నర్సంపేట బంద్ విజయవంతం
Published Fri, Sep 9 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
నర్సంపేట : నర్సంపేటను ప్రత్యేక జిల్లా కోరుతూ చేపట్టిన బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వాణిజ్య, వ్యాపా ర, పెట్రోల్‌బంక్, విద్యాసంస్థలు, బ్యాం కులు స్వచ్ఛందగా బంద్ చేపట్టారు. ఉదయం అన్ని పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి శాంతియుత వాతావరణంలో బంద్ చేయించారు. అనంతరం బస్టాం డ్ మొదటి గేటు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశం లో జేఏసీ డివిజన్ కార్యదర్శి అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు జిల్లాలను చేయాల్సి ఉండగా ప్రభుత్వం కొందరి స్వార్ధ ప్రయోజనాల కోసం జిల్లాలను ఏర్పాటుచేస్తున్నారే తప్పా ప్రజల అవసరాల కోసం చేయ డం లేదని విమర్శించారు. అన్ని వసతులు ఉన్న నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేసి పాకాల జిల్లాగా నామకరణం చేయాలన్నారు.
విధి విధానాలు లేకుండా చేయడం సరికాదు : పి.శ్రీనివాస్, కౌన్సిలర్
విధి విధానాలు ప్రకటించకుండా ఇష్టార్యాజంగా జిల్లాలను చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, తక్షణమే విధి విధానాలు ఏర్పాటుచేసి ఆయా పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభీష్టం మేరకు జిల్లాలను చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వసతులు ఉన్న నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు డాక్టర్ జగదీశ్వర్, ఎర్ర యాకుబ్‌రెడ్డి, బానోత్ లక్ష్మణ్‌నాయక్, పెండెం రామానంద్, షేక్ జావీద్, కళ్లెపల్లి ప్రణయ్‌దీప్, న్యాయవాదులు పాల్గొన్నారు.
Advertisement