండు మాసాల్లోనే గొర్రెల అభివృద్ధి పథకం ప్రారంభించడం అభినందనీయమన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంతో సీఎం కేసీఆర్‌ యాదవుల కులదైవమయ్యాడని కొనియాడారు.

కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి సురేశ్, పశువైద్యుడు శ్రీకాంత్,  ఎంపీపీ తారాబాయి, జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవరావు, ఏఎంసీ చైర్మన్‌ గంధం శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు గాదెవేని మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌బిన్‌ అబ్దుల్లా, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement