Adulterated oil
-
బీ అలెర్ట్.. జంతు కళేబరాలతో కల్తీ నూనె..
ఉరుకులు.. పరుగుల నగరజీవికి కాసింత విశ్రాంతి దొరికేది భోజనం దగ్గరే.. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కొందరు ఉద్యోగులు ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటారు. ఆకలి తీర్చుకునేందుకు టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, చిరుతిళ్ల బండ్లను ఆశ్రయించాల్సిందే.. నోరూరించే బిర్యానీ.. వేడివేడి బజ్జీలు.. బాగా నూనె దట్టించిన దోశ.. ఇలా ఏది తిన్నా ఆరోగ్యానికి డ్యామేజీ అయినట్లే.. ఎవరు ఏ కల్తీ నూనె వాడుతున్నారో తెలియకపోవడంతో రోగాలు తప్పడం లేదు. కొన్నిచోట్ల జంతువుల వ్యర్థాలను మరిగించి తీసిన నూనెలతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఆ నూనే వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి బేగంబజార్ కేంద్రంగా మార్కెట్లో విక్రయించి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడ, శాస్త్రిపురం, జలపల్లి, మల్లాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాలు పశువ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి అడ్డాగా మారాయి. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల స్టిక్కర్లతో బేగంబజార్ కేంద్రంగా వాటిని హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. పశువుల వ్యర్థాలతో నూనె తీసే ప్రాంతాల్లోకి ప్రవేశించడం సామాన్యులేవరికీ సాధ్యం కాదు. కోటలను తలపించే ప్రహరీల మధ్య ఈ గోడాన్లు ఉంటాయి. అక్కడ పనిచేసే వారంతా బిహార్, యూపీ, అసోం, ఓడిశా రాష్ట్రాలకు చెందిన యువకులే.. కొత్తవారు కనిపిస్తే దాడులకు ఏమాత్రం వెనకాడరు. ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమల ముసుగులోనూ పశువ్యర్థాలతో తీసిన నూనె కలిపి పేరొందిన బ్రాండ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: నూనెల ధరలు పెరుగుదల పశువుల వ్యర్థాలతో.. పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం.. చనిపోయిన జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నారు. మూతపడిన కార్ఖానాల్లో భారీ ఇనుప గోళాలు, గిన్నెల్లో పశువుల ఎముకలు, కొవ్వును కరిగేదాకా మరగబెట్టి నూనె తీస్తున్నారు. దాన్ని డబ్బాలు, ప్యాకెట్లలో నింపి బ్రాండెడ్ లేబుళ్లను అంటించి జనంపైకి వదులుతున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ రోత పుట్టించే దందా సాగుతోంది మహానగర పరిధిలోనే.. ఏళ్లతరబడి ఖాళీగా పోస్టులు విశ్వ నగరం వైపు పరుగులు తీస్తూ కోటి మందికి పైగా జనాభా కలిగిన హెదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతా విభాగం సిబ్బంది సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. జీహెచ్ఎంసీ ఆహార తనిఖీ విభాగానికి సర్కిల్ ఒకరి చొప్పున 30 పోస్టులు మంజురు కాగా, పని చేస్తోంది 20 మంది మాత్రమే. ఐదు గెజిటెడ్ పోస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారు. సర్కిల్ స్థాయిలో 10 పోస్టులు, గెజిటెడ్ స్థాయిలో మూడు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఈ లెక్కన గ్రేటర్ హైదరాబాద్‌లో 200 మందికి తగ్గకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఇటీవల కొన్ని ఘటనల్లో.. ఏడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లోని ఒక ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారీ బండారం బయటపడింది. అక్టోబర్‌లో శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మైలాదేవులపల్లి పరిధిలోని అలీనగర్‌లో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న మూడు కేంద్రాలపై దాడులు చేసి సీజ్ చేశారు. నగర శివార్లలోని జల్పల్లి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పెద్ద పెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికిస్తుండగా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 160 డమ్ముల నూనె సీజ్ చేశారు. జల్పల్లి నుంచి పహాడీషరిఫ్‌కు వెళ్లే దారిలో కల్తీ నూనె దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న కేన్సర్ కేసులు గ్రేటర్లో ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 12వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వాడిన ఆయిల్‌ను మళ్లీ వినియోగించడంతో రోగాలు పెరుగుతున్నాయి. కల్తీ నూనెతో రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ నూనె కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కేన్సర్‌కు కారణమవుతుంది. ఆ నునె వాసన పీల్చినా ప్రమాదమే.. ఫిర్యాదులు అందితేనే.. ఈ విషపూరిత నూనెను అరికట్టేందుకు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు అందితే దాడిచేసి సీజ్ చేయడం.. తర్వాత ఫిర్యాదు అందే వరకు సంబంధం లేదనే విధంగా సంబంధిత అధికారులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. ఫిర్యాదులు అందినప్పుడు నగర స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై మొక్కుబడిగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. శుద్ధి చేసిన నూనెను మరిగిస్తే పొంగు రాదు. రంగు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. జంతువుల కళేబరాలతో చేసిన నూనె పొంగుతో పాటు దుర్వాసన వస్తుంది. – డాక్టర్ ఆర్వీ రాఘవేందర్రావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
కల్తీ...మాయ..!
‘‘జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్డులోని ఓ దుకాణంలో సరిగ్గా ఏడు నెలల క్రితం కల్తీ నూనె విక్రయాలు జరుపుతుండగా వినియోగదారులు జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో సదరు అధికారులు దుకాణంపై దాడులు చేయగా కల్తీ నూనె విక్రయాలు బట్టబయలు అయింది. అంతటితో ఆగకుండా వినియోగదారులు పెద్ద ఎత్తున ఆ దుకాణం వద్ద ధర్నాకు దిగారు. అయినా జిల్లాలో నేటికీ కల్తీ నూనె విక్రయాలు ఆగలేదు.’’ సూర్యాపేట : జిల్లాలో కల్తీ మంచినూనె వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రమైన సూర్యాపేటతో పాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల ప్రాంతాల్లోనూ ఈ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. నూనె కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తూ సదరు వ్యాపారులు రూ.కోట్లు గడిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఐఎస్ఐ మార్క్ లేకుండానే స్థానికంగా వివిధ వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన కల్తీ నూనెను మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ లోగోతో గుర్తించలేనంతగా చిన్న మార్పు చేస్తున్నారు. బ్రాండెడ్ పేరిట వాటిని అమ్ముతున్నారు. సదరు వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీనికి తోడు ఐదు లీటర్ల క్యాన్‌కు అదనంగా వివిధ ఆఫర్లను ప్రకటించి ప్రజలకు అంటగడుతున్నారు. కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, తుంగతుర్తి, నేరేడుచర్లతో పాటు సూర్యాపేట కూరగాయల మార్కెట్ రోడ్డు, రైతుబజార్ మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో, ఎంజీ రోడ్డులో ఎక్కువగా ఇలాంటి విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వలసవచ్చి తాత్కాలికంగా నివసించే కార్మికులు అధికంగా ఉంటారు. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ప్యాకెట్లతో నూనె దొరుకుతుందని సదరు కార్మికులు, ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా తమ ఆరోగ్యాలను దెబ్బతీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. తూకంలో మోసాన్ని అరికడతాం.. మంచినూనె డబ్బాలు, ప్యాకెట్ల తూనికల్లో ఏమైనా తేడాలు , మోసం ఉంటే చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు పర్యవేక్షిస్తాం. తూకంలో జరిగే మోసాలపై వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కల్తీ జరిగినట్లు మాకు ఫిర్యాదులొస్తే చర్యలుతీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, తూనికలుకొలతల అధికారి, సూర్యాపేట కల్తీ నూనెలతో కేన్సర్ కల్తీ నూనెలతో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జంతు కళేబరాలతో ఆయిల్ తయారు కావడంతో కేన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఈ నూనెతో అతి రోస్కిమరోíనిస్ అనే పదార్థం ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఐఎస్ఐ మార్కు ఉన్న నూనెలనే వాడాలి.– డాక్టర్ వూర రాంమూర్తియాదవ్, సూర్యాపేట క్రిమినల్ కేసులు తప్పవు బ్రాండెడ్ కంపెనీల పేరుతో కల్తీ నూనెలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో కేసులు నమోదుచేశాం. కల్తీ నూనెల వల్ల పేద ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కల్తీ నూనెలు విక్రయిస్తే క్రిమినల్ కేసులతో పాటు జైలుకు పంపించి, భారీ జరిమానా విధిస్తాం. – తారాసింగ్, ఫుడ్ ఇన్స్పెక్టర్, సూర్యాపేట -
జంతు కళేబరాల కల్తీ ఆయిల్ దందా గుట్టు రట్టు
-
పండగపూట..కల్తీ ఊట
కాదేది కల్తీకి అనర్హం. సంక్రాంతి పండుగ కొనుగోళ్లను ఆసరా చేసుకొని కొందరు కల్తీనూనె అమ్మడానికి తెగబడుతున్నారు. రూ. కోట్లు దండుకుని తాము మాత్రం ‘పండుగ‘ చేసుకోవాలను కుంటున్నారు. ఇటువంటి వాటిని నివారించాల్సిన ఆహార నియంత్రణ అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటంతో నూనె వ్యాపారులు బరితెగిస్తున్నారు. కల్తీ నూనెను గుట్టు చప్పుడు కాకుండా ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి మంచినూనెలో కలిపేస్తున్నారు. ప్రతి నెలా జిల్లాలో దాదాపు రూ. 15 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని వాణిజ్యపన్నుల అధికారులు లెక్కలు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: వేరుశనగ, పామాయిల్, సన్‌ఫ్లవర్, సోయాబిన్ ఇలా రకరకాల నూనెలు ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బ్రాండెడ్‌వి మినహాయిస్తే అన్ బ్రాండెడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్సులు పొంది కొందరు వ్యాపారులు మాయాజాలం చేస్తున్నారు. మార్కెట్లో వంటనూనెల తయారీ, విక్రయాల మాటున భారీగా దగా జరుగుతోంది. వంట నూనెల తయారీలో వేరుశనగ తక్కువగా వినియోగించి పామాయిల్, పత్తి విత్తనాలను అధిక మొత్తంలో కలిపి నూనెలు తయారు చేస్తున్నారు. వేరుశనగ విత్తనాలతోనే మొత్తం నూనె తయారు చేసినట్లు చూపి ఆమేరకు ధర నిర్ణయించి ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్నారు. ధర తక్కువతో మక్కువ.. పశు కలేబరాలు, ధాన్యపు వ్యర్థం(తవుడు) నుంచి తీసిన నూనె మార్కెట్ ధర కంటే తక్కువగా లభించడంతో వ్యాపారులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మార్కెట్లో మంచి నూనె సుమారుగా కిలో రూ. 70 నుంచి రూ. 120 వరకు ఉంది. అదే కల్తీ నూనె కిలో రూ. 30 నుంచి రూ. 35కే లభించడంతో చిన్నపాటి హోటల్స్, తోపుడు బళ్లు, చిన్న పాటి పాస్ట్‌ఫుడ్ నిర్వాహకులు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనిని అదునుగా చేసుకుని కల్తీ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది. సీమగోల్డుతో వెలుగులోకి కర్నూలు జిల్లా కేంద్రంగా సీమగోల్డు పేరుతో వంట నూనె తయారవుతోంది. అయితే అందులో 30 శాతమే వేరుశనగ విత్తనాల నూనె ఉందని, మిగిలింది పత్తిగింజల నూనె ఇతరత్రా మిశ్రమాలు ఉన్నాయని అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. ఇటీవల గుంటూరు జిల్లా పల్నాడులో సీమగోల్డు వ్యవహారం బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నూనె విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ జిల్లాలో ఇంతకు ముందు కూడా పశు కళేబరాలతోనూ నూనెలు తయారు చేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేసినా.. మోసగాళ్లు వెనక్కు తగ్గకపోవడం గమనార్హం. ఇవన్నీ ఉండాల్సిందే... మార్కెట్లో విక్రయానికి వచ్చిన నూనె ప్యాకింగ్ సంచిపై కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్సు, రాష్ట్ర వ్యవసాయశాఖ జారీ చేసే అగ్మార్క్ ముద్రలు ఉండాలి. ప్రీ ఫ్రం హార్జిమోన్ ఆయిల్(బ్రహ్మదండి గింజలు అసలు కలపలేదని) అని పేర్కొనాలి. ప్యాకింగ్‌పై కచ్చితంగా నూనె తయారీ కోసం వాడిన విశ్రమాల వివరాలు శాతాలతో సహా చూపాలి. అలాగే బ్యాచ్ నంబర్లు, ఎప్పుడు తయారు చేశారు.. ఎప్పటి దాకా విక్రయించవచ్చనే సూచిక ఉండాలి. జూన్ నుంచి తనిఖీలు లేవు.. గతేడాది మే నెల వరకు జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారులతో తనిఖీలు చేపట్టి నమూనాలు తీశాం. వాటి ప్రయోగ నివేదికలు వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలో అర్హత ఉన్న తనిఖీ అధికారులు లేకపోవడంతో ఇటీవల కర్నూలు నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్టర్ 8 నమూనాలు సేకరించారు. వాటి నివేదిక వచ్చాకే చర్యలు తీసుకుంటాం. – విశ్వనాథ్‌రెడ్డి, డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ -
కల్తీ క‘మాల్’
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ తుంగలో.. నిబంధనలకు విరుద్ధంగా నూనె ప్యాకెట్లు, డబ్బాల తయారీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు ఆస్పత్రుల పాలవుతున్న అమాయక జనం పక్క చిత్రంలోని వైద్యం పొందుతున్న కూలీలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. వీరు కామారెడ్డిలో తాగునీటి పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కూలీలు శనివారం స్థానికంగా ఉండే ఓ షాపులో వంట నూనె ప్యాకెట్‌ను కొనుగోలు చేసి వంట చేసుకున్నారు. తీరా ఆ నూనె కల్తీది కావడంతో ఈ ఆహారం తిన్న కూలీలు, ఆ కుటుంబంలోని చిన్న, పెద్ద అంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు. కనీసం ఆస్పత్రికి వెళ్లి వైద్యం కూడా చేయించుకోలేక ఇంట్లోనే పడి ఉన్న ఆ నిరుపేద కూలీలను రెవెన్యూ ఉన్నతాధికారులే ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. సంబంధిత వ్యాపారులపై కేసులు పెట్టారు. కల్తీ నూనె మాఫియా ఆగడాలకు ఇదొక మచ్చుతునక. నిజామాబాద్ : కల్తీ నూనె మాఫియా రెచ్చిపోతోంది. వంట నూనెలను కల్తీ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కామారెడ్డి కేంద్రంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆరోగ్యానికి హానికరమైన నూనెలను కల్తీ చేసి రూ.కోట్లు గడిస్తోంది. వంట నూనెల తయారీ, విక్రయాల్లో అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కుతోంది. నిత్యం రూ.కోట్లలో అక్రమదందా సాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నూనెలను వినియోగిస్తున్న అమాయక ప్రజలు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. ఆయిల్ తయారీకి అనుమతుల్లేవు.. వంట నూనెలను తయారు చేయాలంటే గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి లైసెన్సులు తీసుకోవాలి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏ ఒక్క ప్లాంటుకు కూడా ఫుడ్స్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి లైసెన్సులు మంజూరు చేయలేదు. కేవలం వంట నూనెలను ప్యాకింగ్ చేసుకునేందుకు మాత్రమే 23 ప్లాంట్లకు లైసెన్సులిచ్చారు. కానీ కామారెడ్డి, నిజామాబాద్‌లో నూనెలను మిక్సింగ్ చేస్తున్నారు. అత్యధికంగా నూనె దందా కామారెడ్డి కేంద్రంగా సాగుతోంది. ప్యాకెట్లలో ప్రమాణాలు గాలికి.. రూ.కోట్లలో నూనె దందా చేస్తున్న అక్రమార్కులు అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏ (ఫుడ్ సేఫ్టీ స్టాండరŠడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాలను గాలికొదిలేస్తుండటంతో అమాయక ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా తయారైంది. l వంట నూనెను ప్యాకెట్లుగా తయారు చేస్తున్న అక్రమార్కులు ఆ ప్యాకెట్లపై ఎలాంటి వివరాలు ఉంచడం లేదు. ఆ ప్యాకెట్లో ఏయే రకాల నూనెలు కలిపారు. నూనె తయారు చేసిన సంస్థ వివరాలు, ప్యాకింగ్ చేసిన తేదీ.. ప్లాంటు వివరాలు.. కలిపిన ఇతర రసాయనాలు వంటి పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ప్యాకెట్లపై ముద్రించాలి. కానీ.. ఇవేవీ పాటించకుండా మామూలు పాలిథిన్ కవర్లలో నూనెను ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో కూలీలు అస్వస్థతకు గురైన ఘటన ఈ కల్తీ దందాకు అద్దం పడుతోంది. ఈ వివరాలేవి లేని నూనె ప్యాకెట్‌ను కొనుగోలు చేసి వినియోగించడంతో అమాయక ప్రజల ప్రాణాల మీదికి వస్తోంది. ♦ నిబంధనల ప్రకారం వ్యాపారులు లూజ్ ఆయిల్ అమ్మరాదు. య«థేచ్ఛగా లూజ్ ఆయిల్ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పలుచోట్ల లూజ్ ఆయిల్‌ను విక్రయిస్తున్నారు. చౌకబారు నూనెలను కలిపి రూ.కోట్లు దండుకుంటున్నారు. ♦ పామోలివ్, పత్తిగింజల నూనె అత్యంత చౌకగా లభిస్తుంది. పత్తి నుంచి వేరు చేసిన గింజలతో తయారైన ఈ నూనెలను ఆదిలాబాద్, భైంసా వంటి జిన్నింగ్ ఆయిల్ మిల్లుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుంటున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్యాంకర్లలో తెప్పించుకుంటున్నారు. ఈ చౌక నూనెల్లో అధిక ధర ఉండే పల్లీ నూనె, పొద్దుతిరుగుడు నూనెలను నామమాత్రంగా కలిపి ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ప్యాకెట్లపై మాత్రం అందంగా, కంటికి ఇంపుగా కనపడే పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలను ముద్రించి ఇది స్వచ్ఛమైన పల్లీ నూనె, పొద్దు తిరుగుడు నూనె అంటూ అమాయక ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అమాయక ప్రజలు ప్యాకెట్ మీద ఇంగ్లిష్‌లో ఉన్న డిక్లరేషన్‌ను చదివే అవగాహనæ లేకపోవడంతో బొమ్మను చూసి ఇదే పల్లీ, పొద్దుతిరుగుడు నూనె అని మోసపోతున్నారు. ♦ కేవలం ప్యాకెట్లలోనే కాదు, డబ్బాల్లోనూ ఈ నూనెను ప్యాకింగ్ చేస్తున్నారు. అలాగే 15 కేజీలు ఉండే ఈ ఆయిల్ డబ్బాలను కూడా ఇక్కడి నుంచే ఇతర జిల్లాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ఈ దందా రూ.కోట్లలో సాగుతోంది. -
భారీగా కల్తీ నూనె స్వాధీనం
పూడూరు: కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసులు పెద్ద ఎత్తున నకిలీ వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడికొండ శివారులో నకిలీ ఆయిల్ తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నకిలీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
యథేచ్ఛగా చిరు వ్యాపారం
► కల్తీ నూనె, ఇతర పదార్థాలతో తయారీ ► నేలపై పోసి ఫ్యాకింగ్ ► ప్రజల ఆరోగ్యానికి ముప్పు ► అనుమతి లేదంటున్న గ్రామ పంచాయతీ అధికారులు ఆదిలాబాద్ రూరల్ : పట్టణ శివారు ప్రాంతాంలోని బట్టిసావర్గాం గ్రామ పంచాయతీ పరిధిలోని న్యూ హౌజింగ్ కాలనీలో కారా తయారీ వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని నడిపించిన ఈ వ్యాపారం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. కారా తయారు చేస్తున్నప్పుడు దాని నుంచి వెలుబడే పొగాతో ఆ ప్రాంతం కలుషితంగా మారుతోందని కాలనీ వాసులు వాపోతున్నారు. దీంతో చుట్టూ పక్కల ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. ఇటీవలే గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కల్తీ కారా తయారీ... బట్టిసావర్గాం గ్రామ పంచాయతీ శివారు ప్రాంతాంలోని న్యూ హౌజింగ్ బోర్డులోని కారా ఫ్యాక్టరీ నాణ్యత అంతంత మాత్రంగానే పాటిస్తున్నారని కాలనీకి చెందిన పలువురు పేర్కొంటున్నారు. కారా తయారీలో వాడాల్సిన నూనె, తదితర వస్తువులు తక్కువ క్వాలిటీవి వాడడంతో ప్రజల అనారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొంది. అలాగే తయారీ గదిలో అపరిశుభ్రత వాతావరణం నెలకొందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా తయారు చేసిన ఖరా నేలపైనే వేస్తున్నారని, నేలపై వేసిన ఖరాలో కాళ్లు ఉంచి ప్యాకింగ్ చేసి ప్రజల అరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. కారా ఫ్యాకింగ్ చేసిన ప్యాకెట్‌పై కనీసం మనుఫాక్చరింగ్, ఎక్స్పైర్ తేదీ కూడా ముద్రించకపోవడంతో దాని కాల పరిమితి ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలియని పరిస్థితి. తనిఖీలు చేయావాల్సిన ఫుడ్ ఇన్స్ స్పెక్టర్లు కనీసం అటు వైపు తొంగి కూడా చూడడం లేదని న్యూ హౌజింగ్ బోర్డుకు చెందిన ప్రజలు వాపోతున్నారు. ఎలాంటి అనుమతులు ఇవ్వ లేదు తమ పరిధిలోని ఖరా ఫ్యాక్టరీ కోసం అనుమతులు ఇవ్వలేదు. కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఇచ్చామని గ్రామ పంచాయతీ సర్పంచ్ రాథోడ్ రామారావు, పంచాయతీ కార్యదర్శి కలీంలు ‘సాక్షి’తో తెలిపారు. కలుషిత వాతావరణం నెలకొంటుందని రెండు రోజుల కిందట కాలనీ వాసులు తమకు ఫిర్యాదు కూడా చేశారు. త్వరలో కారా తయారీ వ్యాపారునికి నోటీసులు జారీ చేస్తాము. లైసెన్స్ ఉంది.. తము అనుమతులు తీసుకోని కారా తయారీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాం. వ్యాపారానికి సంబంధించినలైసెన్స్ కూడా తమ వద్ద ఉంది. ఇక్కడ తయారు చేసి హోల్ సేల్‌లో అమ్మకాలు చేపడుతున్నాం. తమ లైసెన్స్ ను ఏడాది ఒకసారి రెన్యూవల్ కూడా చేస్తున్నామని ఖరా తయారీ నిర్వాహకులు తెలిపారు. -
కాగుతున్న కల్తీ నూనె
సిరిసిల్ల టౌన్ : కల్తీ నూనె వ్యాపారులకు కాసులు కురిపిస్తుండగా.. ప్రజలను అనారోగ్యం పంచుతోంది. మార్కెట్లో విలువలేని, నాసిరకం నూనెను ఎక్కువ ధర పలికే పల్లి, నువ్వులు, సన్ ఫ్లబర్ తదితర వంటనూనెల్లో కలిపి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. సిరిసిల్ల, కామారెడ్డి, వేములవాడకు చెందిన ఐదుగురు బడావ్యాపారులు కల్తీ దందా సాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాకినాడ, కృష్ణపట్నం తదితర ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల్లోంచి వ్యాపారులు లారీల కొద్ది నాసిరకం నూనెలు ఇక్కడకు తీసుకొస్తున్నారని తెలుస్తోంది. వాటిని టిన్స్ ప్యాకెట్స్, కాటన్లలో ప్యాకింగ్ చేసి బ్రాండెడ్ లుక్ ఇస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓవ్యాపారి, మాజీ ప్రజాప్రతినిధి కలిసి చాలా ఏళ్లుగా లూజ్ ఆయిల్ విక్రయాలు సాగిస్తున్నారని సమాచారం. స్వల్ప వ్యవధిలోనే రూ.కోట్ల ఆదాయం సమకూరడంతో వీరిని స్ఫూర్తిగా తీసుకున్న వేములవాడకు చెందిన మరోముగ్గురు వ్యాపారులు కలిసి ఇదే అక్రమబాట పట్టారని చెబుతున్నారు. కామారెడ్డికి చెందిన మరో వ్యాపారి ఒకడుగు ముందుకేసి పక్కరాష్ట్రాల నుంచి తెప్పిస్తున్న నాసిరకం నూనెను బ్రాండెడ్‌గా మార్చి ప్రజలను నమ్మిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈవ్యాపారికి సిరిసిల్ల పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు బినామీలుగా వ్యవహరిస్తూ..అధికారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని దందా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం సదరు వ్యాపారి తన బినామీలు, అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. నూనెల శాంపిళ్లు సేకరించి నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు దీంతో మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం విడి నూనె అమ్మకాలకు అనుమతి లేకున్నా కొందరు వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఉన్నతాధికారులు సిరిసిల్ల పట్టణ శివారులోని ఓ బడా వ్యాపారి గోదాంలో దాడులు చేయగా మంచినూనెలో తక్కువ రేటుకు దొరికే కల్తీ నూనె పట్టుబడింది. కానీ సదరు వ్యాపారి అధికారులను మచ్చిక చేసుకుని కేసులు కాకుండా చూసినట్లు ఆరోపణలున్నాయి. ఇదే పద్ధతిని వేములవాడ, కామారెడ్డి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసే అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చిరువ్యాపారులు సైతం బడా వ్యాపారుల వద్ద కల్తీ నూనె కొనుగోలు చేస్తూ జనాలకు అంటగడుతున్నారు. కామారెడ్డికి చెం దిన వ్యాపారి భారతీయ నాణ్యత ధ్రువీకరణ సంస్థ అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నాడని ప్రచారంలో ఉంది. తద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివి« ద రకాల పన్నులు నెలకు రూ.లక్షల్లో ఎగవేస్తూ జీరో దందాను దర్జాగా సాగిస్తున్నారని పేర్కొంటున్నారు. లెక్కాపత్రం లేదు.. జిల్లాలోని 13 మండలాల పరిధిలో సాగుతున్న కల్తీ నూనె దందాకు లెక్కాపత్రాలు రాయడంలేవు. కేవలం తెల్లకాగితాలపైనే ‘నూనె వచ్చిందా..అమ్మిందా..డబ్బు అందిందా’ అనే కోణంలోనే వ్యాపారులు రాస్తూ అక్రమాలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. సిరిసిల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో సుమారు 200 మంది రిటైల్ వ్యాపారులున్నారు. వీరి వద్ద ఒక్కరోజులోనే రూ.20 లక్షల విలువైన వ్యాపారం సాగుతోందని అంచనా. ఈలెక్కన నెలకు దాదాపు రూ.5.40 కోట్ల విలువైన కల్తీ నూనె వ్యాపారం సాగుతోందని మార్కెట్ పరిశీలకుల అంచనా వేస్తున్నారు. దందా ఇంతపెద్దఎత్తున సాగుతున్నా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అధికారుల విధి నిర్వహణ తీరుకు అద్దం పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని నూనె వ్యాపారులు : 200 రోజూ అమ్ముడయ్యే నూనెలు : నెలకు 8–10 లారీల లోడ్ రోజూ విక్రయించే నూనె విలువ : రూ.20లక్షలు ఒక్కో నెలలో అక్రమ సంపాదన : రూ.5.40కోట్లు -
జీరో కమాల్
►చక్కర, సబ్బులు, నూనెసహా నిత్యావసర వస్తువుల అక్రమ దందా ►రోజూ రూ.10 లక్షల పన్నుఎగవేస్తూ ఒకే బ్రాండ్ సబ్బుల దిగుమతి ►చక్కెర, నూనెలదిగుమతిలోనూ రోజుకు రూ.లక్షల్లో పన్ను ఎగవేత ►సర్కారు ఆదాయానికి ప్రతినెలా రూ.100 కోట్లకుపైగా గండి ►జోరుగా కల్తీనూనె వ్యాపారం.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ►కరీంనగర్ టవర్‌సర్కిల్, గంజ్ ప్రాంతాలు అడ్డాగా వ్యాపారం ►కార్పొరేషన్‌కు చెందిన ముఖ్య నేత అండతో చెలరేగుతున్న వైనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: ‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ అక్రమాలకు అనర్హం’ అన్నట్లుగా జిల్లాలో పరిస్థితి తయారైంది. ఒకవైపు కల్తీ, మరోవైపు జీరో దందాతో సరుకులు దిగుమతి అవుతున్నాయి. చక్కెర, సబ్బులు, సర్ఫ్ వంటి వస్తువులు పన్నులు చెల్లించకుండా లారీల కొద్దీ దిగుమతి అవుతుండగా... పామాయిల్, పల్లీ, సన్‌ఫ్లవర్ నూనెల పేరుతో తయారు చేసిన కల్తీ నూనెల వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతిరోజూ రూ.కోట్లలో పన్నును ఎగవేస్తూ కొందరు వ్యాపారులు జీరో దందా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. జీరో దందా ఫలితంగా ప్రతినెలా పన్నుల రూపంలో సర్కారు ఖజానాకు చేరాల్సిన దాదాపు రూ.100 కోట్లు జీరో దందా కేటుగాళ్ల జేబుల్లోకి వెళుతోంది. మరోవైపు ఈ కేటుగాళ్లకు నగర పాలక సంస్థకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండతో చెలరేగుతున్నారు. ఒకే బ్రాండ్ సబ్బుతో సర్కారుకు రూ.కోటిన్నర గండి కరీంనగర్ జిల్లాలో బట్టల సబ్బుల్లో ఓ బ్రాండ్‌కు సంబంధించిన సబ్బుల విక్రయాలు విరివిగా అమ్ముడుపోతున్నారుు. తెలంగాణ సరిహద్దు జిల్లాలో ఈ బ్రాండ్ సబ్బు తయారవుతోంది. జిల్లాలో ప్రతిరోజు ఎన్ని బట్టల సబ్బులు అమ్ముడుపోతాయో అందులో సగం వాటా ఈ బ్రాండ్‌దే. ప్రతిరోజూ ఈ సబ్బుల కాటన్లతో జిల్లాకు లారీలు వస్తుంటారుు. నెలకు సగటున 40కిపైగా లారీలు జిల్లాకు వస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఒక్కో లారీకి సుమారు రూ.5 లక్షల వరకు టాక్స్ చెల్లించాలి. ఆ మేరకు ట్యాక్స్ చెల్లించినప్పటికీ సదరు సబ్బుల డీలర్‌కు ఒక్కో లారీలోని కాటన్లను అమ్మడం ద్వారా రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. కానీ సదరు డీలర్ టాక్స్ చెల్లించకుండా తెలివిగా ఎత్తులు వేస్తున్నాడు. నెలలో 5 నుంచి 10 లారీలకు మాత్రమే టాక్స్ కట్టి మిగతా వాటిని అక్రమంగా జిల్లాకు తరలిస్తున్నారని తెలుస్తోంది. దీనివల్ల ఒక్కోలారీకి రూ.5 లక్షల టాక్స్ మిగలడమే కాకుండా మరో రూ.5 లక్షల లాభం చేకూరుతుందని తెలిసింది. కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, లక్షెట్టిపేటతోపాటు పలు ప్రాంతాలకు నగరం నుంచే ఈ సబ్బులను సరఫరా చేస్తున్నారు. టవర్‌సర్కిల్ అడ్డాగా నగరానికి చెందిన ఓ వ్యాపారి ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యాపారి జీరో దందాకు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులకు ఈ వ్యాపారి జీరో దందా విషయం తెలిసినప్పటికీ ప్రజాప్రతినిధి మద్దతు ఉండటంతో కిమ్మనలేకపోతున్నారు. దీనికితోడు సదరు అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండటంతో తమకెందుకులే అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. చక్కెర దందాతో రూ.కోటి గండి చక్కెర విషయంలోనూ ఇదే తంతు. ప్రతినెలా వందల కొద్దీ చక్కెర లారీలు జిల్లాకు వస్తుంటాయి. ఒక్క జిల్లా కేంద్రానికే ప్రతిరోజు సుమారు 5 లారీల చక్కెర దిగుమతి అవుతుంది. నిబంధనల ప్రకారం ఒక్కో లారీ లోడ్‌కు రూ.50 వేల మేరకు పన్ను చెల్లించాలి. ఆ పన్నులతో కలిపి అమ్మకాలు నిర్వహించాలి. కానీ టాక్స్‌లు చెల్లించకుండా రిటైల్ వ్యాపారులకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు. తద్వారా ప్రతినెలా ప్రభుత్వ ఖజానాకు రూ.కోటికి పైగా గండికొడుతున్నారు. ప్రతినెలా మామూళ్లు వచ్చి చేరుతుండడంతోనే అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పుసహా పలు రకాల పప్పుల విషయంలోనూ ఇదే తంతు. నగరంలోని గంజ్ కేంద్రంగా కొందరు వ్యాపారులు రశీదులు, ట్యాక్స్‌లు లేకుండానే జీరో దందా కొనసాగిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. పప్పు, చక్కెర వంటి వాటిని శివారు ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. కల్తీ నూనె దందా... జిల్లాలో కల్తీ నూనె వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోరుుంది. నిబంధనల ప్రకారం లూజ్ నూనె అమ్మకాలు చేయరాదు. కాని నగరంలోని పలు వ్యాపార ప్రాంతాల్లో వందలాదిడ్రమ్ముల్లో నూనె అమ్మకాలు కొనసాగిస్తున్నారు. పామాయిల్, పల్లీ, సన్‌ఫ్లవర్ పేరుతో శుద్ధి చేయకుండా కల్తీ నూనె విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీటితోపాటు కొందరు అక్రమార్కులు కరీంనగర్ శివారు ప్రాంతాలు, సమీప గ్రామాల్లో డ్రమ్ముల కొద్దీ నూనెను నిల్వ చేస్తున్నారు. అక్కడే క్యాన్లు, టిన్లు, ప్యాకెట్లలో నూనెను నింపి కొత్త కొత్త పేర్లతో ప్యాకింగ్ చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రతి రోజు నకిలీ బ్రాండ్ల నూనె ప్యాకెట్లు, క్యాన్ల వ్యాపారం సుమారు రూ.10 లక్షలకుపైగా ఉంటున్నట్లు సమాచారం. అనుమతులు లేకుండా తయారు చేస్తున్న నూనెల్లో ప్రమాదకరమైన రసాయాలను కలపడమే కాకుండా శుద్ధి చేయకపోవడం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. గుట్కా రూటే సపరేటు ఒకప్పుడు జిల్లాలో గుట్కా విక్రయాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. గుట్కా అక్రమార్కులకు కరీంనగర్ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల అండ పుష్కలంగా ఉంది. ఇందులో ఒకరు గుట్కా దందాలో కీలక భాగస్వామి కాగా... మరొక ముఖ్యనేత అందడండలున్నారుు. ఇటీవల కరీంనగర్ మండలంలో సుమారు రూ.2.5 లక్షల విలువైన గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. రంగంలోకి దిగిన ముఖ్యనేత తన అధికారిన్ని అడ్డుపెట్టి గుట్కా బయటకు రాకుండా దొరికి చోటనే తాళలు వేయిం చారు. ఈ కే సులో ప్రమేయమున్న తన నమ్మకస్తున్ని చాకచక్యంగా తప్పించారనే ప్రచారం పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడి
మొమిన్‌పేట: రంగారెడ్డి జిల్లాలో మాంసం వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న ఓ పౌల్ట్రీఫారంపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొమిన్‌పేట శివారులోని బారి పౌల్ట్రీఫారంలో అక్రమంగా కల్తీ నూనెను తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో దాడి చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యజమాని బారి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీనెయ్యి తయారీ కేంద్రాలు సీజ్
-
ఆయిల్‌ఫెడ్ సొమ్ము అక్రమార్కుల పాలు
* పేరుకుపోయిన రూ. 7.68 కోట్ల బకాయిలు * అందులో చెక్‌బౌన్స్‌తో రూ. 2.6 కోట్లు ముంచిన ఓ కంపెనీ * అశ్వారావుపేట ఫ్యాక్టరీ క్రూడ్ ఆయిల్లో భారీ మోసాలు * ముడిచమురు వెలికితీత * తక్కువ చూపిస్తూ రైతు నోట్లో మట్టి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఆయిల్‌ఫెడ్ సొమ్మును కొందరు డీలర్లు, అధికారులు అడ్డంగా తినేస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఒకవైపు వంట నూనె కల్తీతోపాటు ఆయిల్‌ఫాం క్రషింగ్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే ముడిచమురులోనూ భారీ మోసాలు జరుగుతున్నా యి. దీంతో రూ. కోట్లు పక్కదారి పడుతున్నాయి. డీలర్లు, అధికారులు కుమ్మక్కై రైతులకు దక్కాల్సిన లాభాలను కొల్లగొడుతున్నారు. కల్తీనూనెతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు తిలోదకాలు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి ఆయిల్‌ఫాం క్రషింగ్ ఫ్యాక్టరీల నుంచి యానాంకు చెందిన ఒక ప్రైవేటు ఆయిల్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్‌కు గత ఏడాది ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 20 వరకు ముడిచమురు అమ్మారు. దాని విలువ రూ. 3.86 కోట్లు. ఇందుకోసం ఆ కంపెనీ జారీ చేసిన చెక్కుల్లో రూ. 1.26 కోట్లే జమ అయింది. మిగిలిన రూ. 2.6 కోట్ల చెక్‌లు బౌన్స్ అయ్యాయి. చివరకు కంపెనీ చే తులు ఎత్తేసింది. చెక్‌లు పాసయ్యాకే ముడిచమురు విక్రయించాలన్న నిబంధనకు తిలోదకాలు ఇచ్చారు. 2003లో 9 మంది డీలర్లకు ముందస్తు అడ్వాన్సు లేకుండానే రూ. 5.18 కోట్ల విలువైన విజయ ఆయిల్‌ను అమ్మకం కోసం ఇచ్చారు. కానీ వారి నుంచి ఇప్పటివరకు ఆ బకాయిలు వసూలు చేయలేదు. వడ్డీతో కలిపి ఆ సొమ్ము రూ. 15 కోట్లు అయి ఉంటుందని అంచనా. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ఆయిల్‌ఫాం ఆయిల్ మిల్లుకు రెండేళ్ల క్రితం రూ. 4 కోట్లతో ‘దస్క్’ అనే యంత్ర పరికరాన్ని కొన్నారు. క్రూడ్ ఆయిల్ తక్కువ వస్తుందని రైతులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాన్ని పక్కన పెట్టేశారు. రెండేళ్లుగా మూలన పడటంతో రూ. 4 కోట్లు వృథా అయ్యాయి. రైతులు, ఉద్యోగుల నోట్లో మట్టి ఆయిల్‌ఫాంలో పామాయిల్ గానుగ ఆడించగా వచ్చే ముడిచమురు సాధారణంగా క్వింటాలుకు 19.2 శాతం రావాలి. కానీ అశ్వారావుపేట, పెదవేగి ఫ్యాక్టరీల్లో అది 17-18 శాతం మధ్యే చూపిస్తున్నారు. గింజ శాతం క్వింటాలుకు 12 శాతం రావాలి. అది 6 నుంచి 7 శాతం మధ్యే ఉంటుంది. ఒక శాతం రికవరీ తేడా ఉంటే ఏడాదికి రూ. కోటి తే డా ఉంటుంది. 2013లో ఈ తేడాల కారణంగా రూ. 5.6 కోట్లు తక్కువ రికవరీగా చూపించారు. ఇదంతా పక్కదారి పట్టింది. దీనివల్ల రైతుకు ఇవ్వాల్సిన సేకరణ ధర అత్యంత తక్కువకు పడిపోతుంది. ఇక ఉద్యోగ విరమణ తర్వాత 160 మంది పింఛన్ కోసం ఆయిల్‌ఫెడ్ రూ. 11 కోట్లు, తమ వాటాగా ఉద్యోగులు రూ. 2 కోట్లు ఒక జాతీయ బ్యాంకుకు గత ఏడాది మార్చి 15న చెల్లించారు. బ్యాంకుకు నేరుగా చెల్లిస్తే 8 శాతం కమిషన్ కింద రాయితీ ఇచ్చేవారు. కానీ ఏజెంటు ద్వారా వెళ్లి... కమీషన్ కాజేసేందుకు అతనితో కుమ్మక్కై అధికారులు రూ. 1.04 కోట్లు అదనంగా చెల్లించారు. -
పశు వ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి యత్నం!
మాల్కాపూర్ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు పరిగి: పశువుల వ్యర్థాలతో నూనెతయారీకి అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు. పరిగి మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు చేశారు. పశువుల చర్మం, కొవ్వు తదితర వ్యర్థాలతో దుర్వాసన రావడంతో విషయం శనివారం బయటకు పొక్కింది. దీంతో అక్రమార్కులు తమ బండారం బయటపడుతుందని తమ జాగ్రత్తల్లో మునిగిపోయారు. గ్రామాల్లో తయారీపై కన్ను.. ఇటీవల నగర శివారులోని కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పశువుల వ్యర్థాలతో అక్రమార్కులు నూనె తయారు చేస్తుండడంతో అధికారులు, పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో అక్రమార్కుల కన్ను గ్రామాలపై పడింది. పరిగి ప్రాంతానికి చెందిన కొందరితో కుమ్మక్కై వ్యవసాయ పొలాలు, అటవీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీనూనె తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నూనె సరఫరాపై కూడా ఒప్పందాలు కుది రినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తండాలే టార్గెట్.. ఇప్పటి వరకు వ్యాన్లలో నగరం నుంచి కల్తీనూనె తీసుకొచ్చి గ్రామీణ ప్రాం తాల్లో విక్రయిస్తూ వచ్చిన వ్యాపారులు తమ పంథా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. వ్యాపారులు నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిగి, కుల్కచర్ల, గండేడ్ మండల పరిధిలోని పలు హాస్టళ్లకు తక్కువ ధరలకు ఆశచూపి కల్తీ నూనె సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఓ కల్తీ నూనె డబ్బాలు తరలిస్తు న్న వ్యాన్ పోలీసులకు పట్టుబడింది. ‘పెద్దల’ ఒత్తిడి పెరగడంతో పోలీసులు సదరు వాహనాన్ని వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
జంతుకళేబరాలతో వంట నూనె తయారీ..!
నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : నిర్మల్ కేంద్రంగా జోరుగా జంతుకళేబరాలతో వంటనూనె తయారవుతోంది. క ల్తీ నూనె బాహాటంగానే తయారవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగేస్తున్నారు. అక్టోబర్ 12న రాంనగర్లో ఓ ఇంట్లో పెద్ద ఎత్తున జంతుకళేబరాలతో తయారు చేసిన నూనెడబ్బాలు, జంతు కొవ్వు, ఎముకలు బయటపడిన సంఘటన అప్పుడు రాష్ట్రవాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన మరువక ముందే బాగులవాడలోని వాల్మీకినగర్‌లో గురువారం పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం తో, అప్పటికే నిందితులు డబ్బాలను మాయం చేశారు. అయితే పోలీసులు అక్కడ ఉన్న వారిని విచారించి చేతులు దులుపుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా.. హైదరాబాద్‌లోని జంతువుల కొవ్వు, ఎముకల తో నూనె తయారుచేసి విక్రయిస్తున్న ముఠా నిర్వాకం బయటపడిన విషయం తెలిసిందే. అయితే పట్టణంలోనూ వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ఇలాంటి ముఠాలు కోకొల్లలుగా ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరికీ అనుమానం కలగకుండా కొందరు ఇళ్లలోనే కల్తీనూనె తయారు చేస్తున్నారు. కాలనీల్లోని సందుల్లో బట్టీలను ఏర్పాటుచేసి, జంతువుల కొవ్వును పెద్ద పెద్ద పాత్రల్లో వేసి ఉడికించి నూనె తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో వెలువడే దుర్గంధంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నా అధికారులెవరూ అడ్డుచెప్పకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా...? శివారు ప్రాంతాలు, మురికి ప్రాంతాలను కేం ద్రంగా చేసుకుని ఈ వ్యాపారాన్ని కొందరు య థేచ్ఛగా నిర్వహిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదరికాన్ని, యువత నిరుద్యోగా న్ని ఆసరా చేసుకుని తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. తయారుచేసిన నూనెను డబ్బాల్లో నింపి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సమాచారం. నూనె చౌకగా లభిస్తుండడంతో పెద్ద వ్యాపారులు నూనె కొనుగోలు చేస్తున్నారు. దీంతో దందా మూడుపువ్వులు ఆ రుకాయలుగా కొనసాగుతోంది. వ్యాపారానికి ఎవరి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో కుటీర పరిశ్రమగా సాగుతోంది. కల్తీనూనె దారెటు..! జంతుకళేబరాలతో తయారుచేస్తున్న నూనెను తయారీదారులు ఎక్కడ విక్రయిస్తున్నారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. రాంనగర్ సంఘటనలో అధికారులు తయారీదారులను విచారించినప్పుడు వారు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. సబ్బుల తయారీలో వినియోగిస్తున్నామని ఓసారి, హోటళ్లు, తినుబండారాల్లో వినియోగం కోసం విక్రయిస్తున్నామని మరోసారి పొంతన లేకుండా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆహారపదార్థాల్లో ఈ కల్తీనూనెను వినియోగిస్తే.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆలోచిస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. బలవుతున్న మూగజీవాలు...? కల్తీనూనె తయారీకి జంతువుల కళేబరాలు, కొ వ్వు, ఎముకలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నా రు. పలు ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల్లో ప్రతీ రోజు పదుల సంఖ్యలో లీటర్ల నూనెను త యారుచేస్తున్నారు. దీనికి కావలసిన ముడి సరుకుకోసం జంతువుల వధ తప్పనిసరి అవుతోంది. అయితే ఇంత పెద్దమొత్తంలో జంతువులను ఎ క్కడ వధిస్తున్నారనేది ప్రశ్నార్థకం. అయితే ని ర్మల్‌లో ఉన్న ఒకే ఒక్క జంతువధశాలకు కూడా అనుమతి లేదని అధికారులే చెబుతున్నారు. ఇంతకు ముందు పట్టణంలోని రాంనగర్లో ఇ లాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు హడావిడి చేసినా సాధించింది శూన్యం. స్వయంగా జిల్లా ఆహార అధికారి వచ్చి కల్తీ నూ నె డబ్బాలు పరిశీలించారు. సేకరించిన పదార్థాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరిశీలన కో సం పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. పూర్తి స్థాయి నివేదికలు అందాకే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ అధికారులు దాటవేస్తున్నారు. కళ్లముందే పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ జరుగుతున్నా, దానిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థా నికులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు పోలీసులు, మున్సిపల్ అధికారులు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏ ఒక్క శాఖ అధికారి కూడా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ తంతు చూస్తే పైస్థాయి నాయకులు, అధికారుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
కల్తీ ఆయిల్ గుట్టు రట్టు
ఆదిబట్ల/ఇబ్రహీంపట్నం: కల్తీ ఆయిల్ తయారీ గుట్టును అధికారులు రట్టుచేశారు. వాహనాల్లో వినియోగించిన ఆయిల్ తీసుకొచ్చి రీసైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ఓ కంపెనీపై ఎస్ఓటీ అధికారులు దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఇఫ్తికార్ అహ్మద్ కథనం ప్రకారం.. హయత్‌నగర్ మండలానికి చెందిన నాగిరెడ్డి, వెంకట్రావులు రాందాస్‌పల్లి శివారులో నాలుగేళ్లుగా ఓ పాత పౌల్రీ ఫామ్‌లో వివిధ ప్రాంతాల నుంచి వినియోగించిన ఆయిల్‌ను తీసుకొచ్చి గుట్టుగా రీసైక్లింగ్ చేస్తున్నారు. అనంతరం నగరంలోని బేగంబజార్ మార్కెట్లో ఆయిల్‌ను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో కంపెనీపై దాడులు నిర్వహించారు. నిర్వాహకులు నాగిరెడ్డి, వెంకట్రావులను అరెస్టు చేవారు. వినియోగించిన పాత ఆయిల్ డ్రమ్ములు 31, రీసైక్లింగ్ చేసి తయారు చేసిన 12 ఆయిల్ డ్రమ్ములతో పాటు రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అధికారులు కేసును ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. -
కాటేస్తున్న కల్తీ నూనె
విచ్చలవిడిగా కల్తీ అమ్మకాలు {పజల ఆరోగ్యాలను హరిస్తున్న వ్యాపారులు అధికారుల దాడులు శూన్యం కల్తీకి కాదేది అనర్హం అంటున్నారు స్వార్ధపరులు. నూనె కల్తీతో ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్నారు. దాడులు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. చోడవరం,న్యూస్‌లైన్: ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో పేద, దిగువ తరగతి ప్రజల్లో ఎక్కువ శాతం మంది తక్కువ ధరకు లభించే పామాయిల్‌నే ఎక్కువగా వినియోగిస్తారు. దీనిని ఆసరాగా చేసుకుని ఈ రకం నూనెలోనే ఎక్కువ కల్తీ జరుగుతోంది. రిఫైన్డ్ ఆయిల్ పొద్దుతిరుగుడు పువ్వుల గింజల నుంచి తయారు చేస్తారు. వేరుశనగ, నువ్వులు రకాల నూనెలు ఉన్నప్పటికీ వాటి వాడుక నామమాత్రమే. తౌడు, మొక్కజొన్న కంకెలు, సన్‌ఫ్లవర్,పామాయిల్ పిప్పి నుంచి తీసే నూనె చాలా ప్రమాదకరం. వీటిని ఈ పామాయిల్లో కలిపేసి అమ్మేస్తున్నారు. వాస్తవానికి పామాయిల్ గెలల నుంచి తొలుత తీసే నూనె వినియోగిస్తే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ నూనె తీసేసిన పామాయిల్ పిప్పి, తౌడు, మొక్కజొన్న కంకెలను మళ్లీ గానుగలో వేసి తీసినది అత్యంత నాసిరకం. ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఈ నూనెలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల పామాయిల్లో ఈ నాసిరకం నూనెలను కలిపి విక్రయిస్తున్నారు. మండల కేంద్రాల్లో జరిగే లూజు అమ్మకాల్లో దాదాపు 60 శాతం వరకూ కల్తీ జరుగుతోంది. అరడబ్బా అసలు నూనెలో మరో అరడబ్బా నాసిరకం కలిపేసి విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ నూనె లీటర్ రూ.80 వరకూ ఉంది. అయితే ఈ నాసిరకపు నూనె రూ.40కే లభిస్తుండడంతో దీనిని మేలు రకపు సరుకులో కలిపేసి సొమ్ము చేసుకుంటున్నారు. చోడవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న హోల్‌సేల్, రిటైల్ నూనెదుకాణాల్లో ఈ వ్యవహారం మరీ ఎక్కువగా జరుగుతోంది. నేరుగా ట్యాంకర్‌తో వచ్చిన నూనెను హోల్‌సేల్ వ్యాపారులు పీపాల్లోకి తీసి వాటి నుంచి 15 కిలోల డబ్బాల్లోకి నింపేటప్పుడు కల్తీ చేస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చే డబ్బాల కన్నా లూజు డబ్బాలు తక్కువ ధరకు లభిస్తాయని వినియోగదారులకు ఒప్పిస్తూ ఈ నాసిరకపు నూనెలు అంటగడుతున్నారు. చోడవరం పరిసర ఏడు మండలాల ప్రజలు ఇక్కడే నూనె కొనుగోలు చేస్తారు. వీరంతా రైతులు, సామాన్య ప్రజలు కావడంతో వ్యాపారులు ఇష్టానుసారం ఈ నాసిరకపు సరుకు అంటగడుతున్నారు. ప్రజలు మాత్రం నాసిరకం నూనెలు తిని కాలేయం, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఏనాడూ అధికారులు ఇలాంటి వ్యవహారాలపై దాడులు చేసిన దాఖలాలు లేవు.