
తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమల: తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నేడు తిరుమలలో వైభవంగా కోయిల్ అళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు తిరుమలలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటల తరువాత స్వామివారి దర్శనం ఉంటుంది. సోమవారం రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5 కోట్లు ఉన్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.