కాగుతున్న కల్తీ నూనె | oil Adulterating in rajanna sirisilla | Sakshi
Sakshi News home page

కాగుతున్న కల్తీ నూనె

Published Mon, Jan 9 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

కాగుతున్న కల్తీ నూనె

కాగుతున్న కల్తీ నూనె


సిరిసిల్ల టౌన్ : కల్తీ నూనె వ్యాపారులకు కాసులు కురిపిస్తుండగా.. ప్రజలను అనారోగ్యం పంచుతోంది. మార్కెట్‌లో విలువలేని, నాసిరకం నూనెను ఎక్కువ ధర పలికే పల్లి, నువ్వులు, సన్ ఫ్లబర్‌ తదితర వంటనూనెల్లో కలిపి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. సిరిసిల్ల, కామారెడ్డి, వేములవాడకు చెందిన ఐదుగురు బడావ్యాపారులు కల్తీ దందా సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాకినాడ, కృష్ణపట్నం తదితర ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల్లోంచి వ్యాపారులు లారీల కొద్ది నాసిరకం నూనెలు ఇక్కడకు తీసుకొస్తున్నారని తెలుస్తోంది. వాటిని టిన్స్  ప్యాకెట్స్, కాటన్లలో ప్యాకింగ్‌ చేసి బ్రాండెడ్‌ లుక్‌ ఇస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓవ్యాపారి, మాజీ ప్రజాప్రతినిధి కలిసి చాలా ఏళ్లుగా లూజ్‌ ఆయిల్‌ విక్రయాలు  సాగిస్తున్నారని సమాచారం.

స్వల్ప వ్యవధిలోనే రూ.కోట్ల ఆదాయం సమకూరడంతో వీరిని స్ఫూర్తిగా తీసుకున్న వేములవాడకు చెందిన మరోముగ్గురు వ్యాపారులు కలిసి ఇదే అక్రమబాట పట్టారని చెబుతున్నారు. కామారెడ్డికి చెందిన మరో వ్యాపారి ఒకడుగు ముందుకేసి పక్కరాష్ట్రాల నుంచి తెప్పిస్తున్న నాసిరకం నూనెను బ్రాండెడ్‌గా మార్చి ప్రజలను నమ్మిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈవ్యాపారికి సిరిసిల్ల పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు బినామీలుగా వ్యవహరిస్తూ..అధికారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని దందా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం సదరు వ్యాపారి తన బినామీలు,  అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. నూనెల శాంపిళ్లు సేకరించి నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు దీంతో మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం
విడి నూనె అమ్మకాలకు అనుమతి లేకున్నా కొందరు వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఉన్నతాధికారులు సిరిసిల్ల పట్టణ శివారులోని ఓ బడా వ్యాపారి గోదాంలో దాడులు చేయగా మంచినూనెలో తక్కువ రేటుకు దొరికే కల్తీ నూనె పట్టుబడింది. కానీ సదరు వ్యాపారి అధికారులను మచ్చిక చేసుకుని కేసులు కాకుండా చూసినట్లు ఆరోపణలున్నాయి. ఇదే పద్ధతిని వేములవాడ, కామారెడ్డి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్రమాలకు అడ్డుకట్ట వేసే అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో  చిరువ్యాపారులు సైతం బడా వ్యాపారుల వద్ద కల్తీ నూనె కొనుగోలు చేస్తూ జనాలకు అంటగడుతున్నారు. కామారెడ్డికి చెం దిన వ్యాపారి భారతీయ నాణ్యత ధ్రువీకరణ సంస్థ అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నాడని ప్రచారంలో ఉంది. తద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివి« ద రకాల పన్నులు నెలకు రూ.లక్షల్లో  ఎగవేస్తూ జీరో దందాను దర్జాగా సాగిస్తున్నారని పేర్కొంటున్నారు.

లెక్కాపత్రం లేదు..
జిల్లాలోని 13 మండలాల పరిధిలో సాగుతున్న కల్తీ నూనె దందాకు లెక్కాపత్రాలు రాయడంలేవు. కేవలం తెల్లకాగితాలపైనే ‘నూనె వచ్చిందా..అమ్మిందా..డబ్బు అందిందా’ అనే కోణంలోనే వ్యాపారులు రాస్తూ అక్రమాలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. సిరిసిల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో సుమారు 200 మంది రిటైల్‌ వ్యాపారులున్నారు. వీరి వద్ద ఒక్కరోజులోనే రూ.20 లక్షల విలువైన వ్యాపారం సాగుతోందని అంచనా. ఈలెక్కన నెలకు దాదాపు రూ.5.40 కోట్ల విలువైన కల్తీ నూనె వ్యాపారం సాగుతోందని మార్కెట్‌ పరిశీలకుల అంచనా వేస్తున్నారు. దందా ఇంతపెద్దఎత్తున సాగుతున్నా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అధికారుల విధి నిర్వహణ తీరుకు అద్దం పడుతోందనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లాలోని నూనె వ్యాపారులు    : 200
రోజూ అమ్ముడయ్యే నూనెలు    : నెలకు 8–10
లారీల లోడ్‌
రోజూ విక్రయించే నూనె విలువ    : రూ.20లక్షలు
ఒక్కో నెలలో అక్రమ సంపాదన    : రూ.5.40కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement