yogendra
-
Hansaji Yogendra: వయసు 76..ఉత్సాహం 16
మన దేశంలో యోగా గురువులంటే పురుషులే కనిపిస్తుంటారు. కాని హన్సా యోగేంద్ర యోగా గురువుగా చేసిన కృషి ఎవరికీ తక్కువ కానిది. ముఖ్యంగా వయోవృద్ధులలో నైరాశ్యం తొలగి జీవన ఉత్సాహం ఏర్పడాలంటే ఏం చేయాలో ఆమె వీడియో పాఠాల ద్వారా తెలియచేస్తుంది. ఆలోచన, ఆహారం, ఆరోగ్యం ఈ మూడింటికీ మార్గదర్శి హన్సా యోగేంద్ర. ముందు మనం హన్సా యోగేంద్ర రోజువారీ జీవితం చూద్దాం. ఆమె ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తారు. కాసేపు మంచం మీదే పవన ముక్తాసన వంటి ఒకటి రెండు ఆసనాలు వేస్తారు. కొన్ని నిమిషాల ప్రాణాయామం చేస్తారు. ఓంకార ధ్వని చేస్తారు. ‘ఇది సృష్టిలోని శక్తిని మీకు అనుసంధానిస్తుంది’ అంటారు. అప్పుడు ‘మార్నింగ్ డ్రింక్’ తాగుతారు. అంటే టీ, కాఫీ కాదు. రాత్రంతా వెండిగ్లాసులో ఉంచిన నీటిని కాచి దానిలో ఉసిరి, అల్లం, మిరియాలు, పసుపు, అశ్వగంధ మిశ్రమాల ΄పొడిని కొద్దిగా కలిపి కాస్త నిమ్మకాయ పిండి ఆ కషాయాన్ని తీసుకుంటారు. ‘ఇది జఠరాగ్నికి చాలా మంచిది’ అంటారామె. ఆ తర్వాత కాసేపు మత్సా్యసనం, భుజంగాసనం, శలభాసనం వేస్తారు. సరిగ్గా 8.30 అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారం అంటే రాత్రి నానబెట్టిన డ్రైఫ్రూట్స్. చివరలో పాలు. ఆ తర్వాత ఆమె యోగా వీడియోలు రికార్డు చేస్తారు. లేదంటే తమ మానసిక శారీరక బాధలు చెప్పుకోవడానికి వచ్చే అనుయాయుల సమస్యలు విని కౌన్సెలింగ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనంలో ఒక రోటీ, పప్పు, ఏదైనా కూర. ‘నేను భోజన బల్ల మీద నీళ్ల గ్లాస్ పెట్టుకోను. మజ్జిగ గ్లాసు పెట్టుకుంటాను. నీళ్ల కంటే మజ్జిగ మన జీర్ణక్రియకు మంచిది’ అంటారామె. ఆ తర్వాత పనిలో పడతారు. సాయంత్రం కాసేపు వాకింగ్ చేస్తారు. ఉడకబెట్టిన పప్పులేవైనా తీసుకుంటారు. రాత్రి సూప్‌తోపాటు, ఇడ్లీ సాంబార్ లాంటివి భుజిస్తారు. రాత్రి సరిగ్గా 10.30కు నిద్ర ΄ోతారు. ‘జీవితం ప్రశాంతంగా గడవాలంటే సిస్టమేటిక్‌గా ఉండాలి’ అంటారామె. యోగా గురువు హన్సా యోగేంద్ర ముంబైలో పుట్టి పెరిగింది. చిన్న వయసులోనే యోగా పట్ల ఆకర్షితురాలైంది. బిఎస్సీ, ఎల్ఎల్బీ చేసినా మనసు యోగా వైపుకు లాగడంతో ప్రఖ్యాత యోగా గురువు యోగేంద్ర స్థాపించిన ‘ది యోగా ఇన్స్టిట్యూట్’కు తరచూ వెళ్లేది. అక్కడే ఆమె యోగేంద్ర కుమారుడు జయదేవ యోగేంద్ర దగ్గర యోగా నేర్చుకుంది. ఆ తర్వాత జయదేవను వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి ఆమెవైపు పెద్దలు అంగీకరించలేదు. కాని తన జీవితాన్ని యోగాకు అంకితం చేయాలన్న నిశ్చయంతో ఆమె జయదేవను వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి యోగా కేంద్రాన్ని వృద్ధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఆమె 76 సంవత్సరాలు. గత ముప్పై, నలభై ఏళ్లలో ఆమె సంస్థ ద్వారా తయారైన యోగా టీచర్లు, ఆమె ద్వారా కనీసం లక్షమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇవాళ ఆమె చేసే వీడియోలు లక్షల్లో చూస్తున్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి యోగా ఉత్తమ మార్గం అంటారామె. అలవాట్లు.. ఆలోచనలు ఆలవాట్లు. ఆలోచనల మీద నియంత్రణ అన్నది జీవితాన్ని అదుపులో ఉంచుతుందని అంటారు హన్సా. అర్థవంతంగా జీవించడం ప్రతి ఒక్కరి అవసరం అని చెబుతారు. విపరీతమైన పరుగులాట, వేళకాని వేళ భోజనం, వేళకాని వేళలో నిద్ర... ఇవి జీవితానికి, ఆరోగ్యానికి ప్రధాన శత్రువులంటారామె. ఇవే అనవసర వృద్ధా΄్యాన్ని తెస్తున్నాయని అంటారు. ప్రకృతిలో దొరికే అందరికీ తెలిసిన పదార్థాలతోనే అకాల వృద్ధా΄్యాన్ని నిరోధించవచ్చంటారు. కాఫీ, టీ వంటివి కూడా శరీరానికి అక్కర్లేదని అవి అలవాటుగా మారి నాడీ వ్యవస్థను డీలా పరుస్తాయంటారు. ‘ఐదు ముఖ్యమైన ఉదయపు అలవాట్లు’,‘మంచినీరు తాగాల్సిన పద్ధతి’, ‘ప్రతి స్త్రీ వేయాల్సిన ఐదు ఆసనాలు’, ‘స్నానం చేయాల్సిన పద్ధతి’,‘ఎలాంటి ఆహారం తీసుకోవాలి’, ‘జబ్బులు రానివ్వని ఐదు ముద్రలు’... ఆమె చేసిన ఇలాంటి వీడియోలన్నీ పెద్దఎత్తున ఆదరణ ΄పొందాయి. సాత్విక ఆహారం గురించి ‘ది సాత్విక్ కిచెన్’ అనే పుస్తకం రాశారామె. ‘ఆ«ధ్యాత్మికత, ఆసనాలు మన జీవితానికి మార్గం చూపుతాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఆధ్యాత్మికంగా మీ బలహీనతలను జయించండి’ అంటారు హన్సా. ‘జీవితం విసిరే సవాళ్లకు సిద్ధంగా ఉండి రిస్క్ తీసుకునైనా నిజాయితీగా ΄ోరాడితే జీవితం కచ్చితంగా మీకు సంతోషాలనే ఇస్తుంది. జీవితాన్ని అనవసర జంజాటాల్లో పడేయకండి’ అంటారామె. హన్సా కుమారుడు రిషి జయదేవ్ యోగేంద్ర కూడా యోగ సాధనలో ఉన్నాడు. ‘అతన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అంటారామె. -
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేరుుంచిన భార్య నిందితుడి అరెస్ట్ బెంగళూరు: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి తన భర్తను హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. వివరాలు...జిల్లాలోని ఎన్.ఆర్‌పుర తాలూకాలోని కట్టినమనె గ్రామానికి చెందిన యోగేంద్ర (42)కు సమీప గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదిలా ఉంటే కొద్ది కాలంగా వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మృతుడి భార్య పుట్టింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు కుందాపురకు చెందిన బస్ డ్రైవర్ వినయ్‌గౌడతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి విషయం ఆమె భర్త యోగేంద్రకు తెలియడంతో పలుమార్లు భార్యను హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. పెద్దల ఎదుట పంచాయతీ పెట్టడానికి యోగేంద్ర నిర్ణరుుంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు వినయ్‌తో కలిసి భర్తను హత్య చేయడానికి పథకం వేసింది. కుటుంబ విషయం మాట్లాడాలని భర్త యోగేంద్రను ఇంటికి పిలిపించింది. దీంతో శుక్రవారం రాత్రి యోగేంద్ర భార్య ఇంటికి బయలుదేరాడు. అప్పటికే గ్రామ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఎదురు చూస్తున్న ఆమె ప్రియుడు వినయ్‌గౌడ యోగేంద్రను తలపై బండరాళ్లతో మోది హత్య చేసి పారిపోయాడు. భార్యతో మాట్లాడ్డానికి వెళ్లిన తమ కుమారుడు ఎంతకీ తిరిగి రాకపవోడంతో యోగేంద్ర కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా గ్రామ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో యోగేంద్ర విగతజీవిగా పడిఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వినయ్‌గౌడను అరెస్ట్ చేసి విచారించగా యోగేంద్రను అతడి భార్యతో కలసి హత్య చేసినట్లు అంగీకరించారు. -
ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు మృతి
గేదెలకు కాపలాగా వెళ్లిన తల్లి, కొడుకు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. గుంటూరు జిల్లా శావల్యాపురంలో మండలం శానంపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యోగమ్మ(37) ఆమె కుమారుడు యోగేంద్ర(15) సోమవారం గేదెలు తోలుకుని పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సమీపంలోని వాగులోకి గేదెలు వెళ్లగా వాటి కోసం వెళ్లిన యోగేంద్ర 15 అడుగుల లోతు ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. అతడి కోసం వెళ్లిన యోగమ్మ కూడా నీటిలో మునిగి చనిపోయింది. వారు తిరిగి రాకపోయేసరికి తోటి వారు వెళ్లి వెదికారు. విగతజీవులుగా మారిన తల్లి, కొడుకును బయటకు తీశారు. -
మరో కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు శరవేగంగా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తమ మద్దతుదారులతో కలిసి అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 4న సమావేశమవుతున్నట్టు సమాచారం. ఆప్ మాజీ నేత, లోకపాల్ అడ్మిరల్ రామదాస్ సహా, ఇతర సన్నిహిత వర్గాలు కొన్ని ప్రజా సంఘాలు సమావేశంలో పాల్గొననున్నాయి. అలాగే ప్రశాంత్, యోగేంద్ర యాదవ్ ను పార్టీనుంచి తొలగించినందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసిన నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్ ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అనూహ్య మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీలో రగిలిన విభేదాలు తారా స్తాయికి చేరాయి. ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , పార్టీలో కీలక నేతలుగా ఉన్న యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి ఇరువురి నేతలను జాతీయ మండలి పదవులనుంచి తొలగించడంతో చీలిక అనివార్యమైంది.