అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి మిరుపురి సంగీత కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత విభావరి భక్తులను అలరించింది. ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ ఆయన ప్రేమతత్వాన్ని, సేవాభావాన్ని వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరం విద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.