- ఆర్టీసీ ఈడీ ముక్కాల రవీందర్
- పలు డిపోల్లో తనిఖీలు
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు
Published Sat, Oct 1 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
హన్మకొండ : కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్టీసీ ఈడీ(ఈ) ముక్కాల రవీందర్ తెలిపారు. హన్మకొండలోని ఆర్టీసీ వరంగల్-2, హన్మకొండ డిపోలతో పాటు మభబూబాబాద్ డిపోను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపోల్లోని మెకానికల్ విభాగాలు, బస్సుల కండీషన్లను పరిశీలించిన ఆయన మెకానిక్‌ల సమస్యలపై ఆరా తీశారు. హన్మకొండ డిపోకు కొత్తగా వచ్చిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల కండీషన్‌ను అడిగి తెలుసుకున్నారు.
కాలం చెల్లిన బస్సులు, ప్రధానంగా 6.50 లక్షలు కిలోమీటర్లు తిరిగి సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ చెప్పారు. ఈ మేరకు వరంగల్ రీజియన్‌కు కొత్తగా 50 బస్సులు రానున్నాయన్నారు. ఇక ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా హన్మకొండ-హైదరాబాద్ రూట్‌లో మినీ బస్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. వరంగల్‌లోని వివిధ కాలనీల నుంచి హైదరాబాద్‌లోని పలు కాలనీలకు నేరుగా ఈ బస్సులు నడుస్తాయని, వీటిని దసరా నుంచే ప్రారంభించేలా కృషి చేస్తున్నట్లు ఈడీ రవీందర్ వివరించారు. ఈ మేరకు ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలని కోరారు. కాగా, హన్మకొండ, వరంగల్-2 డిపోల పరిశీలన సందర్భంగా ల్లో బస్సులు మరమ్మత్తు చేసే కందకం(పిట్)లోకి నీరు వస్తోందని, అందులోని వైర్లు తడిసి షాక్ తగులుతోందని మెకానిక్‌లు ఈడీ రవీందర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఆర్టీసీ మెకానిక్‌లకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్, డిప్యూటీ సీఎంఈ జి.రాములు, డిపో మేనేజర్లు భానుకిరణ్, అర్పిత పాల్గొన్నారు.
Advertisement
Advertisement