ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు మృతి | Mother , son killed Accidentally | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు మృతి

Jun 20 2016 5:57 PM | Updated on Aug 24 2018 2:36 PM

గేదెలకు కాపలాగా వెళ్లిన తల్లి, కొడుకు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు.

గేదెలకు కాపలాగా వెళ్లిన తల్లి, కొడుకు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. గుంటూరు జిల్లా శావల్యాపురంలో మండలం శానంపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యోగమ్మ(37) ఆమె కుమారుడు యోగేంద్ర(15) సోమవారం గేదెలు తోలుకుని పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సమీపంలోని వాగులోకి గేదెలు వెళ్లగా వాటి కోసం వెళ్లిన యోగేంద్ర 15 అడుగుల లోతు ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. అతడి కోసం వెళ్లిన యోగమ్మ కూడా నీటిలో మునిగి చనిపోయింది. వారు తిరిగి రాకపోయేసరికి తోటి వారు వెళ్లి వెదికారు. విగతజీవులుగా మారిన తల్లి, కొడుకును బయటకు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement