సీటుపై ఉత్కంఠ.. | MLC selection of candidates | Sakshi
Sakshi News home page

సీటుపై ఉత్కంఠ..

Published Thu, Nov 17 2016 2:30 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

సీటుపై ఉత్కంఠ.. - Sakshi

సీటుపై ఉత్కంఠ..

టీడీపీ అభ్యర్థిత్వం కోసం nఆశావహుల పోటీ
గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు
నేడు నారా లోకేష్ పర్యటన
ముఖ్యనేతలతో మంత్రాంగం

 
తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లోగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనుంది. మున్సిపల్ మంత్రి నారాయణ పావులు కదుపుతుండటంతో అభ్యర్థుల ఎంపిక రెండు జిల్లాల రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక తేలిపోతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారుు.
 
తిరుపతి: వచ్చే మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అభ్యర్థుల ఎంపికలో సమాలోచనలు చేస్తున్నారుు. తూర్పు రాయలసీమలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులను ఈ రెండు పార్టీ లు ఇప్పటికే ఖరారు చేశారుు. యండపల్లి శ్రీనివాసులురెడ్డి, విఠపు బాల సుబ్రహ్మణ్యంలనే మళ్లీ బరిలో నిలుపుతున్నారుు. టీడీపీ అధిష్టానం మాత్రం అభ్యర్థుల ఎంపికలో వేచిచూసే ధోరణి కనబరుస్తోంది. ఉభయ కమ్యూనిస్టులు నిలబెట్టిన అభ్యర్థుల బలాన్ని అంచనా వేసుకుని ఓట్లను చీల్చే అభ్యర్థులను నిలబెట్టాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. యూటీఎఫ్‌కు వ్యతిరేకంగా  స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడాలనుకుంటున్న చదలవాడ సుచరిత నిర్ణయం టీడీపీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఎస్టీయూ, యూటీఎఫ్ మినహారుుంచి మిగతా ఉపాధ్యాయ సంఘాలు సుచరితకు మద్దతు తెలుపుతున్నామని ఇటీవలనే ప్రకటించారు. దీంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరుగుతోంది.
 
అభ్యర్థులు ఎవరో...
 ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజక వర్గం నుంచి టీడీపీ పక్షాన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, దేశారుుశెట్టి హనుమంతరావు పోటీ పడుతున్నారు. పట్టాభిరామిరెడ్డి అభ్యర్థిత్వా న్ని మంత్రి నారాయణ బలపరుస్తున్నా రు. నారాయణ విద్యాసంస్థల్లో పట్టాభిరామిరెడ్డి కీలక ఉద్యోగి. అత్యంత సన్నిహితుడు కూడా. రెండో అభ్యర్థి దేశారుుశెట్టి హనుమంతరావు వృత్తి రీత్యా న్యాయవాది. 2009, 2011 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు ఎన్నికల్లో నిలబడిన వ్యక్తిగా భావించి హనుమంతరావుకు టికెట్ కేటారుుంచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డారుు. పార్టీ నేతల అంచనాలను తలకిందులు చేస్తూ పట్టాభిరామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. బుధవారం సాయంత్రం లాంఛనంగా ప్రకటించింది. దేశారుుశెట్టి శిబిరంలో అగ్గి రాజుకుంది. ఆయన్ను బలపరిచే నేతల్లో అసంతప్తి పెల్లుబుకింది. కార్పొరేట్ డబ్బులకు అమ్ముడు పోరుు టికెట్ కేటారుుంపులో పార్టీ తొందరపాటు నిర్ణయం తీసుకుందనే వాదనలు రెండు జిల్లాల్లోనూ వినిపిస్తున్నారుు.
 
ఇక్కడి నుంచి ఎవరో...
 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున చిత్తూరు జిల్లాలో వాసుదేవనాయుడు, ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి, సాకం నాగరాజు ఆసక్తి చూపుతున్నారు. చదలవాడ విద్యా సంస్థల అధినేత చదలవాడ సుచరిత తొలుత టీడీపీ తరఫున టికెట్ ఆశించి, ఆపైన పార్టీ అధిష్టానం సుముఖంగా లేదని తెలిసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సన్నద్ధమయ్యారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటారుుస్తే, చిత్తూరు జిల్లా లో మరో సామాజిక వర్గానికి ఇవ్వాలన్నది టీడీపీ నిర్ణయంగా ఉన్నప్పటికీ జయాపజయాలను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని పార్టీ ముఖ్యులు అధిష్టానానికి చెబుతున్నారు.  ఎమ్మెల్సీ బరిలో నిలబడేందుకు చదలవాడ సుచరిత ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పలు ఉపాధ్యాయ సంఘాలు ఈమెకు మద్దతు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారుు. యూటీఎఫ్ విధానాలకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని సుచరిత ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నారుు. వాసుదేవనాయుడు లేదా నాగరాజు అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేస్తే అటు సుచరితతో పాటు, ఇటు
 ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి కూడా  స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నారుు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement