యే.. అల్లాహ్‌ వర్షం కురిపించు | muslims poojas for rain | Sakshi
Sakshi News home page

యే.. అల్లాహ్‌ వర్షం కురిపించు

Published Sun, Aug 6 2017 9:59 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

యే.. అల్లాహ్‌ వర్షం కురిపించు - Sakshi

యే.. అల్లాహ్‌ వర్షం కురిపించు

రాయదుర్గం: ‘ఓ అల్లాహ్‌... వర్షాభావం వల్ల  సమస్త కోటి జీవరాసుల జీవితాలు మోడువారుతున్నాయి. నీ చల్లని చూపు ప్రసాదించి వర్షం కురిపించు’  అంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పట్టణంలోని కణేకల్లు రోడ్డు జామియా మహమ్మదీయ అరబిక్‌ కళాశాల ఆవరణలో ఖాజీ అతావుర్‌ రహిమాన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ముస్లిం సోదరులు వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఖాజీసాబ్‌ మాట్లాడుతూ వర్షం లేకపోవడం వల్ల ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆకాశం కరుణించక పోవడం వల్ల సమస్త కోటి కన్నీరు కారుస్తోందని, తమపై దయతలచి విస్తారంగా వర్షాలు కురిపించాలని అల్లాహ్‌ను వేడుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement