యథేచ్ఛగా చిరు వ్యాపారం | Random small business | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా చిరు వ్యాపారం

Published Fri, Mar 3 2017 3:11 AM | Last Updated on Wed, Oct 17 2018 4:13 PM

యథేచ్ఛగా చిరు వ్యాపారం - Sakshi

యథేచ్ఛగా చిరు వ్యాపారం

► కల్తీ నూనె, ఇతర పదార్థాలతో తయారీ
► నేలపై పోసి ఫ్యాకింగ్‌
► ప్రజల ఆరోగ్యానికి ముప్పు
► అనుమతి లేదంటున్న గ్రామ పంచాయతీ అధికారులు


ఆదిలాబాద్‌ రూరల్‌ : పట్టణ శివారు ప్రాంతాంలోని బట్టిసావర్‌గాం గ్రామ పంచాయతీ పరిధిలోని న్యూ హౌజింగ్‌ కాలనీలో కారా తయారీ వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది. జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని నడిపించిన ఈ వ్యాపారం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. కారా తయారు చేస్తున్నప్పుడు దాని నుంచి వెలుబడే పొగాతో ఆ ప్రాంతం కలుషితంగా మారుతోందని కాలనీ వాసులు వాపోతున్నారు. దీంతో చుట్టూ పక్కల ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. ఇటీవలే గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.

కల్తీ కారా తయారీ...
బట్టిసావర్‌గాం గ్రామ పంచాయతీ శివారు ప్రాంతాంలోని న్యూ హౌజింగ్‌ బోర్డులోని కారా ఫ్యాక్టరీ నాణ్యత అంతంత మాత్రంగానే పాటిస్తున్నారని కాలనీకి చెందిన పలువురు పేర్కొంటున్నారు. కారా తయారీలో వాడాల్సిన నూనె, తదితర వస్తువులు తక్కువ క్వాలిటీవి వాడడంతో ప్రజల అనారోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొంది. అలాగే తయారీ గదిలో అపరిశుభ్రత వాతావరణం నెలకొందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా తయారు చేసిన ఖరా నేలపైనే వేస్తున్నారని, నేలపై వేసిన ఖరాలో కాళ్లు ఉంచి ప్యాకింగ్‌ చేసి ప్రజల అరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. కారా ఫ్యాకింగ్‌ చేసిన ప్యాకెట్‌పై కనీసం మనుఫాక్చరింగ్, ఎక్స్‌పైర్‌ తేదీ కూడా ముద్రించకపోవడంతో దాని కాల పరిమితి ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలియని పరిస్థితి. తనిఖీలు చేయావాల్సిన ఫుడ్‌ ఇన్స్ స్పెక్టర్‌లు కనీసం అటు వైపు తొంగి కూడా చూడడం లేదని న్యూ హౌజింగ్‌ బోర్డుకు చెందిన ప్రజలు వాపోతున్నారు.

ఎలాంటి అనుమతులు ఇవ్వ లేదు
తమ పరిధిలోని ఖరా ఫ్యాక్టరీ కోసం అనుమతులు ఇవ్వలేదు. కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఇచ్చామని గ్రామ పంచాయతీ సర్పంచ్‌ రాథోడ్‌ రామారావు, పంచాయతీ కార్యదర్శి కలీంలు ‘సాక్షి’తో తెలిపారు. కలుషిత వాతావరణం నెలకొంటుందని రెండు రోజుల కిందట కాలనీ వాసులు తమకు ఫిర్యాదు కూడా చేశారు. త్వరలో కారా తయారీ వ్యాపారునికి నోటీసులు జారీ చేస్తాము.

లైసెన్స్  ఉంది..
తము అనుమతులు తీసుకోని కారా తయారీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాం. వ్యాపారానికి సంబంధించినలైసెన్స్  కూడా తమ వద్ద ఉంది. ఇక్కడ తయారు చేసి హోల్‌ సేల్‌లో అమ్మకాలు చేపడుతున్నాం. తమ లైసెన్స్  ను ఏడాది ఒకసారి రెన్యూవల్‌ కూడా చేస్తున్నామని ఖరా తయారీ నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement