- జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంబటి శ్రీనివాస్
నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలి
Published Sun, Sep 11 2016 11:54 PM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM
నర్సంపేట : ప్రజాభీష్టం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు, జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అంబటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభీష్టం మేరకు కాకుండా రాజకీయ స్వప్రయోజనాల కోసం జిల్లాలను ఏర్పాటుచేస్తే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నర్సంపేట నియోజకవర్గాన్ని పూర్తిగా వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలన్నారు. ఒకవేళ గ్రామీణా జిల్లాను ఏర్పాటు చేయాల్సి వస్తే అన్ని వసతులు ఉన్న నర్సంపేటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో నర్సంపేటలో జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్ పర్యటిస్తారని అంబటి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులతో నిర్వహించనున్న భారీ రోడ్‌షోలో ఆయన పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్, కాంగ్రెస్ నాయకులు పాలాయి శ్రీనివాస్, పోలబోయి లక్ష్మయ్య, టీడీపీ నాయకులు ఎర్ర యాకుబ్‌రెడ్డి, వేముల బొందయ్య, సుధాకర్, బూర సుమన్‌గౌడ్, కల్లేపల్లి ప్రణయ్‌దీప్, షేక్ జావిద్, రుద్ర ఓంప్రకాశ్, బోనగాని రవీందర్, మాచర్ల రమేష్, సోల్తి సారయ్య, గంగిడి సాంబిరెడ్డి, అంబటి యోగేశ్వర్, సూర్యప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement