బస్సు, ట్రాక్టర్ ఢీ - ఇద్దరి మృతి | Bus , tractor collide - two killed | Sakshi
Sakshi News home page

బస్సు, ట్రాక్టర్ ఢీ - ఇద్దరి మృతి

Published Thu, Oct 1 2015 7:40 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Bus , tractor collide - two killed

ఎదురెదురుగా వస్తున్న బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. విజయవాడలోని కొత్తూరు -  తాడేపల్లి రహదారిపై గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు తాడేపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టగా ఒక రు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ.. మృతి చెందారు.

తీవ్ర గాయాలపాలైన ఏడుగురిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  మృతులు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాశిపాలెం గ్రామస్తులు శిరంశెట్టి మంగయ్య(30), మానేకుల సురేష్(35)గా గుర్తించారు. వీరు నెల రోజులుగా విజయవాడ సమీపంలోని వెలగలేరులోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారు. గొల్లపూడిలో ఇటుకలను అన్‌లోడ్ చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement