దుబాయ్‌లో దొడ్డిపట్ల యువకుడి అనుమానాస్పద మృతి
Published Wed, Sep 7 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
దొడ్డిపట్ల (యలమంచిలి) : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ యువకుడు అక్కడే కన్నుమూశాడు. గతనెల 18న జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన కొడమంచిలి నిత్యజీవన్‌రావు (26) ఉపాధి నిమిత్తం గత నెల 8న దుబాయ్ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన 10 రోజులకే అనుమానాస్పద రీతిలో మరణించాడు. దీంతో అతని తండ్రి, తల్లి, అక్క యరకయ్య, విజయలక్ష్మి, కుమారి పాలకొల్లు విశ్వమానవ వేదిక అధ్యక్షుడు మల్లుల సురేష్‌ను ఆశ్రయించడంతో తాడేపల్లిగూడేనికి చెందిన కైండ్‌నెస్ సొసైటీ సాయంతో మృతదేహాన్ని బుధవారం ఉదయం దొడ్డిపట్ల తీసుకువచ్చారు. వచ్చిన వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలకొల్లు నిత్యాన్నదానం టీం లీడర్ గుగ్గిలపు రామకృష్ణ, పారుపల్లి సత్యనారాయణ, కెల్ల సింహాచలం పాల్గొన్నారు.
Advertisement
Advertisement