స్పీకర్ కోడెలతో లోకేష్ భేటీ | nara lokesh meets AP Speaker kodela sivaprasad rao in guntur | Sakshi
Sakshi News home page

స్పీకర్ కోడెలతో లోకేష్ భేటీ

Published Sat, Aug 20 2016 4:40 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

స్పీకర్ కోడెలతో లోకేష్ భేటీ - Sakshi

స్పీకర్ కోడెలతో లోకేష్ భేటీ

మూడు గంటలపాటు వివిధ అంశాలపై చర్చ
రాజకీయ ప్రాధాన్యతేమీ లేదన్న కోడెల

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం భేటీ అయ్యారు. గుంటూరులోని రహదారులు, భవనాల శాఖ అతిధిగృహంలో వీరిద్దరూ సుమారు మూడు గంటలపాటు వివిధ అంశాలపై  చర్చించారు.

తాను సభాపతి కోడెలను కలిసి మూడు నాలుగు నెలలు అవుతుందని, గుంటూరులో ఆయన ఉండటంతో వచ్చి కలిశానని లోకేష్ చెప్పారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పీకర్ కోడెల సాక్షికి తెలిపారు. ఐతే వీరిద్దరి మధ్య రాజకీయ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement