నర్సంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
Published Fri, Sep 16 2016 12:58 AM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM
నర్సంపేట : నర్సంపేటను పాకాల జిల్లా కేం ద్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సం దర్భంగా కమిటీ గౌరవాధ్యక్షుడు సాంబ రాతి మల్లేశం మాట్లాడుతూ నర్సంపేట జిల్లా కోసం తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా పోరాడాలని విద్యార్థులు, యువకులకు పిలుపునిచ్చారు. నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. జిల్లా ఏర్పాటయితే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ధర్మారం వద్ద రూరల్ జిల్లా కేంద్రాన్ని ఏర్పా టు చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యాపశెట్టి రాజు, భూక్య జగ¯ŒS, ఆబర్ల రాజన్న, శ్రీశైలం, మొగిళి ప్రతాప్‌రెడ్డి, సుభాష్, అజ్మీర రమేష్, భూక్య కళ్యాణ్, మాలోతు సంతోష్, గుగులోతు మహేందర్, రవి, కట్ల రాజశేఖర్ పాల్గొన్నారు.
పాకాల జిల్లా ఏర్పాటు చేయాలి : ఎల్‌హెచ్‌పీఎస్
నర్సంపేట కేంద్రంగా పాకాల జిల్లాను ఏర్పా టు చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీ య కార్యదర్శి వాసునాయక్ డిమాండ్ చేశా రు. పట్టణంలో గురువారం నిర్వహించిన ఎల్‌హెచ్‌పీఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకతీయుల చరిత్ర కలిగిన పాకాల పేరుతో రూరల్ జిల్లాను నర్సంపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాచేస్తే పరిపాలన పరంగా అన్నివర్గాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. నాయకులు జాటో తు తిరుపతినాయక్, రాజేందర్, అనిల్, తిరుపతి, జన్ను శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement