Published
Thu, Sep 29 2016 10:52 PM
| Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
మృతుడు జగ్గారావు (ఫైల్)
డొంకూరు(ఇచ్ఛాపురం రూరల్) : అక్కను చూసి వస్తానంటూ వెళ్లిన చెట్టంత కొడుకు రైలు పట్టాలపై శవమై కనిపించడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. డొంకూరు మత్య్సకార గ్రామానికి చెందిన వీఆర్‌ఏ బాడాన నూకరాజు రెండవ కుమారుడు బాడాన జగ్గారావు(25) రెండు రోజుల కిందట ఒడిశా రొంపాలో ఉన్న అక్కను చూసి వస్తానంటూ వెళ్లాడు. అక్కతోనే కలసి బుధవారం సాయంత్రం వరకు ఇచ్ఛాపురం బ్యాంకు, మార్కెట్ పనుల్లో సాయమందించిన జగ్గారావు అదే రోజు సాయంత్రం అమ్మమ్మ ఊరు ఒడిశా నోగాం వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడని అక్క నాగమణి తెలిపింది. ఇచ్ఛాపురం బెల్లుపడ కాలనీ దరిదాపుల్లో బుధవారం రాత్రి రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం పలాస రైల్వే పోలీసుల నుంచి కబురు రావడంతో కుటుంబ సభ్యులు హతాశుతులయ్యారు. ఎనిమిదేళ్ల కిందట తల్లి మృతి చెందినప్పటి నుంచి జగ్గారావు మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.