
పాత రిమ్స్‌లో అగ్నిప్రమాదం
కడప నగరంలోని పాతరిమ్స్ ఆవరణంలోని డీపీఆర్‌ఓ కార్యాలయంలో గురువారం 3.15 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
వైవీయూ: కడప నగరంలోని పాతరిమ్స్ ఆవరణంలోని డీపీఆర్‌ఓ కార్యాలయంలో గురువారం 3.15 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్కూ‍్యట్ కారణంగా కార్యాలయంలోని పాతపేపర్లు, పలు ఫైళ్లు దహనం అయ్యాయి. వెంటనే పక్క విభాగాలకు చెందిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా డీపీఆర్‌ఓను ఈ విషయమై వివరణ కోరగా కీలకమైన ఫైళ్లేమీ లేవని.. అవన్నీ పాతపేపర్ల కటింగ్‌లని తెలిపారు.