వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని... | The affair was getting in the way of ... | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...

Published Mon, Nov 7 2016 4:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేరుుంచిన భార్య
నిందితుడి అరెస్ట్  

 
బెంగళూరు: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి తన భర్తను హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. వివరాలు...జిల్లాలోని ఎన్.ఆర్‌పుర తాలూకాలోని కట్టినమనె గ్రామానికి చెందిన యోగేంద్ర (42)కు సమీప గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇదిలా ఉంటే కొద్ది కాలంగా వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మృతుడి భార్య పుట్టింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు కుందాపురకు చెందిన బస్ డ్రైవర్ వినయ్‌గౌడతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి విషయం ఆమె భర్త యోగేంద్రకు తెలియడంతో పలుమార్లు భార్యను హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. పెద్దల ఎదుట పంచాయతీ పెట్టడానికి యోగేంద్ర నిర్ణరుుంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు వినయ్‌తో కలిసి భర్తను హత్య చేయడానికి పథకం వేసింది.

కుటుంబ విషయం మాట్లాడాలని భర్త యోగేంద్రను ఇంటికి పిలిపించింది.  దీంతో శుక్రవారం రాత్రి యోగేంద్ర భార్య ఇంటికి బయలుదేరాడు. అప్పటికే గ్రామ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఎదురు చూస్తున్న ఆమె ప్రియుడు వినయ్‌గౌడ యోగేంద్రను తలపై బండరాళ్లతో మోది హత్య చేసి పారిపోయాడు. భార్యతో మాట్లాడ్డానికి వెళ్లిన తమ కుమారుడు ఎంతకీ తిరిగి రాకపవోడంతో యోగేంద్ర కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా గ్రామ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో యోగేంద్ర విగతజీవిగా పడిఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వినయ్‌గౌడను అరెస్ట్ చేసి విచారించగా యోగేంద్రను అతడి భార్యతో కలసి హత్య చేసినట్లు అంగీకరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement