ట్రాక్టర్ కింద పడి వృద్ధుడి మృతి
Published Sun, Aug 7 2016 11:00 PM | Last Updated on Sat, Jul 6 2019 12:36 PM
రుద్రంగి(చందుర్తి): చందుర్తి మండలం రుద్రంగికి చెందిన ఊరడి పుట్టయ్య(65)అనే వృద్ధుడు కేజీవీల్స్ ట్రాక్టర్ కింద పడి శనివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం పుట్టయ్య ఎల్లయ్యకుంటలో నీరటి కాపరిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ప్రమాదవశత్తు రోడ్డు పక్కన ఉన్న బురదలో పడిపోయాడు. లేవడానికి ప్రయత్నించగా వీలు కాలేదు. పొలాలను దున్ని వస్తున్న కేజీవిల్స్ ట్రాక్టర్ వృద్ధున్ని గమనించక బురదలో నుంచి పోవడంతో పుట్టయ్య అక్కడికక్కడే మరణించాడు. ఆదివారం ఉదయం రైతులు మరణించన గట్టయ్యను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎసై ్స కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement