వ్యవసాయం లాభసాటిగా మార్చాలి
-
అధికారులు కష్టపడి పనిచేయాలి
-
జేడీఏ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
నెల్లూరు రూరల్ : వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయాధికారులు కష్టపడి పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. స్థానిక తాహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన జేడీఏ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, ఇరిగేషన్ తగిన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో కరువు పరిస్థితుల్లో నష్టపోయిన రైతులకు, భారీ వర్షాల పంట నష్టం పరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూసార పరీక్షలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, యంత్రాలను రైతులకు అందజేస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లాలో కృష్ణపట్నం, కోడూరు ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రమణ్యంయాదవ్, వ్యవసాయ శాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, జేడీఏ హేమమహేశ్వరరావు, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.