mystory
-
‘మిస్టరీ’ పాట బాగుంది: చంద్రబోస్
అలీ, తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘మిస్టరీ’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటిస్తున్నాడు. స్నప్ప చౌదరి హీరోయిన్. అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి 'ఎదురయ్యే సవాళ్లు' పాట ను ఆస్కార్ అవార్డ్ విజేత పాటల రచయిత చంద్ర బోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ తవ్వ స్వరపరిచిన 'ఎదురయ్యే సవాళ్లు' చాలా బాగుంది. ఈ పాటకి సాహిత్యం అందించిన శ్రీనివాస్ సూర్య కి, పాడిన మనోజ్ కి అభినందలు. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నాను’అని అన్నారు. ‘ఇదొక కామెడీ థ్రిల్లర్. ఔట్పుట్ బాగొచ్చింది. పాటలతో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని డైరెక్టర్ సాయికృష్ణ అన్నారు. నేను అడగగానే మా సినిమా లోని పాటని చంద్రబోస్ గారు విడుదల చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను’అని హీరోయిన్ స్వప్న చౌదరి అన్నారు. -
ఓ తల్లి.. ఓ గ్రాడ్యుయేట్.. సుపారీ కిల్లర్స్..!
ఏడుగురు సంతానమున్న గృహిణి.. ఓ సైన్స్ గ్రాడ్యుయేట్, ప్రాపర్టీ డీలర్, ఒక నిరుద్యోగి, ఓ ఫిజియో థెరపిస్ట్...వైవిధ్య నేపథ్యమున్న వీరంతా ఎవరు ? ఏదైనా గొప్ప పని చేసి రికార్డ్ సృష్టించారని అనుకుంటున్నారా ? ఈ జాబితాలోని వారంతా కూడా కాంట్రాక్ట్ కిల్లర్స్ ! డబ్బిస్తే చాలు పిస్తోల్ ట్రిగ్గర్ నొక్కేందుకు, విషం ఇంజెక్షన్ ఇచ్చేందుకు, కత్తులు,ఇతర మారణాయుధాలు ఝుళిపించేందుకు వెనుకాడని హంతకులు. గతేడాది 50 కేసుల ఛేదన.. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క 2017 సంవత్సరంలోనే తక్కువలో తక్కువ 50 కాంట్రాక్ట్ హత్య కేసులను అక్కడి పోలీసులు ఛేదించారు. ఈ హంతకుల్లో కొంత మందికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఇందులో కొందరైతే మొదటిసారి నేరం చేసిన వారు. ఈ కాంట్రాక్ట్ హత్యల కోసం సుపారీగా తక్కువలో తక్కువగా రూ. 40 వేల వరకు కూడా ఇచ్చినట్టు వెల్లడైంది. ఈ హత్యలకు ఒక పద్ధతి లేదా ఒక విధానం అంటూ లేదు.కానీ ఢిల్లీ మహానగరంలో బతుకు వెళ్లదీసేందుకు అవసరమయ్యే పైకం కోసం హత్య, ఇతర నేరాలకు సిద్ధమవుతున్నట్టు తేలింది.ఢిల్లీ కాంట్రాక్ట్ కిల్లర్లలో ఎక్కువశాతం ఉత్తరప్రదేశ్, బిహార్ గ్రామాలకు చెందినవారే. దేశ వాణిజ్య రాజధాని ముంబై మొదలుకుని ఇతర నగరాల్లో కాంట్రాక్ట్ హత్యల ముఠాలు పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం వ్యవస్థీకృత కాంట్రాక్ట్ కిల్లర్లు లేరు. రూ. 4 కోట్ల సుపారీ... ఢిల్లీ పోలీస్ రికార్డుల ప్రకారం...గతేడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ హత్యల్లో అత్యధికంగా రూ. 4 కోట్ల మొత్తానికి సుశీల్, అమిత్, సునీల్, రమేశ్ (ఒక్కోక్కరికి కోటి చొప్పున) ఒప్పందం కుదిరింది. హరియాణాకు చెందిన సందీప్ బద్‌సావనియా అనే గ్యాంగ్‌స్టర్ హత్యకు అతడి ప్రత్యర్థి రామ్ కరణ్ ఈ మేరకు పథకం రచించాడు. గ్యాంగ్‌వార్‌లో భాగంగా ఇదో హైప్రొఫైల్ కాంట్రాక్ట్ హత్యగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ హత్యలో నలభైమంది పాలుపంచుకున్నారు. కొన్నినెలల పాటు బద్‌సావనియా కదలికలను గమనించారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా రికార్డు, అనుపానులు తెలుసుకునేందుకు ప్రైవేట్ గూఢచారుల సేవలు ఉపయోగించుకున్నారు. హత్య చేశాక మృతదేహాన్ని 400 కి.మీ అవతల పడేసి వచ్చారు. ప్రధాన హంతకులు నలుగురు 2016–17 మధ్యకాలంలో 9 హత్యలు చేసినట్టు బయటపడింది. చిన్న కారణాలకూ హత్యలు... గ్యాంగ్‌లపై ఆధిపత్యం కోసం జరిగిన హత్యలకు భిన్నంగా, ఢిల్లీలో ఈర్ష్య, అసూయ, ఆస్తి వివాదం, పెళ్లి పెటాకులు కావడం మొదలు చిన్న చిన్న కారణాలకు కూడా కాంట్రాక్ట్హత్యలు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 1973లో విడాకుల కారణంగా నరేంద్రసింగ్ జైన్ అనే కంటి డాక్టర్ తన భార్య విద్యాజైన్ హత్యకు రూ. 25 వేల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఢిల్లీలో జరిగిన తొలి కాంట్రాక్ట్ హత్యల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. 1977లో నరేంద్రసింగ్‌కు శిక్ష పడింది. గతేడాది నవంబర్‌లో తన భర్త హత్యకు బరేలికి చెందిన అబ్దుల్ మున్నార్‌కు ఓ యువతి కాంట్రాక్ట్నిచ్చింది. తనకిస్తానన్న రూ. 5 లక్షల్లో కేవలం రూ. 50 వేలే అందడంతో షార్ప్‌షూటర్‌గా పేరుపొందిన మున్నార్ కాలిపై మాత్రమే కాల్పులు జరిపాడు. హత్యకు ముందే కాంట్రాక్ట్ మొత్తం డబ్బు పొందేందుకు వేచిచూస్తున్న అతడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మర్డర్ కాంట్రాక్ట్‌లో రికార్డున్న మున్నార్, 10,15 పర్యాయాలు జైలుకెళ్లి అక్కడ అనేక మందిని మిత్రులు చేసుకున్నాడు. ఒకరి హత్యకు జైల్లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నందుకు 2015లో పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఫిజియో థెరపిస్ట్... ప్రేంకుమార్ అనే నిరుద్యోగ ఫిజియో థెరిపిస్ట్ తన పెళ్లి ఖర్చు కోసం రూ.5 లక్షలకు ఓ హత్యా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఈ హత్య కోసం విషపూరితమైన రెండు ఇంజక్షన్లు ఉపయోగించాడు. తూర్పు ఢిల్లీ కోండ్లిలో ఓ పాలవ్యాపారి హత్యకు అతడి భార్య రూ. 40 వేలకు కాంట్రాక్ట్ ఇచ్చింది. అక్కడి పాదరక్షల ఫ్యాక్టరీలో పనిచేసే ప్రమోద్‌కుమార్, వివేక్‌కుమార్ ఈ హత్య చేశారు. ఇది వారి మొదటి నేరం. నోయిడాలోని ఓ హోటల్ యజమాని హత్యకు పథకం పన్నిన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రాపర్టీ డీలర్లు మొదలుకుని జిమ్ ట్రైనర్ల వరకున్నారు. ఏడుగురు సంతానమున్న బసిరన్ అనే 62 ఏళ్ల మహిళ రూ. 60 వేలకు హత్యా కాంట్రాక్ట్ తీసుకుంది. దొంగతనం, హత్య, బలవంతపు వసూళ్లు వంటి నేరాలపై జైలుశిక్ష అనుభవిస్తున్న తన కొడుకుల కోర్టు ఫీజుల కోసం ఆమె రూ. 18 వేలు అట్టే పెట్టుకుంది. మిగతా డబ్బును ఇద్దరు నిరుద్యోగులకిచ్చి హత్య చేయాల్సిన వ్యక్తి ముఖం కాల్చేసి శివార్లలోని అడవుల్లో పూడ్చేయాలని ఆదేశించింది. కొన్ని ముఖ్యమైన కేసులు... 2017 అక్టోబర్‌లో ఢిల్లీలోని షాదరా మానససరోవర్ పార్కులో నలుగురు మహిళలు, ఓ సెక్యూరిటీగార్డు హత్యకు ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ. 2 లక్షల చొప్పున చెల్లింపు. వీరిపై 3 దొంగతనం కేసులున్నాయి. 2017 జూన్‌లో అండర్‌వరల్డ్ డాన్ ఛోటారాజన్ హత్యకు అతడి పాలవాడి కొడుకు జునైద్ చౌదరికి రూ. 1.5 లక్షలకు కాంట్రాక్ట్. అయితే ఈ నేరం చేయక ముందే అతడిని అరెస్ట్‌చేశారు. జునైద్పైనా రెండు కేసులున్నాయి. 2017 మేలో బీఎస్పీ నేత చౌదరి మునవ్వర్ హసన్, భార్య, 4 పిల్లల హత్యకు రూ.3 లక్షలకు మునవ్వర్ స్నేహితుడు కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఈ పనిని ఫిరోజ్, జుల్ఫీకర్ అనే నిరుద్యోగ యువకులకు అప్పగించాడు. వీరిపైనా కేసులున్నాయి. 2016 మేలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ లీగల్ అఫీసర్ ఎంఎంఖాన్ను ఆయన ఇంటి బయటే కాల్చిచంపారు. ఈ హత్యకు ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రూ.3.5 లక్షలకు ఇజ్రాయిల్, సలీంఖాన్, అమిర్ అల్వి, అన్వర్ ఒవైస్ అనే యువకులకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అంతుచిక్కని ప్రశ్నలెన్నో..!
శ్రీగౌతమి మృతి కేసు దర్యాప్తులో అన్నీ అనుమానాలే స్టేట్మెంట్ కాపీపై సంతకం తనది కాదంటున్న పావని హత్యకేసుగా నమోదు చేయాలని పెరుగుతున్న డిమాండ్ నిర్భయ చట్టం దేవుడెరుగు.. కనీసం ఈవ్‌టీజింగ్ కేసైనా పెట్టని పోలీసులు నరసాపురం : నరసాపురం పట్టణానికి చెందిన దంగేటి శ్రీగౌతమి మృతి కేసుకు మసిపూసి మారేడుకాయ చేశారాఽ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత సజ్జా బుజ్జి కుటుంబానికి పూర్తిగా కొమ్ము కాసేందుకే కట్టుబడి ఉన్నారా.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వారం రోజులుగా చెబుతూ వచ్చిన పోలీసులు రాష్ట్రస్థాయి నేతల వత్తిళ్లకు పూర్తిగా దోసోహమన్నారా.. అనే అనుమానాలకు అవుననే అనిపిస్తోంది. శ్రీగౌతమి మృతి కేసును ప్రమాదవశాత్తు జరిగిందేనని పోలీసులు ఇప్పటికే తేల్చేశారు. విశాఖకు చెందిన ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. శ్రీగౌతమి మృతి చెందిందని తెలిసిన రోజునుంచి ఇది ముమ్మాటికీ హత్యేనని.. ప్రమాదంలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ పావని చెబుతూ వస్తోంది. తన అక్కకు టీడీపీ నేత బుజ్జితో వివాహం జరిగిందని, అతని మొదటి భార్య తన అక్కను బెదిరిస్తోందని ఆరోపిస్తోంది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. అక్క చనిపోయిందని తెలియక ముందునుంచీ మొదటి మూడు రోజులపాటు పావని తమను కారులో కొందరు వెంబడించారని, కారులోంచి తన చున్నీ పట్టుకుని లాగే ప్రయత్నం చేశారని చెబుతోంది. శ్రీగౌతమిని సజ్జా బుజ్జి రహస్య వివాహం చేసుకోవడం వంటి విషయాలు పక్కన పెడితే.. కనీసం ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినట్టు తేలినా దీనిపై పోలీసులు శ్రద్ధ పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిజానికి శ్రీగౌతమి కేసును నిర్భయ చట్టం కింద నమోదు చేయాలని పౌర హక్కులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ చట్టం కింద కేసు నమోదు చేయడం దేవుడెరుగు.. కనీసం ఈవ్‌టీజింగ్ సెక్షన్లు అయినా నమోదు చేయకపోవడం వెనుక కారణాలేమిటనేది అంతుబట్టడం లేదు. పోలీసులు కేవలం రెండు సెక్షన్లతో కేసు నమోదు చేసి ఊరుకున్నారు. దొరికిన నిందితులపైనా కనికరం ఎందుకు విశాఖకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఘటనకు కారకులుగా నిర్ధారించారు. ప్రమాదంలో శ్రీగౌతమి మృతికి కారణమైనందుకు 304 (ఎ), ఘటనలో పావని గాయాల పాలైనందుకు 338 ఽసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు కారులో తమను కొంతదూరం పాటు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారని పావని ఆరోపిస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పానంటోంది. మరికొన్ని సెక్షన్ల కిందఽ నిందితులపై కేసులు పెట్టే అవకాశం ఉన్నా పోలీసులు ఎందుకు ముందడుగు వేయలేదనేది మరో ప్రశ్న. ఎంత చెప్పినా సజ్జా బుజ్జి, అతని భార్యపై పేరును కేసులో ప్రస్తావించడం లేదని పావని వాపోతోంది. ఘటన జరిగిన రెండో రోజునే, ఇది ప్రమాదమని, ఇద్దరు నిందితులు అదుపులో ఉన్నారని పాలకొల్లు పోలీసులు చెప్పారు. 8 రోజుల దర్యాప్తు తరువాత కూడా వారినే చూపించారు. మరి నిందితుల వివరాలు తెలపడానికి ఇంత సమయం తీసుకుని పోలీసులు ఏంచేశారనేది ఇంకో ప్రశ్న స్టేట్మెంట్ కాపీని అనుకూలంగా మార్చుకున్నారా ప్రమాదం జరిగిన తరువాత పావని నుంచి తీసుకున్న స్టేట్మెంట్ కాపీ తారుమారైందనే ఆరోపణలూ వస్తున్నాయి. ఎఫ్ఐఆర్కు జతచేసిన స్టేట్మెంట్ కాపీపై సంతకం తనది కాదని పావని చెబుతోంది. తన సంతకం వేరే విధంగా ఉంటుందని స్పష్టం చేస్తోంది. అలాగే ఐక్య ఎమర్జెన్సీ ఆసుపత్రిలో పోలీసులు తన స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు.. తమను కారులో కొందరు వ్యక్తులు టీజ్ చేశారని, కావాలని వెంబడించి ఢీకొట్టారని చెప్పానని తెలిపింది. పోలీసులు తనకు ఇచ్చిన ఎఫ్ఐఆర్తో కూడిన స్టేట్మెంట్ కాపీలో ఈ వివరాలేమీ లేవనేది పావని కొత్తగా తెరమీదకు తెస్తున్న వాదన. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసేప్పుడు, సంబంధిత వ్యక్తుల బంధువుల సమక్షంలో చేస్తారు. సాక్షులుగా వారి సంతకాలు తీసుకుంటారు. తన వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు, వరుసకు తనకు సోదరుడైన కె.మణికంఠ అనే సంతకం పెట్టాడని పావని చెబుతోంది. పోలీసులు తనకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రతిలో సాక్షి సంతకం లేదంటోంది. దీనినిబట్టి కావాలనే వేరే స్టేట్మెంట్ తయారు చేశారా? అనే అనుమానం కలుగుతోంది. ఘటన జరిగిన రోజు కారులో క్రికెట్ బ్యాట్లు, మందు బాటిళ్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో వీటికి సమాధానం లేదు. వైజాగ్ నుంచి మూడురోజుల క్రితమే నిందితులు బయలుదేరారిని చెప్తున్నారు. వారు ఎక్కడెక్కడ తిరిగారు అనే దానిపై కూడా స్పష్టత లేదు. మొత్తం ఘటనలో కీలకంగా ఉన్న సజ్జా బుజ్జి ప్రమాదం జరిగిన తరువాత ఆసుపత్రికి వచ్చాడు. శ్రీగౌతమి మృతి చెందిన తరువాత అదృశ్యమయ్యాడు. ఇలా అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడుతున్నాయి. శ్రీగౌతమి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైతం కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా నివృత్తి చేయాలని పోలీసులకు సూచించారు. లేదంటే కేసు ఇంకా బలపడుతుందని, అనుమానాలు పెరుగుతాయని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. న్యాయ పోరాటం చేస్త కేసులో న్యాయం జరగటం లేదు. ఆ అక్క హత్యకు గురైంది. నేను చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోలేదు. నన్ను టీజ్ చేశారని చెప్పాను. స్టేట్మెంట్ కాపీపై సంతకం నాది కాదు. మా అన్నయ్య సాక్షి సంతకం పెట్టాడు. నాకు ఇచ్చిన కాపీలో అది లేదు. బుజ్జి, అతని భార్యపై న్యాయ పోరాటం చేస్తాను. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి. హత్యకేసుగా నమోదు చేయాలి. నా పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నాను. దంగేటి పావని, నరసాపురం -

మహిళ అనుమానాస్పద మృతి
మృతురాలి కుమార్తె సమాచారంతో విషయం వెలుగులోకి పెద్దాపురం : సాధారణ మరణంగా భావించి ఖననం చేసిన ఓ మహిళ మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం శనివారం వెలికితీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సంగటాల మహాలక్ష్మి, నర్సయ్యమ్మలు తమ కుమార్తె సంగటాల వరలక్షి్మని 2006లో అమలాపురానికి చెందిన అమలదాసు రాజ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. అడ్డతీగల అటవీ రేంజ్ చవిటిదిబ్బల ఫారెస్ట్ గార్డుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ అక్కడే భార్యతో కలసి జీవిస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ 24న వరలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిందంటూ రాజ్‌కుమార్ భార్య మృత దేహాన్ని అత్తవారింటికి పంపే శాడు. కుమార్తె మృతి చెందిందన్న శోకంలో ఉన్న తల్లిదండ్రులు, బంధు వులు తదుపరి కర్మకాండలు పూర్తి చేశారు. రెండు రోజుల తరువాత అమ్మ ఎలా చనిపోయిందని వరలక్ష్మి కుమార్తెను పెద్దలు అడగ్గా నాన్న కొట్టాడని ఆ చిన్నారి సమాధానం ఇచ్చింది. దీంతో వరలక్ష్మి తల్లిదండ్రులు, బంధువులు అడ్డతీగల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై యర్రంశెట్టి గణేష్‌కుమార్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం పెద్దాపురం తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎస్సై గణేష్‌కుమార్, హెచ్‌సీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరలక్ష్మి మృత దేహాన్ని స్థానిక బంగారమ్మ గుడి వీధికి చెందిన శ్మశాన వాటిక నుంచి వెలికితీయగా, వైద్యులు విజయ్‌మోహన్, ప్రశాంతి శవ పంచనామా చేశారు. -
దుబాయ్‌లో దొడ్డిపట్ల యువకుడి అనుమానాస్పద మృతి
దొడ్డిపట్ల (యలమంచిలి) : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ యువకుడు అక్కడే కన్నుమూశాడు. గతనెల 18న జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామానికి చెందిన కొడమంచిలి నిత్యజీవన్రావు (26) ఉపాధి నిమిత్తం గత నెల 8న దుబాయ్ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన 10 రోజులకే అనుమానాస్పద రీతిలో మరణించాడు. దీంతో అతని తండ్రి, తల్లి, అక్క యరకయ్య, విజయలక్ష్మి, కుమారి పాలకొల్లు విశ్వమానవ వేదిక అధ్యక్షుడు మల్లుల సురేష్‌ను ఆశ్రయించడంతో తాడేపల్లిగూడేనికి చెందిన కైండ్‌నెస్ సొసైటీ సాయంతో మృతదేహాన్ని బుధవారం ఉదయం దొడ్డిపట్ల తీసుకువచ్చారు. వచ్చిన వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో పాలకొల్లు నిత్యాన్నదానం టీం లీడర్ గుగ్గిలపు రామకృష్ణ, పారుపల్లి సత్యనారాయణ, కెల్ల సింహాచలం పాల్గొన్నారు. -
మిస్టరీ వీడని నేరాలు
– చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిందెవరు? – వక్కల పేటలో షంషుద్దీన్‌ను హత్య చేసిందెవరు? కడప అర్బన్: కడప నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన కొన్ని నేరాలకు సంబంధించి నిందితులను గుర్తించే విషయంలో పోలీసులకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసు మిస్టరీలను ఎలా ఛేదించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్లో ఈనెల 20న మధురాంతకం శశికళ ఇంట్లో దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసులో ఇంతవరకు పోలీసులకు క్లూ లభించలేదు. శశికళ కుమారుడు, కుమార్తెలు దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి కామాక్షమ్మ ప్రధాన ద్వారం తర్వాత గదిలోనే పడుకుని ఉంటుంది. ఈ క్రమంలో ఎవరు చోరీకి పాల్పడ్డారనేది ఎటూ తేల్చుకోలేక పోలీసులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈనెల 9వ తేదిన కప్‌బోర్డులో బంగారు ఆభరణాలను ఉంచి కప్బోర్డు తాళాలను శశికళ తన వద్ద ఉంచుకున్నారు. తర్వాత 13వ తేదీ తాళాల కోసం వెతికినా కనిపించలేదు. దీంతో 19వ తేదిన కప్బోర్డును కార్పెంటర్ సహాయంతో తీయించారు. అప్పుడు బంగారు ఆభరణాలు ఉన్నాయా? లేదా? అన్నట్లు బ్యాగులో వెతికారు. కానీ అందులో బంగారు ఆభరణాలు దాచి ఉంచిన బాక్సు అలాగే ఉంది. కానీ బంగారు ఆభరణాలు మాత్రం కనిపించలేదు. దీంతో నివ్వెరబోయిన శశికళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం, చిన్నచౌకు పోలీసులు అందరూ కలిసి తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ నేరం ఎవరు చేశారనేది అంతుచిక్కడం లేదు. షంషుద్దీన్ హత్య ఇదే తరహాలో టూ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో వక్కలపేటలో ఈనెల 20వ తేదీ రాత్రి నుంచి 21వ తేదీ తెల్లవారుజాము మధ్యలో హత్యకు గురైన షేక్ షంషుద్దీన్ (58) హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఇతన్ని హత్య చేసింది ఎవరు.. అతనితో పాటు మద్యం సేవించేందుకు వచ్చిన వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా.. లేక మరెవరైనా చేశారా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ స్వయంగా వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంతవరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు.