‘ప్రైవేట్ స్కూళ్లపై ఆంక్షలొద్దు’
కరీంనగర్: ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ వైఖరి మారాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ధర్నాకు దిగింది. శనివారం (ట్రస్మా) ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ప్రైవేట్ పాఠశాలపై ప్రభుత్వం అసత్య ప్రచారానికి, వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ధర్నాలో పాఠశాలల యజమానులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.