
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు
సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవి నాష్‌రెడ్డి విమర్శించారు.
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవి నాష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పులి వెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపె ట్టుకపోయిందన్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయాలను చూస్తుంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం క లుగుతోందన్నారు. టీడీపీ నాయకులు పో లీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డా రు.
రాజకీయాలలో హత్యా రాజకీయాలకు పాల్పడటం మంచి పద్ధతి కాదని హి తవు పలికారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రొత్సహించడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించారు. ప్రజలకు మం చి పనులు చేసి వారి అభిమానాన్ని చూరగొనాలి కానీ, వారిని భయభ్రాంతులకు గురిచేసి సాధించేది ఏమీ ఉండదన్నారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్ ఏ నాడు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదన్నారు. టీ డీపీ నేతల చేతిలో హత్యకు గురైన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల కుటుం బాలకు వైఎస్‌ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. టీడీపీ ఆరాచకాలపై వైఎస్ జగనన్న సారథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ గట్టిగా పోరాడుతుందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.