అక్టోబర్ 5న మాదిగల ఆత్మగౌరవ సభ
అక్టోబర్ 5న మాదిగల ఆత్మగౌరవ సభ
Published Thu, Sep 15 2016 6:16 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
విజయవాడ(గాంధీనగర్): అమలాపురంలో అక్టోబర్ 5న మాదిగల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెస్‌డెంట్ ఎంఎస్ రాజు చెప్పారు. అక్టోబర్ 25న నెల్లూరులోనూ, నవంబర్ 20న అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. స్థానిక హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల సమస్యలపై, ఎస్సీ వర్గీకరణ, దళితుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేసి వర్గీకరణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలన్నారు. బ్రాహ్మణులు, కాపులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం దిగివచ్చి వర్గీకరణ చేపట్టకపోతే భవిష్యత్‌లో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు.
సమావేశంలో మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లాజరస్, యువజన విభాగం రాష్ట్ర అ««దl్యక్షుడు జిన్ని, మహిళా అధ్యక్షురాలు దేవమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పవన్, విక్టోరియా, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement