నర్సు ఆపరేషన్.. గర్భిణి మృతి! | mother died due to nurse operation alleged her relatives | Sakshi
Sakshi News home page

నర్సు ఆపరేషన్.. గర్భిణి మృతి!

Published Thu, Nov 17 2016 7:48 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

mother died due to nurse operation alleged her relatives

శ్రీకాకుళం: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ గర్భిణి మృతిచెందింది. ఈ ఘటన శ్రీకాకుళం రాజాం సెయింటాన్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. డెలివరీ కోసం ఇక్కడికి తీసుకురాగా.. డాక్టర్‌కు బదులుగా నర్సు ఆపరేషన్ చేసింది. దీంతో ఈ ఆపరేషన్‌ వల్ల తల్లి మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బిడ్డ మాత్రం క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement