నిర్వాసితుడి కుటుంబానికి కార్మికుల ఆర్థిక సాయం
Published Thu, Jul 21 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
కోల్బెల్ట్(వరంగల్) : భూనిర్వాసితుడు నిమ్మల రమేష్ కుటుబానికి భూపాలపల్లి ఏరియా కేటీకే–2 గని కార్మికులు ఆర్థిక సాయం అందజేశారు.
కేటీకే ఓసీపీ ఏర్పాటుతో భూములు కోల్పోయాయని, కంపెనీ నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని రమేష్ ఈ ఏడాది మే 21న జీఎం కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నం చేయగా గత నెల 6న చికిత్స మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి కార్మికులు ముందుకు వచ్చి గని వెల్ఫేర్ ఆఫీసర్ మదార్ సాహేబ్ చోరవతో రూ.32,350 సేకరించారు. ఆ మొత్తాన్ని బుధవారం పర్సనల్ డిపార్ట్మెంట్లో అందజేశారు.
Advertisement