పదవి ఆమెది.. పెత్తనం ఆయనది.. | mummidivaram, | Sakshi
Sakshi News home page

పదవి ఆమెది.. పెత్తనం ఆయనది..

Mar 14 2017 11:55 PM | Updated on Aug 10 2018 9:40 PM

పదవి ఆమెది.. పెత్తనం ఆయనది.. - Sakshi

పదవి ఆమెది.. పెత్తనం ఆయనది..

ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా ఉంది ముమ్మిడివరం నగర పంచాయతీలో అధికార తెలుగుదేశం పార్టీ తీరు. రకరకాల సాకులతో వైఎస్సార్‌ సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను.. స్వయంగా ‘ముఖ్య’నేత సారథ్యంలోనే స్కెచ్‌ వేసి.. ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయించిన సంగతి తెలిసిం

ముమ్మిడివరం :
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా ఉంది ముమ్మిడివరం నగర పంచాయతీలో అధికార తెలుగుదేశం పార్టీ తీరు. రకరకాల సాకులతో వైఎస్సార్‌ సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను.. స్వయంగా ‘ముఖ్య’నేత సారథ్యంలోనే స్కెచ్‌ వేసి.. ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయించిన సంగతి తెలిసిందే. ఇందుకు తామేమీ తీసిపోమనుకున్నారేమో నగర పంచాయతీలోని టీడీపీ సభ్యులు! విపక్ష వైఎస్సార్‌ సీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్‌ అయిన కాశి బాలమునికుమారిని కౌన్సిల్‌ నుంచి ఏకంగా మూడు నెలలపాటు సస్పెండ్‌ చేయించారు. ఇంతకూ ఆమె చేసిన నేరమేమిటంటే..నగర పంచాయతీ సమావేశ మందిరంలో చైర్‌పర్స¯ŒS చెల్లి శాంతకుమారి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. అజెండాలోని 9 అంశాలను ప్రవేశపెట్టి వాటిపై చర్చ జరుగుతుండగా బాలమునికుమారి మా ట్లాడారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు నగర పంచాయతీ కార్యాలయానికి వస్తుంటే చైర్‌పర్స¯ŒS చాంబర్‌లో ఆమె భర్త అశోక్‌ మాత్రమే ఉంటున్నారని అన్నారు. నగర పంచాయతీ పాలన వ్యవహారాలను ఆయన చక్కపెట్టడమేవిుటని, మీరెందుకు ఉండడంలేదని చైర్‌పర్స¯ŒSను నిలదీశారు. ఇదే ఆమె చేసిన పాపమైపోయింది. ‘‘అశోక్‌ ఎవరనే ప్రశ్నించే హక్కు నీకు లేదు’’ అంటూ చైర్‌పర్స¯ŒS శాంతకుమారి జవాబిచ్చారు. అవసరమైన సమయంలో చాంబర్‌లో తాను ఉంటానని, ఆ సమయంలో కలవవచ్చునని చెప్పారు. దీనిపై మునికుమారి అభ్యంతరం తెలిపారు. చైర్‌పర్స¯ŒS ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. కౌన్సిల్‌లో వ్యక్తిగత ఆంశాలు చర్చిస్తే సమాధా నం చెప్పాల్సిన పని లేదని చైర్‌పర్స¯ŒS అన్నారు. దీంతో వారిమధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కమిషనర్‌ పి.రవివర్మ చైర్‌పర్స¯ŒSకు వంత పలికారు. ఆయనపై వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ జనిపెల్ల రమేష్‌బాబు, పలువురు ప్రతిపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. నగర పంచాయతీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని మునికుమారి డిమాండ్‌ చేశారు. దీనిపై 5వ వార్డు కౌన్సిలర్‌ ములపర్తి బాలకృష్ణ స్పందిస్తూ ప్రతిపక్ష సభ్యురాలు దుష్ప్రచారం మాని, అవినీతి జరిగితే నిరూపించాలని సవాల్‌ విసిరారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
సభా మర్యాద పాటించకుండా, కౌన్సిల్‌లో వ్యక్తిగత దూషణలకు దిగారని పేర్కొంటూ.. చైర్‌పర్స¯ŒS ఆదేశాల మేరకు బాలమునికుమారిని మూడు నెలలపాటు కౌన్సిల్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు కమిషనర్‌ పి.రవివర్మ ప్రకటించారు. మరోపక్క చైర్‌పర్స¯ŒS చాంబర్‌లో అధికార టీడీపీ సభ్యులు సమావేశమై చైర్‌పర్స¯ŒSపై బాలమునికుమారి వ్యక్తిగత దూషణలకు దిగారని ఆరోపించారు. పలువురు సభ్యులు ఆయా వార్డుల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అజెండాలోని 9 అంశాలపై చర్చించి ఆమోదించారు. సమావేశంలో కౌన్సిలర్లు రెడ్డి రజనీకుమారి, బీమవరపు విజయ్, పిల్లి నాగరాజు, కుడిపూడి శ్రీనివాసరావు, వేటుకూరి బోసురాజు, సలాది రమాదేవి, పితాని పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement