
వైద్య పరీక్షలకు నిరాకరణ
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరింది. ఈ ఉదయం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన నిరాకరించారు. తనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యులను ఆయన అనుమతించలేదు.
ఆదివారం రాత్రి ఆయనతో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర రామారావు రెండో దఫా చర్చలు జరిపారు. ప్రభుత్వం తరపున కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు నేడు చర్చలు జరపనున్నారు. అయితే ఈ మధ్యాహ్నం ముద్రగడ దీక్ష విరమించే అవకాముందని తోట త్రిమూర్తులు తెలిపారు. కాగా, ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు నేడు కిర్లంపూడికి వస్తున్నారు.