ప్రేమ నచ్చక...తల్లే చంపేసింది..! | mother killed daughter because of love | Sakshi
Sakshi News home page

ప్రేమ నచ్చక...తల్లే చంపేసింది..!

Published Fri, Aug 7 2015 10:05 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

ప్రేమ నచ్చక...తల్లే చంపేసింది..! - Sakshi

ప్రేమ నచ్చక...తల్లే చంపేసింది..!

వేంసూరు(ఖమ్మం): కూతురు ప్రేమ వ్యవహారం నచ్చక.. గ్రామంలో తమ పరువు పోతుందని భావించిన ఓ తల్లి కూతురును చంపేసింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామానికి చెందిన మల్లే మల్లీశ్వరి(18) ఈ నెల 4న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల విచారణలో ఆమెను కన్న తల్లే హత్య చేసినట్లు వెల్లడైంది. సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. మల్లీశ్వరీ అదే గ్రామానికి చెందిన గుంజ కేశవరావును కొంతకాలంగా ప్రేమిస్తోంది. అతడినే పెళ్లి చేసుకుంటాని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు నచ్చలేదు.

అంతకంటే మంచి అబ్బాయితో పెళ్లి చేస్తామని చెప్పినా మల్లీశ్వరీ వినకపోవడంతో గతంలో ఒకసారి గుళికల మందు ఇచ్చి చంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 3న సాయంత్రం తల్లి, కూతురి మధ్య మరోసారి వాదన జరిగింది. కోపోద్రిక్తురాలైన తల్లి రాధమ్మ మల్లీశ్వరి తలను కిటికీ అంచుకు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త శ్రీనివాసరావుతో కలసి అర్ధరాత్రి రహదారి పక్కన ఉన్న బీడుభూమిలో పడేశారు. మరుసటి రోజు మల్లీశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే అదే రోజు పోలీస్ డాగ్ నిందితుల ఇంటికి నేరుగా వెళ్లింది. పోలీసుల దర్యాప్తులో కన్నవారే నిందితులని తేలింది. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement