నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : నిర్మల్ కేంద్రంగా జోరుగా జంతుకళేబరాలతో వంటనూనె తయారవుతోంది. క ల్తీ నూనె బాహాటంగానే తయారవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగేస్తున్నారు. అక్టోబర్ 12న రాంనగర్‌లో ఓ ఇంట్లో పెద్ద ఎత్తున జంతుకళేబరాలతో తయారు చేసిన నూనెడబ్బాలు, జంతు కొవ్వు, ఎముకలు బయటపడిన సంఘటన అప్పుడు రాష్ట్రవాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ సంఘటన మరువక ముందే బాగులవాడలోని వాల్మీకినగర్‌లో గురువారం పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం తో, అప్పటికే నిందితులు డబ్బాలను మాయం చేశారు. అయితే పోలీసులు అక్కడ ఉన్న వారిని విచారించి చేతులు దులుపుకున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా..
హైదరాబాద్‌లోని జంతువుల కొవ్వు, ఎముకల తో నూనె తయారుచేసి విక్రయిస్తున్న ముఠా నిర్వాకం బయటపడిన విషయం తెలిసిందే. అయితే పట్టణంలోనూ వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ఇలాంటి ముఠాలు కోకొల్లలుగా ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరికీ అనుమానం కలగకుండా కొందరు ఇళ్లలోనే కల్తీనూనె తయారు చేస్తున్నారు. కాలనీల్లోని సందుల్లో బట్టీలను ఏర్పాటుచేసి, జంతువుల కొవ్వును పెద్ద పెద్ద పాత్రల్లో వేసి ఉడికించి నూనె తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో వెలువడే దుర్గంధంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నా అధికారులెవరూ అడ్డుచెప్పకపోవడం గమనార్హం.
కుటీర పరిశ్రమగా...?
శివారు ప్రాంతాలు, మురికి ప్రాంతాలను కేం ద్రంగా చేసుకుని ఈ వ్యాపారాన్ని కొందరు య థేచ్ఛగా నిర్వహిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదరికాన్ని, యువత నిరుద్యోగా న్ని ఆసరా చేసుకుని తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. తయారుచేసిన నూనెను డబ్బాల్లో నింపి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సమాచారం. నూనె చౌకగా లభిస్తుండడంతో పెద్ద వ్యాపారులు నూనె కొనుగోలు చేస్తున్నారు. దీంతో దందా మూడుపువ్వులు ఆ రుకాయలుగా కొనసాగుతోంది. వ్యాపారానికి ఎవరి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో కుటీర పరిశ్రమగా సాగుతోంది.
కల్తీనూనె దారెటు..!
జంతుకళేబరాలతో తయారుచేస్తున్న నూనెను తయారీదారులు ఎక్కడ విక్రయిస్తున్నారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. రాంనగర్ సంఘటనలో అధికారులు తయారీదారులను విచారించినప్పుడు వారు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. సబ్బుల తయారీలో వినియోగిస్తున్నామని ఓసారి, హోటళ్లు, తినుబండారాల్లో వినియోగం కోసం విక్రయిస్తున్నామని మరోసారి పొంతన లేకుండా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆహారపదార్థాల్లో ఈ కల్తీనూనెను వినియోగిస్తే.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆలోచిస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.
బలవుతున్న మూగజీవాలు...?
కల్తీనూనె తయారీకి జంతువుల కళేబరాలు, కొ వ్వు, ఎముకలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నా రు. పలు ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల్లో ప్రతీ రోజు పదుల సంఖ్యలో లీటర్ల నూనెను త యారుచేస్తున్నారు. దీనికి కావలసిన ముడి సరుకుకోసం జంతువుల వధ తప్పనిసరి అవుతోంది. అయితే ఇంత పెద్దమొత్తంలో జంతువులను ఎ క్కడ వధిస్తున్నారనేది ప్రశ్నార్థకం.
అయితే ని ర్మల్‌లో ఉన్న ఒకే ఒక్క జంతువధశాలకు కూడా అనుమతి లేదని అధికారులే చెబుతున్నారు. ఇంతకు ముందు పట్టణంలోని రాంనగర్‌లో ఇ లాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు హడావిడి చేసినా సాధించింది శూన్యం. స్వయంగా జిల్లా ఆహార అధికారి వచ్చి కల్తీ నూ నె డబ్బాలు పరిశీలించారు. సేకరించిన పదార్థాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరిశీలన కో సం పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. పూర్తి స్థాయి నివేదికలు అందాకే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ అధికారులు దాటవేస్తున్నారు.
కళ్లముందే పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ జరుగుతున్నా, దానిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థా నికులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు పోలీసులు, మున్సిపల్ అధికారులు, జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏ ఒక్క శాఖ అధికారి కూడా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ తంతు చూస్తే పైస్థాయి నాయకులు, అధికారుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
జంతుకళేబరాలతో వంట నూనె తయారీ..!
Published Sat, Nov 22 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement