డొక్కుబస్సులకు ఏపీ సర్కార్ 'కొత్త' లుక్కు | chandra babu government make fraud in RTC buses | Sakshi
Sakshi News home page

డొక్కుబస్సులకు ఏపీ సర్కార్ 'కొత్త' లుక్కు

Published Tue, Jan 27 2015 12:55 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

డొక్కుబస్సులకు ఏపీ సర్కార్ 'కొత్త' లుక్కు - Sakshi

డొక్కుబస్సులకు ఏపీ సర్కార్ 'కొత్త' లుక్కు

ఆర్టీసీ కొత్త బస్సుల పేరుతో చంద్రబాబు సర్కార్ ప్రజల్ని దగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆర్టీసీ కొత్త బస్సుల పేరుతో చంద్రబాబు సర్కారు ప్రజల్ని దగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో 100 కొత్త బస్సులను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అయితే, వాటిలో 20 వరకూ పాతబస్సులే అని తెలుస్తోంది. లైట్లు ఊడిపోయిన, తుప్పుపట్టిన పాతబస్సులకే రంగులతో కొత్త హంగులు దిద్దారు. ఇందులో కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుని ఉండొచ్చన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పోలీసులకు కొత్త వాహనాలు ఇవ్వడంతో, ఏపీలో కూడా కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల వంతు వచ్చింది. అయితే.. కొత్త బస్సులతో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాల్సింది పోయి.. ఇలా డొక్కుబస్సులకే కొత్త లుక్కు చూపించడం ఎంవతరకు సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement