వర్షం కోసం ముస్లింల పూజలు | poojas for rain in bethalapalli | Sakshi
Sakshi News home page

వర్షం కోసం ముస్లింల పూజలు

Published Thu, Jul 27 2017 10:29 PM | Last Updated on Fri, Oct 19 2018 6:51 PM

poojas for rain in bethalapalli

గుత్తి రూరల్‌: మండలంలోని బేతాపల్లిలో వర్షం కోసం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ వర్షం రాక పోవడంతో ముందస్తుగా వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. దీంతో అల్లా కరుణించి వర్షాలు కురిపించాలని గ్రామాంలోని ముస్లింలు దస్తగిరి స్వామి జెండాలను ఊరేగించారు. మేళతాళాలతో గ్రామం నుంచి ఊటకల్లు, యంగన్నపల్లి గ్రామాల వరకూ ఊరేగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement