Animal fat
-
నకిలీ నెయ్యి కలకలం
పిఠాపురం: జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగు చూసింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కాæసమాచారం మేరకు పిఠాపురంలో శుక్రవారం ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పిఠాపురంలోని రెండవ రోడ్డులోని పద్మావతినగర్‌లో బండారు ఫణి ప్రసాద్ ఇంట్లో సుమారు 400 కేజీల నకిలీ నెయ్యిని, దాని తయారీకి ఉపయోగించే సామగ్రిని సీజ్ చేశారు. గోవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి పలు దేవాలయాలకు సరఫరా చేస్తున్నట్టు తయారీ దారులు కమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. రానున్న కార్తీకమాసాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా నకిలీ నెయ్యి తయారు చేసి ఆలయాల వద్ద విక్రయించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కమిషనర్ సైతం ధ్రువీకరించారు. ఇదే పిఠాపురంలో ఇలాంటి కేంద్రాలు ఇంకా ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు దొంగలను పట్టుకోరా? ఇదిలా ఉండగా, ఈ విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ.. చాలా మందికి తెలియడంతో విషయాన్ని బయట పెట్టక తప్పలేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో చెందుర్తి, కొడవలి, తాటిపర్తి తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో అనధికార కబేళాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ యథేచ్చగా గోవధ జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నెయ్యికి ఉపయోగించే జంతు కొవ్వు ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలిసింది. గోవులను చంపి, అందులో కావాల్సిన మాంసాన్ని తీసుకుని.. మిగిలిన వ్యర్థ పదార్థాలను, ఎముకలను కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచి, దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే నకిలీ నెయ్యిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యిని పలు ఆలయాల్లో పూజలు, ప్రసాదాల తయారీ, దీపారాధనకు వినియోగిస్తున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి దందా వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు తెలిసింది. ఇంత జరిగినా అధికారులు అసలు వ్యక్తులను వదిలేసి.. వీళ్లే నిర్వాహకులంటూ కొందరిపై నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
బీ అలెర్ట్.. జంతు కళేబరాలతో కల్తీ నూనె..
ఉరుకులు.. పరుగుల నగరజీవికి కాసింత విశ్రాంతి దొరికేది భోజనం దగ్గరే.. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కొందరు ఉద్యోగులు ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటారు. ఆకలి తీర్చుకునేందుకు టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, చిరుతిళ్ల బండ్లను ఆశ్రయించాల్సిందే.. నోరూరించే బిర్యానీ.. వేడివేడి బజ్జీలు.. బాగా నూనె దట్టించిన దోశ.. ఇలా ఏది తిన్నా ఆరోగ్యానికి డ్యామేజీ అయినట్లే.. ఎవరు ఏ కల్తీ నూనె వాడుతున్నారో తెలియకపోవడంతో రోగాలు తప్పడం లేదు. కొన్నిచోట్ల జంతువుల వ్యర్థాలను మరిగించి తీసిన నూనెలతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఆ నూనే వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి బేగంబజార్ కేంద్రంగా మార్కెట్లో విక్రయించి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడ, శాస్త్రిపురం, జలపల్లి, మల్లాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాలు పశువ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి అడ్డాగా మారాయి. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల స్టిక్కర్లతో బేగంబజార్ కేంద్రంగా వాటిని హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. పశువుల వ్యర్థాలతో నూనె తీసే ప్రాంతాల్లోకి ప్రవేశించడం సామాన్యులేవరికీ సాధ్యం కాదు. కోటలను తలపించే ప్రహరీల మధ్య ఈ గోడాన్లు ఉంటాయి. అక్కడ పనిచేసే వారంతా బిహార్, యూపీ, అసోం, ఓడిశా రాష్ట్రాలకు చెందిన యువకులే.. కొత్తవారు కనిపిస్తే దాడులకు ఏమాత్రం వెనకాడరు. ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమల ముసుగులోనూ పశువ్యర్థాలతో తీసిన నూనె కలిపి పేరొందిన బ్రాండ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: నూనెల ధరలు పెరుగుదల పశువుల వ్యర్థాలతో.. పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం.. చనిపోయిన జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నారు. మూతపడిన కార్ఖానాల్లో భారీ ఇనుప గోళాలు, గిన్నెల్లో పశువుల ఎముకలు, కొవ్వును కరిగేదాకా మరగబెట్టి నూనె తీస్తున్నారు. దాన్ని డబ్బాలు, ప్యాకెట్లలో నింపి బ్రాండెడ్ లేబుళ్లను అంటించి జనంపైకి వదులుతున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ రోత పుట్టించే దందా సాగుతోంది మహానగర పరిధిలోనే.. ఏళ్లతరబడి ఖాళీగా పోస్టులు విశ్వ నగరం వైపు పరుగులు తీస్తూ కోటి మందికి పైగా జనాభా కలిగిన హెదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతా విభాగం సిబ్బంది సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. జీహెచ్ఎంసీ ఆహార తనిఖీ విభాగానికి సర్కిల్ ఒకరి చొప్పున 30 పోస్టులు మంజురు కాగా, పని చేస్తోంది 20 మంది మాత్రమే. ఐదు గెజిటెడ్ పోస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారు. సర్కిల్ స్థాయిలో 10 పోస్టులు, గెజిటెడ్ స్థాయిలో మూడు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఈ లెక్కన గ్రేటర్ హైదరాబాద్‌లో 200 మందికి తగ్గకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఇటీవల కొన్ని ఘటనల్లో.. ఏడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లోని ఒక ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారీ బండారం బయటపడింది. అక్టోబర్‌లో శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మైలాదేవులపల్లి పరిధిలోని అలీనగర్‌లో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న మూడు కేంద్రాలపై దాడులు చేసి సీజ్ చేశారు. నగర శివార్లలోని జల్పల్లి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పెద్ద పెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికిస్తుండగా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 160 డమ్ముల నూనె సీజ్ చేశారు. జల్పల్లి నుంచి పహాడీషరిఫ్‌కు వెళ్లే దారిలో కల్తీ నూనె దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న కేన్సర్ కేసులు గ్రేటర్లో ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 12వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వాడిన ఆయిల్‌ను మళ్లీ వినియోగించడంతో రోగాలు పెరుగుతున్నాయి. కల్తీ నూనెతో రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ నూనె కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కేన్సర్‌కు కారణమవుతుంది. ఆ నునె వాసన పీల్చినా ప్రమాదమే.. ఫిర్యాదులు అందితేనే.. ఈ విషపూరిత నూనెను అరికట్టేందుకు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు అందితే దాడిచేసి సీజ్ చేయడం.. తర్వాత ఫిర్యాదు అందే వరకు సంబంధం లేదనే విధంగా సంబంధిత అధికారులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. ఫిర్యాదులు అందినప్పుడు నగర స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై మొక్కుబడిగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. శుద్ధి చేసిన నూనెను మరిగిస్తే పొంగు రాదు. రంగు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. జంతువుల కళేబరాలతో చేసిన నూనె పొంగుతో పాటు దుర్వాసన వస్తుంది. – డాక్టర్ ఆర్వీ రాఘవేందర్రావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
బ్రిటన్‌లో నాన్‌వెజ్ కరెన్సీ!
కరెన్సీ అంటే ప్రపంచమంతటికీ క్రేజ్. కొత్త నోట్లు చేతికి వస్తే వాటిని మురిపెంగా చూసుకుని నలగనివ్వకుండా భద్రంగా పర్సులో పెట్టుకుంటారు. కానీ బ్రిటన్‌లో అలా జరగలేదు. ఈ కొత్త నోట్లు మాకొద్దంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ నోట్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ తెర మీదకొచ్చింది. ఇంతకీ సంగతేమిటంటే... పేపర్ కరెన్సీ స్థానంలో ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు పాలిమర్ నోట్లను ప్రవేశపెడుతున్నాయి. ఆ క్రమంలో బ్రిటన్ కూడా కొత్త ఐదు పౌండ్ల పాలిమర్ నోటును విడుదల చేసింది. అయితే ఆ నోటును తాకడానికి, పర్సులో పెట్టుకోవడానికి విముఖంగా ఉన్నారు ఇంగ్లండ్‌లోని ‘హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్’ (హెచ్‌ఎఫ్‌బి) సభ్యులు. హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్ సభ్యుడు, అక్కడి ఇస్కాన్ ఆలయం డైరెక్టర్ అయిన గౌరీదాస్ ఈ నోట్లను ఉపసంహరించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వానికి, బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బు ఎందుకు వద్దు? కొత్త ఐదు పౌండ్ల నోటు తయారీలో జంతువుల కొవ్వు వాడినందున శాకాహారులు, వేగాన్ (కాయలు, పప్పు దినుసులు తప్ప పాల ఉత్పత్తులను కూడా తీసుకోరు)లు ఆ నోట్లను తాకడానికి ఇష్టపడడం లేదని హెచ్‌ఎఫ్‌బి ప్రతినిధులు చెప్తున్నారు. కరెన్సీ నోటు ‘సంపద దేవత’ అనీ, ఆ నోటుకు జంతువుల కొవ్వు రాయడం అపరాధం అని అంటున్నారు. నోట్ల తయారీ కోసం జంతువులకు హాని కలిగించడం దేవుడు మెచ్చని పని అని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేయడానికి ‘రిమూవ్ టాలో (కొవ్వు) ఫ్రమ్ బ్యాంక్ నోట్స్’ పేరుతో ఒక పిటిషన్ తయారు చేశారు. ఇందుకు సానుకూలంగా ట్విటర్లో లక్షా ఇరవై ఆరు వేల మంది స్పందించారు. ఈ పిటిషన్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు చేరే నాటికి ఆ సంఖ్య లక్షా యాభై వేలకు చేరింది. కేంబ్రిడ్జిలోని రెయిన్బో వెజిటేరియన్ కేఫ్ నిర్వాహకుడు షరోన్ మీజ్ల్యాండ్ ఈ క్యాంపెయిన్‌కు స్పందించి ఆ నోట్లను స్వీకరించబోమని బోర్డు కూడా పెట్టేశాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన బ్యాంకు అధికారులు కూడా అనుకూలంగా స్పందించారు. ‘‘మేము వారి (హెచ్‌ఎఫ్‌బి) మనోభావాలను గౌరవిస్తాం, దీనిని అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా పరిగణించి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాం’’ అని బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఆస్ట్రేలియాలో పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టడానికి కారణమైన ప్రొఫెసర్ డేవిడ్ శాలమన్ ఇది సరైన ఆలోచన కాదని అంటున్నారు. ‘‘ఐదు పౌండ్ల నోటు తయారీలో ఉపయోగించే జంతువుల కొవ్వు అత్యంత స్వల్పం. అది ఒక సబ్బు తయారీలో వాడే యానిమల్ ఫ్యాట్ కంటే తక్కువే. పేపర్ నోట్ల తయారీకైతే చెట్లను నరకాలి. అది పర్యావరణ పరిరక్షణకు విఘాతం. పాలిమర్ నోట్‌తో ఆ ఇబ్బంది ఉండదు. పైగా ఇది పేపర్ నోటు కంటే చాలా శుభ్రంగా ఉంటుంది. దీర్ఘకాలం కూడా మన్నుతుంది’’ అని ఆయన వాదన. -
జంతువుల కొవ్వుతో నూనె తయారీ
పోలీసుల అదుపులో నిందితులు పెద్దఅంబర్‌పేట: జంతువుల కొవ్వును కరిగించి నూనె తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ మండలం బాటసింగారంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.... సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ అజీద్ కబేళా నుంచి జంతువుల కొవ్వును తీసుకువచ్చి బాటసింగారం గ్రామానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు ఇచ్చి వాటిని కరిగించి నూనెను తయారు చేయిస్తున్నాడు. ఆదివారం స్థానికులు కొందరు గ్రామ పంచాయితీ వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో అక్కడికి వెళ్లి చూడగా జంతువుల కొవ్వును వంట పాత్రల్లో కరిగిస్తున్న దృశ్యం కనిపించింది. గ్రామ పెద్దలకు ఈ విషయం చెప్పగా వారు వెళ్లి ప్రశ్నించగా... సంతోష్‌నగర్‌కు చెందిన అజిద్ జంతువుల కోవ్వు పదార్థాలను తీసుకువచ్చి తమకు ఇస్తే వాటిని కరిగించి నూనెను తయారు చేస్తున్నామని, అందుకు రూ.200 చొప్పున కూలీ ఇస్తున్నాడని తెలిపారు. సమాచారం అందుకున హయత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఇస్మాయిల్, ఫాతిమాలను అదుపులోకి తీసుకొని నూనె తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని, డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ తయారు చేసిన నూనెను నగరంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. -
జంతుకళేబరాలతో వంట నూనె తయారీ..!
నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : నిర్మల్ కేంద్రంగా జోరుగా జంతుకళేబరాలతో వంటనూనె తయారవుతోంది. క ల్తీ నూనె బాహాటంగానే తయారవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగేస్తున్నారు. అక్టోబర్ 12న రాంనగర్లో ఓ ఇంట్లో పెద్ద ఎత్తున జంతుకళేబరాలతో తయారు చేసిన నూనెడబ్బాలు, జంతు కొవ్వు, ఎముకలు బయటపడిన సంఘటన అప్పుడు రాష్ట్రవాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన మరువక ముందే బాగులవాడలోని వాల్మీకినగర్‌లో గురువారం పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం తో, అప్పటికే నిందితులు డబ్బాలను మాయం చేశారు. అయితే పోలీసులు అక్కడ ఉన్న వారిని విచారించి చేతులు దులుపుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా.. హైదరాబాద్‌లోని జంతువుల కొవ్వు, ఎముకల తో నూనె తయారుచేసి విక్రయిస్తున్న ముఠా నిర్వాకం బయటపడిన విషయం తెలిసిందే. అయితే పట్టణంలోనూ వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ఇలాంటి ముఠాలు కోకొల్లలుగా ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరికీ అనుమానం కలగకుండా కొందరు ఇళ్లలోనే కల్తీనూనె తయారు చేస్తున్నారు. కాలనీల్లోని సందుల్లో బట్టీలను ఏర్పాటుచేసి, జంతువుల కొవ్వును పెద్ద పెద్ద పాత్రల్లో వేసి ఉడికించి నూనె తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో వెలువడే దుర్గంధంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నా అధికారులెవరూ అడ్డుచెప్పకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా...? శివారు ప్రాంతాలు, మురికి ప్రాంతాలను కేం ద్రంగా చేసుకుని ఈ వ్యాపారాన్ని కొందరు య థేచ్ఛగా నిర్వహిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదరికాన్ని, యువత నిరుద్యోగా న్ని ఆసరా చేసుకుని తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. తయారుచేసిన నూనెను డబ్బాల్లో నింపి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సమాచారం. నూనె చౌకగా లభిస్తుండడంతో పెద్ద వ్యాపారులు నూనె కొనుగోలు చేస్తున్నారు. దీంతో దందా మూడుపువ్వులు ఆ రుకాయలుగా కొనసాగుతోంది. వ్యాపారానికి ఎవరి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో కుటీర పరిశ్రమగా సాగుతోంది. కల్తీనూనె దారెటు..! జంతుకళేబరాలతో తయారుచేస్తున్న నూనెను తయారీదారులు ఎక్కడ విక్రయిస్తున్నారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. రాంనగర్ సంఘటనలో అధికారులు తయారీదారులను విచారించినప్పుడు వారు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. సబ్బుల తయారీలో వినియోగిస్తున్నామని ఓసారి, హోటళ్లు, తినుబండారాల్లో వినియోగం కోసం విక్రయిస్తున్నామని మరోసారి పొంతన లేకుండా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆహారపదార్థాల్లో ఈ కల్తీనూనెను వినియోగిస్తే.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆలోచిస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. బలవుతున్న మూగజీవాలు...? కల్తీనూనె తయారీకి జంతువుల కళేబరాలు, కొ వ్వు, ఎముకలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నా రు. పలు ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల్లో ప్రతీ రోజు పదుల సంఖ్యలో లీటర్ల నూనెను త యారుచేస్తున్నారు. దీనికి కావలసిన ముడి సరుకుకోసం జంతువుల వధ తప్పనిసరి అవుతోంది. అయితే ఇంత పెద్దమొత్తంలో జంతువులను ఎ క్కడ వధిస్తున్నారనేది ప్రశ్నార్థకం. అయితే ని ర్మల్‌లో ఉన్న ఒకే ఒక్క జంతువధశాలకు కూడా అనుమతి లేదని అధికారులే చెబుతున్నారు. ఇంతకు ముందు పట్టణంలోని రాంనగర్లో ఇ లాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు హడావిడి చేసినా సాధించింది శూన్యం. స్వయంగా జిల్లా ఆహార అధికారి వచ్చి కల్తీ నూ నె డబ్బాలు పరిశీలించారు. సేకరించిన పదార్థాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరిశీలన కో సం పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. పూర్తి స్థాయి నివేదికలు అందాకే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ అధికారులు దాటవేస్తున్నారు. కళ్లముందే పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ జరుగుతున్నా, దానిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థా నికులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు పోలీసులు, మున్సిపల్ అధికారులు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏ ఒక్క శాఖ అధికారి కూడా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ తంతు చూస్తే పైస్థాయి నాయకులు, అధికారుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
ఆవిష్కరణం: టార్చ్‌లైట్ పూర్వరూపం లాంతరే!
నిప్పును నిరంతరం వెలిగే దీపంగా మార్చుకొని, దాన్ని ఒక కాంతిజనకంగా ఉపయోగించుకోవడం క్రీస్తు పూర్వం వేల ఏళ్ల క్రితమే మొదలైందని పరిశీలకుల భావన. గ్రీకు భాషలో వీటినే ‘లంపాస్’ అనే వారు. అవే ఇంగ్లిష్‌లో ‘ల్యాంప్’లు అయ్యాయి. క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో ఈ పదం వాడకంలోకి వచ్చింది. ఆ తొలినాళ్ల దీపాలే ‘టార్చ్లైట్లు’. అలాగే లాంతర్లను కూడా టార్చ్లుగానే భావించవచ్చు. నేటికీ వినియోగంలో ఉన్న లాంతర్లు 1783లో తొలిసారి ఆవిష్కృతం అయ్యాయి. అమీ ఆర్గండ్ అనే స్విస్ట్ కెమిస్ట్ వీటిని రూపొందించాడు. ఇవే చీకటిని చేధించి ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే నమ్మకమైన హ్యాండ్ ల్యాంప్స్‌గా మారాయి. తొలిరోజుల్లో జంతువుల కొవ్వుతో ఈ దీపాలను వెలిగించి, చీకటిలో ఉపయోగించే వారు. తర్వాత వంద సంవత్సరాలకు గ్యాస్, కిరోసిన్ ఇంధనంగా ఉండే లాంత ర్లను తయారు చేశారు. ఇవి ఆధునికంగా రూపాంతరం చెంది డ్రై సెల్ బ్యాటరీగా 1896లో అందుబాటులోకి వచ్చింది. అదే మనం వాడే ‘టార్చ్’. లిక్విడ్ రూపంలోని ఇంధనానికి భిన్నంగా పేస్ట్ ఎలక్ట్రోలైట్ల ద్వారా ఒక లైట్‌ను వెలిగించాలనే ఐడియా హ్యాండ్ బ్యాటరీ రూపకల్పనకు దారి తీసింది. తొలిసారి ఈ హ్యాండ్ల్యాంప్స్ను న్యూయార్క్ సిటీ పోలీసులు ఉపయోగించారు. రాత్రిపూట గస్తీ కోసం పరిశోధకులు వీటిని పోలీసులకు డొనేట్ చేశారు. ఆ విధంగా టార్చ్లైట్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. ఆ తర్వాత లైట్ల విషయంలోనూ, ముందువైపు ఉండే అద్దం విషయంలో అనే మార్పులు వచ్చాయి. తర్వాత ఎల్ఈడీలు, హెచ్ఐడీల రూపంలోని లైట్లతో బ్యాటరీలను రూపొందించారు. విద్యుత్ఘటాలతో, చార్జింగ్‌తో, కరెంట్‌తో పనిచేసే రకరకాల టార్చ్‌లైట్లూ వినియోగంలోకి వచ్చాయి.