old buses
-
మేం మారం.. మార్చం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తోంది. దీంతో రాష్ట్రాల్లోని ఆర్టీసీల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచేందుకు ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)’పథకం కింద బ్యాటరీ బస్సులను కేంద్రం రాయితీకి అందిస్తోంది. రాష్ట్రంలో కూడా ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ఆరీ్టసీలో సాధారణ ప్రయాణికుల కోసం ఇప్పటివరకు ఒక్క బ్యాటరీ బస్సు కూడా వినియోగంలో లేదు. విమానాశ్రయానికి వినియోగిస్తున్న 40 బస్సులు మినహా ఆరీ్టసీలో ఒక్క ఎలక్ట్రిక్ బస్సు కూడా లేదు. దీంతో సాధారణ బస్సుల నుంచి విపరీతమైన కాలుష్యం వెలువడుతుండటమే కాకుండా, ఇంధన రూపంలో భారీగా ఖర్చు అవుతోంది. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ఆరీ్టసీకి.. ఇంధన ఖర్చు చాలా భారంగా మారింది. ఆర్టీసీ చేస్తున్న మొత్తం వ్యయంలో దాదాపు 30 శాతం ఇంధనానికే ఖర్చవుతోందంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల వాడకంవైపు ఆర్టీసీ దృష్టి సారించట్లేదు. మారుస్తామని ముందుకొచ్చినా.. కొత్తగా ఓ బ్యాటరీ బస్సు కొనాలంటే రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్లు అవుతుంది. అంత ఖర్చు భరించే స్థాయిలో ఆర్టీసీ లేదు. కానీ ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశముంది. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఇటీవల బస్సులను మారుస్తామని ముందుకొచి్చనా ఆర్టీసీ దాన్ని పట్టించుకోలేదు. కాగా, ఆరీ్టసీలో ప్రస్తుతం దాదాపు 7 వేల బస్సులున్నాయి. అన్నింటినీ కాకున్నా.. హైదరాబాద్ సిటీలో తిరిగే బస్సులనే కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.. ఇంధన పొదుపుతో భారీ లాభం.. డీజిల్ వినియోగం ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతోంది. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో పర్యావరణం కూడా దెబ్బతింటోంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. మన దేశంలో సమీప భవిష్యత్తులో ఇవి పెద్ద సమస్యలు కానున్నాయి. వాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచటమే విరుగుడు. దేశంలో హైబ్రిడ్ నమూనా పక్కాగా జరుగుతోంది. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సు కొనటం భారీ వ్యయంతో కూడుకున్న పని. అందులో 10 శాతంలోపు ఖర్చుతో సాధారణ బస్సును ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేయవచ్చు. ఇది విజయవంతంగా అమలవుతున్న కొత్త పరిజ్ఞానం. ఎక్కువ బస్సులు వినియోగించే ఆర్టీసీ దీనిపై దృష్టి సారిస్తే సంస్థకు, ప్రజలకు ఎంతో ఉపయోగం. బస్సును పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంగా మారిస్తే అయ్యే ఖర్చు కంటే హైబ్రిడ్ నమూనాలోకి మార్చటం చాలా తక్కువ.’ – శుభం గుప్తా, ఎలక్ట్రిక్ వాహనరంగ నిపుణులు ఏడాది పొదుపుతో కన్వర్షన్.. ప్రస్తుతం మన దేశంలో సాధారణ బస్సులను ఎలక్ట్రిక్ వెర్షన్‌లోకి కన్వర్ట్ చేసే పరిజ్ఞానం ఉంది. ఒక బస్సును కన్వర్ట్ చేయటానికి అయ్యే వ్యయం రూ.8 లక్షలు. సిటీలో 3 వేల బస్సులుంటే.. అన్నింటిని మారిస్తే అయ్యే వ్యయం రూ.240 కోట్లు. కన్వర్షన్ వల్ల సాలీనా పోగయ్యే ఇంధన పొదుపు (రూ.300 కోట్లు) కంటే ఇది తక్కువ. ఒకసారి పెట్టుబడి పెడితే ఏడాదిలోనే అంతకుమించి తిరిగి వస్తుందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడల్లోకి కాకుండా హైబ్రిడ్ పద్ధతిలో కన్వర్ట్ చేసే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అంటే.. ఇటు డీజిల్, అటు కరెంటుతో నడిపే వెసులుబాటన్నమాట. ఎలక్ట్రిక్ నమూనాలోకి కన్వర్ట్ అయ్యాక ఏదైనా సమస్య ఉత్పన్నమైతే, దాన్ని పరిష్కరించేవరకు డీజిల్‌తో నడుపుకోవచ్చు. పర్యావరణానికి ఎంత మేలో.. ఒక సిటీ బస్సు సంవత్సరానికి దాదాపు 200 కిలోల కార్బన్‌ను విడుదల చేస్తోంది. ప్రస్తుతం నగరంలో 3 వేల వరకు సిటీ బస్సులున్నాయి. అటూఇటుగా చూస్తే దాదాపు 6 లక్షల కిలోల కార్బన్‌ను విడుదల చేస్తున్నాయి. అంటే నగర జనం ఆరోగ్యం అంతగా పదిలం కాదని ఇట్టే అర్థమవుతోంది. ఈ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారిస్తే.. జీరో పొల్యూషన్. వాతావరణంలో కలిసే వాహన కాలుష్యాన్ని తగ్గించినట్లూ అవుతుంది. వార్షిక ఇంధన ఆదా.. రూ.300 కోట్లు.. ప్రస్తుతం నగరంలో ఉన్న సిటీ బస్సులు కాల్చే ఇంధన వ్యయం వార్షికంగా రూ.494 కోట్లు. ఇది ప్రస్తుతం ఉన్న డీజిల్ ధరల ప్రకారం. కొంతకాలంగా డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ ధర పెరిగే కొద్దీ ఆర్టీసీ వార్షిక డీజిల్ భారం అంతగా పెరుగుతుంది. అదే సిటీ బస్సులన్నింటిని ఎలక్ట్రిక్‌లోకి కన్వర్ట్ చేస్తే.. వాటి వార్షిక ఇంధన వ్యయం రూ.200 కోట్లు. అంటే దాదాపు రూ.300 కోట్లు వార్షిక ఇంధన పొదుపన్నమాట. -
డొక్కు బస్సులే దిక్కు !
సాక్షి, హుస్నాబాద్,మెదక్: రవాణా సౌకర్యం మెరుగుపడినా బస్సుల సంఖ్య పెరగడం లేదు. ఎక్స్‌ప్రెస్ బస్సులు అసలు కనిపించడమే కరువయ్యాయి. డిపో ప్రారంభం అయినప్పుడు ఎన్ని బస్సులున్నాయో? నేటికీ అదే సంఖ్యలో బస్సులు ఉండటం గమనార్హం. స్క్రాప్ బస్సుల పేరిట ఇక్కడి నుంచి బస్సులను పక్కనబెడుతున్నా.. వాటి స్థానంలో మళ్లీ పాత బస్సులకే కలరింగ్ చేసి వినియోగిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. పెద్ద బస్సుల స్థానంలో మినీ బస్సులను తెచ్చి డిపోను మరింత నష్టాల్లోకి నెట్టేశారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో మొత్తం 54 బస్సులున్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందిన 4 ఎక్స్‌ప్రెస్‌లు, 2 సూపర్ లగ్జరీ, 25 ఆర్డినరీ, 11 మిని పల్లె వెలుగు బస్సులున్నాయి. అలాగే 2 అద్దె బస్సులు(ఎక్స్‌ప్రెస్), 10 హైర్‌విత్ ఆర్డీనరీ బస్సులు నడుస్తున్నాయి. బస్సుల నిర్వాహణకు గాను 89 మంది డ్రైవర్లు, 94 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. హ్నుస్నాబాద్ డిపో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. డిపోలోని మొత్తం 54 బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. మినీ బస్సులు తక్కువ దూరంలో ఉన్న గ్రామాల్లో నడిపించి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించాల్సింది. అంతే కాకుండా కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈ బస్సులను నడిపించడంతో కొత్తదనం ఏమీలేదు. లాంగ్రూట్లల్లో ఈ బస్సులు నడిపించే పరిస్ధితి లేదు. మినీ బస్సుల ఉద్దేశం, లిమిటెడ్ స్టేజీలు, దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న గ్రామాలకు మాత్రమే నడపాలి. కరీంనగర్, హుజురాబాద్, సిద్దిపేట, హన్మకొండ రూట్లల్లో ఈ మినీ బస్సులను నడిపిస్తున్నారు. ఈ రూట్లలో గతంలో పెద్ద బస్సులు నడిచేవి. అవి కాలం చెల్లడంతో మినీ బస్సును నడిపిస్తున్నారు. పెద్ద బస్సులు 55 సీట్ల కెపాసిటీ ఉండగా, మినీ బస్సుల్లో కేవలం 35 సీట్ల కెపాసిటీ మాత్రమే. ఈ బస్సులను నడిపించడంతో పరోక్షంగా ఆటోలకు అశ్రయం కల్పించడమే అవుతోంది. అసలే చిన్న బస్సులు ఆపై వన్‌మెన్ సర్వీస్ వెరసి డ్రైవర్లపై అదనపు భారం పడుతోంది. హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్లాలంటే, 9 స్టేజీలతో పాటు, హుస్నాబాద్ పట్టణంలోనే ఆరు స్టేజీలుంటాయి. ఇంచుమించు డ్రెవర్ 15 స్టేజీల్లో బస్సు ఆపుకుంటూ టికెట్లు ఇస్తూ ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయడమంటే ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఆదాయంలో కోత, డ్రైవర్లకు అదనపు పని భారం, కండక్టర్ల కుదింపు, మరో వైపు ప్రయాణికులకు అసౌకర్యం.. ఇన్ని రకాల ఇబ్బందులు డిపోకు శాపంగా మారాయి. కనిపించని ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు జిల్లాలకు ప్రధాన డివిజన్ కేంద్రంగా ఉన్న హుస్నాబాద్‌కు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్టుంటారు. ప్రతి రోజు పట్టణాలు, నగరాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. అందుకు తగ్గట్లుగా ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు లేవు. లాంగ్ రూట్లకు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు లేకపోవడం డిపో నష్టానికి ఇదో కారణమని అభిప్రాయ పడుతున్నారు. ఉన్న ఒక్క ఎక్స్‌ప్రెస్ బస్సులో హైదరాబాద్‌కు వెళ్లాలంటే సీట్లు దొరకని పరిస్ధితి. గతంలో బాసర, గోదావరిఖని, భద్రాచలం, యాదగిరి గుట్ట, మంచిర్యాల వంటి పట్టణాలకు లాంగ్ సర్వీస్‌లు నడిచేవి. ప్రస్తుతం ఈ లాంగ్ సర్వీస్‌లను పూర్తిగా రద్దు చేశారు. హుస్నాబాద్ కేంద్రం నుంచి ఏటూ 40 కి.మీ దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలు వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, జనగామకు వెళ్లాలంటే పల్లె వెలుగు బస్సులే దిక్కవుతున్నాయి. డిపోకు ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులు కేటాయించకపోతే డిపొ మూసివేత బాట పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. డిపో ఇప్పటికే రూ.6 నుంచి 7 కోట్ల వరకు నష్టాల్లో ఉందని తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన కాకముందు హుస్నాబాద్ డిపో కరీంనగర్ రీజియన్ పరిధిలో ఉండేది. హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో కలిపిన తర్వాత అధికారులు, కార్మిక సంఘాల నాయకులు ఏ పనికి వెళ్లాలన్నా సంగారెడ్డికి వెళ్లాల్సిన పరిస్థితి. ఉన్నతాధికారులకు నివేదించాం.. హుస్నాబాద్: పాత బస్సులైనా కండిషన్ ఉన్న బస్సులనే కేటాయిస్తున్నారు. ఈ ప్రాంతం చుట్టూ అన్నీ అర్డినరీ రూట్లు ఉన్నాయి. హుస్నాబాద్ నుంచి గోదావరిఖనికి ఎక్స్‌ప్రెస్ నడిపిస్తున్నా.. అనుకున్న స్థాయిలో కలెక్షన్ రావడం లేదు. వాస్తవానికి ఎక్స్‌ప్రెస్‌లతో ఆదాయం పెరుగుతుంది. హుస్నాబాద్ నుంచి వరంగల్ టు సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపిస్తే లాభమే ఉంటుంది. ఈ రూట్లో పర్మిట్ లేదు. ఆర్డినరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి లాంగ్ రూట్లకు నడిపిద్దామంటే కార్మికులు ఎక్కువ కిలోమీటర్లని సహకరించడం లేదు. ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది, అధికారులు కలిసి పని చేస్తేనే డిపో పురోగతి సాధిస్తుంది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. –రజనీకృష్ణ, డిపో మేనేజర్, హుస్నాబాద్ దీర్ఘకాలికంగా నష్టపోతారు.. మెయిన్ రోడ్డులో చిన్న బస్సులు నడపడం వల్ల ప్రయాణికులు నష్టపోతారు. అందుకే కండక్టర్లు, డ్రైవర్లు ఉన్న పెద్ద బస్సులనే నడిపించాలి. చిన్న బస్సులను లిమిటెడ్ స్టేజీలు ఉన్న గ్రామాలకు నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. లేదంటే డిపోకు నష్టం వస్తుంది. డిపోకు ఎక్స్‌ప్రెస్ బస్సులతోనే ఆదాయం. వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్‌తో పాటుగా లాంగ్ రూట్లల్లో ఎక్కువ మొత్తంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపిస్తే తప్పా డిపోకు మనుగడ ఉండదు. –పందిల్ల శంకర్, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు, హుస్నాబాద్ -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు
ఆర్టీసీ ఈడీ ముక్కాల రవీందర్ పలు డిపోల్లో తనిఖీలు హన్మకొండ : కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్టీసీ ఈడీ(ఈ) ముక్కాల రవీందర్ తెలిపారు. హన్మకొండలోని ఆర్టీసీ వరంగల్-2, హన్మకొండ డిపోలతో పాటు మభబూబాబాద్ డిపోను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపోల్లోని మెకానికల్ విభాగాలు, బస్సుల కండీషన్లను పరిశీలించిన ఆయన మెకానిక్‌ల సమస్యలపై ఆరా తీశారు. హన్మకొండ డిపోకు కొత్తగా వచ్చిన జేఎన్ఎన్యూఆర్ఎం బస్సుల కండీషన్‌ను అడిగి తెలుసుకున్నారు. కాలం చెల్లిన బస్సులు, ప్రధానంగా 6.50 లక్షలు కిలోమీటర్లు తిరిగి సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ చెప్పారు. ఈ మేరకు వరంగల్ రీజియన్‌కు కొత్తగా 50 బస్సులు రానున్నాయన్నారు. ఇక ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో భాగంగా హన్మకొండ-హైదరాబాద్ రూట్లో మినీ బస్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. వరంగల్‌లోని వివిధ కాలనీల నుంచి హైదరాబాద్‌లోని పలు కాలనీలకు నేరుగా ఈ బస్సులు నడుస్తాయని, వీటిని దసరా నుంచే ప్రారంభించేలా కృషి చేస్తున్నట్లు ఈడీ రవీందర్ వివరించారు. ఈ మేరకు ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలని కోరారు. కాగా, హన్మకొండ, వరంగల్-2 డిపోల పరిశీలన సందర్భంగా ల్లో బస్సులు మరమ్మత్తు చేసే కందకం(పిట్)లోకి నీరు వస్తోందని, అందులోని వైర్లు తడిసి షాక్ తగులుతోందని మెకానిక్‌లు ఈడీ రవీందర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఆర్టీసీ మెకానిక్‌లకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్, డిప్యూటీ సీఎంఈ జి.రాములు, డిపో మేనేజర్లు భానుకిరణ్, అర్పిత పాల్గొన్నారు. -
డొక్కుబస్సులకు ఏపీ సర్కార్ 'కొత్త' లుక్కు
ఆర్టీసీ కొత్త బస్సుల పేరుతో చంద్రబాబు సర్కారు ప్రజల్ని దగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో 100 కొత్త బస్సులను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అయితే, వాటిలో 20 వరకూ పాతబస్సులే అని తెలుస్తోంది. లైట్లు ఊడిపోయిన, తుప్పుపట్టిన పాతబస్సులకే రంగులతో కొత్త హంగులు దిద్దారు. ఇందులో కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుని ఉండొచ్చన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పోలీసులకు కొత్త వాహనాలు ఇవ్వడంతో, ఏపీలో కూడా కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల వంతు వచ్చింది. అయితే.. కొత్త బస్సులతో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాల్సింది పోయి.. ఇలా డొక్కుబస్సులకే కొత్త లుక్కు చూపించడం ఎంవతరకు సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
డొక్కు బస్సులనే.. కొత్త బస్సుల్లా..!
-
‘ప్రైవేటు’ బాటలో ఆర్టీసీ!
777 అద్దె బస్సులు తీసుకునేందుకు నిర్ణయం నేడు టెండర్లు ఖరారు చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ మళ్లీ ‘ప్రైవేటు’ బాట పట్టింది. కొత్త బస్సులు కొనేందుకు ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, ఉన్న పాత బస్సుల నిర్వహణ భారంగా పరిణమిస్తున్న నేపథ్యంలో అద్దె బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాటిని సమకూర్చుకునేందుకు శుక్రవారం టెండర్లను ఖరారు చేయబోతోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్నందున అద్దె బస్సులను కూడా ఉమ్మడి అవసరాలకు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాలకు కలిపి 777 బస్సులను సమకూర్చుకోనుంది. ఇందులో తెలంగాణకు 172 పల్లెవెలుగు, 215 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను, ఆంధ్రప్రదేశ్‌కు 172 పల్లెవెలుగు, 252 ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కేటాయించాలని సంస్థ నిర్ణయించింది. క్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరించే చర్యల్లో భాగంగానే అద్దె బస్సులు తీసుకుంటున్నారని మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 3300 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీ వాదన గతంలో తీసుకున్న అద్దె బస్సుల్లో నిర్వహణ లోపంతో ఇప్పటికే 500 బస్సులు తగ్గిపోయాయి. వచ్చే డిసెంబర్‌తో మరో 450 బస్సుల ఒప్పంద గడువు పూర్తవుతోంది. ఆ లోటును భర్తీ చేసేందుకే ఇప్పుడు కొత్తగా 777 బస్సులను సమకూర్చుకోవాల్సి వచ్చింది. కార్మిక సంఘాల వాదన ఆర్టీసీలో అద్దె బస్సులను క్రమంగా తగ్గించి సొంత బస్సులనే సమకూర్చుకుంటామని నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీని సంస్థ విస్మరించిందనడానికి తాజా నిర్ణయమే నిదర్శనం. అద్దె బస్సుల రాకతో సంస్థలో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. నైపుణ్యం లేని డ్రైవర్లతో ప్రమాదాలూ జరుగుతున్నాయి. నిర్వహణ కూడా సరిగా ఉండటం లేదు. అయినా అద్దె బస్సులనే తీసుకుంటున్నారంటే పరోక్షంగా ప్రైవేటీకరణ మొదలుపెట్టినట్టే!