పోలీసుల అదుపులో అప్పలనాయుడు
సారవకోట: బుడితి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు(30)పై అత్యాచారం చేసిన చీడి అప్పలనాయుడు(45)ని అరెస్టు చేసినట్టు పాతపట్నం సీఐ ప్రకాశరావు తెలిపారు. దివ్యాంగురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు ప్రారంభించి అప్పలనాయుడిని అరెస్టు చేశామన్నారు. ఆదివారం మధ్యాహ్నం దివ్యాంగురాలు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అప్పలనాయుడు మద్యం సేవించి వచ్చి తలుపులు బంధించి ఆమెపై అత్యాచారం చేసినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలిపారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి అప్పలనాయుడిని పట్టుకుని స్తంభానికి కట్టేశారన్నారు. అప్పలనాయుడిని వైద్య పరీక్షలు నిమిత్తం టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరించి అనంతరం కోర్టులో హాజరు పర్చినట్టు చెప్పారు. ఆయనతో పాటు ఎస్‌ఐ దుర్గాప్రసాద్, పీసీ వెంకటరమణ ఉన్నారు.