కొత్త వత్సరంలోనైనా మార్పురావాలి
Published Sat, Dec 31 2016 11:43 PM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM
(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
ఎన్నో ఆశలు..మరెన్నో ఆకాంక్షలు...ఇంకెన్నో ఆలోచనలు...ఇలా అనేక లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి జిల్లావాసులు అడుగు పెట్టేశారు. వారంతా ఒకటే కోరుకుంటున్నారు. ఒకే మాట వినిపిస్తున్నారు. అందరినీ ఒకేలా చూస్తారనుకున్న ప్రభుత్వం పాలకులు గడచిన ఏడాదంతా అన్నింటా మాట తప్పిందనే ఆవేదన అందరిలోనూ కనిపిస్తోంది, అందరి నోటా వినిపిస్తోంది.కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఈ ఏడాదైనా సమన్యాయం జరగాలని జిల్లావాసులు పరితపిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా నెరవేరుస్తుందని చెప్పలేం. అమలుచేసేవి కొన్నైనా అర్హులకు సమన్యాయం జరుగుతుందని ఆశిస్తారు. ప్రజల ద్వారా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా అదే చేయాలి. ప్రజలు కూడా దాని కోసమే ఎదురుచూస్తారు. సమ న్యాయం అనే మాట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా కనిపించడం లేదనే ఆవేదన వినిపిస్తోంది. అందరికీ న్యాయం మాట దేవుడెరుగు ఇచ్చిన మాట ఏమైందని అడిగే ధైర్యాన్ని కూడా ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుందని చెప్పక తప్పదు. ప్రజాస్వామ్య పద్ధతిలో అడిగే గొంతుకను సర్కార్ నొక్కేస్తోంది. నాటి బ్రిటీష్ పాలన చూడని నేటి తరానికి రుచి చూపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు తమకు కావాల్సిన అవసరాలు, తీర్చాల్సిన సమస్యలు నమ్మి ఓటేసిన ప్రభుత్వాన్ని కాక మరెవరిని అడుగుతారు. కానీ ఇప్పుడలా అడగటం జిల్లాలో పెద్ద నేరంగా మార్చేశారు నేటి పాలకులు. గడచిన ఏడాది కాలంగా జిల్లాలో జరిగిన పరిణామాలు మననం చేసుకున్న వారికెవరికైనా ఇది నజమేనని తెలుస్తుంది.
ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో ఈ ఏడాదిలో చోటుచేసుకున్న అనేక సంఘటనలు అసలు పౌరప్రభుత్వం ఉందా లేక పోలీసు రాజ్యం నడుస్తోందా అనే సందేహాన్ని కలిగిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుస పాలనలో ఉన్నామా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇచ్చిన హామీల కోసం నినదించే నోళ్లు పోలీసు బలప్రయోగంతో నొక్కేస్తున్నారు. ఇందుకు జిల్లాలో సెక్ష¯ŒS –30 అమలులో ఉందనే కుంటిసాకులు చూపిస్తున్నారు. నెల, రెండు నెలలు కాదు నెలల తరబడి ఈ సెక్ష¯ŒS జిల్లాలో అమలు చేయడం గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ చూడనే లేదు. భవిష్యత్తులో చూడాల్సి వస్తుందని కూడా ఎవరూ అనుకోరు.ఏ ప్రభుత్వమైనా ప్రజలు సుభిక్షంగా ఉంటేనే కదా పాలన సజావుగా నడిచేది. ప్రజల ప్రాణాలు, రెక్కల కష్టాన్ని తుడిచిపెట్టేసే నిర్ణయాలు తీసుకోవడంపై వెళ్లువెత్తుతోన్న జనాగ్రహాన్ని కట్టడి చేయాలనే తొందరపాటులో మంచి చేయాలనే కోణాన్ని పెడచెవిన పెడుతున్నా ఈ పాలకులు.
ఇవిగో ఉదాహరణలు...
తూర్పు సెంటిమెంట్‌గా పరిగణించే తుని సమీపాన తొండంగిలో దివీస్ వ్యతిరేక ఉద్యమం, కోనసీమలో పంట గిట్టుబాటు కావడం లేదని రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించి కాడి వదిలేసి చేపట్టిన ఉద్యమబాట, హామీ అమలు చేయమని నినదించినందుకు కాపు ఉద్యమంపైన, పోలవరం ప్రాజెక్టును ఆహ్వానిస్తూ పరిహారం విషయంలో న్యాయం చేయాలని నిర్వాసితులైన అడవి బిడ్డలు రోడ్డెక్కినా, రెగ్యులర్ చేస్తామని నమ్మించి దగా చేశారంటూ కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళనబాట పట్టినా అన్నింటిపైనా అణిచివేత ధోరణే. ఇలా మచ్చుకు కొన్నింటిని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా జిల్లాలో వివిధ వర్గాల ఆకలి కేకలను, ఉద్యమాలను పోలీసుల సాయంతో పీచమణిచేస్తున్న పాలకులు భవిష్యత్తులో ప్రజల అవసరం లేదనుకుంటున్నారా, అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది.
జన్మభూమి కమిటీల పెత్తనంతో...
మరో వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారపార్టీ నేతలతో ఏర్పాౖటెన జన్మభూమి కమిటీలకే పెత్తనం అప్పగించి పాలకులు పెద్ద తప్పు చేశారు. ఈ మాట ఆ పార్టీలో సీనియర్ల నోటే వినిపిస్తోంది.నిరుపేద లేదా మధ్య తరగతి వర్గాల జీవితమే సంక్షేమానికి అర్హత కావాలి తప్ప మా పార్టీయా, మీ పార్టీ అని చూడకూడదు. కానీ జిల్లాలో రేష¯ŒSకార్డులు, పింఛ¯ŒSలు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం..ఇలా ఏదైనా తమ వారికే దక్కాలని అధికారపక్షంపై నుంచి కింది వరకు ఆలోచిస్తోంది. సంక్షేమ పథకాలు ఇవ్వకుంటే ఇవ్వకున్నారు, చివరకు నియోజకవర్గాల్లో పాలకుల తీరును ఎండగట్టే భావప్రకటనా స్వేచ్ఛను కూడా హరించేస్తున్నారు. తుని, ప్రత్తిపాడు, రాజానగరం, రాజమహేంద్రవరంæ, రంపచోడవరం, పిఠాపురం, మండపేట తదితర నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పాలకులను ప్రశ్నించడమే తప్పు అన్నట్టు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలను కేసులపై కేసులు పెట్టి వేదిస్తున్న పాలకుల తీరు విస్మయపరుస్తోంది. గడచిన ఏడాదిగా ఎలా వ్యవహరించినా నూతన సంవత్సరంలోనైనా అందరికీ న్యాయం అందేలా పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించి వారి మనసు మారాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు.
Advertisement
Advertisement