► సర్పంచ్‌లకు కలెక్టర్ యోగితారాణా సూచన
కామారెడ్డి: గ్రామాల్లో 14 రకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రూ.3 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నిర్వహించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవచ్చని కలెక్టర్ యోగితారాణా సర్పంచ్‌లకు సూచించారు. మంగళవారం కామారెడ్డిలోని డిప్యూటీ డీఈవో కార్యాలయంలో హరితహారం, ఉపాధి హామీ పథకం అమలుపై ఆమె సర్పంచ్‌లతో సమీక్షించారు.
గ్రామాల్లో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు పూర్తి చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌లపైనే ఉందన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే 2-3 నెలల్లో గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపొందుతాయన్నారు. గ్రామాల్లో విద్యార్థులను బడుల్లో చేర్పించే బాధ్యతను సర్పంచ్‌లు తీసుకోవాలని సూచించారు. గ్రామానికి 40 వేల మొక్కలను నాటించాలని, ప్రతీ ఇంటికి ఐదు మొక్కలకు తగ్గకుండా నాటాలన్నారు. మొక్కలు నాటడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. పీడీలు చంద్రమోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, డీఎఫ్‌వో సుజాత, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దండి
Published Wed, Jun 15 2016 11:41 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement