కారు బోల్తా .. ఒకరి దుర్మరణం | One killed in a car roll over | Sakshi
Sakshi News home page

కారు బోల్తా .. ఒకరి దుర్మరణం

Published Sun, Sep 18 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

కారు బోల్తా .. ఒకరి దుర్మరణం

కారు బోల్తా .. ఒకరి దుర్మరణం

చక్రాయపేట/పులివెందుల : మండలంలోని అద్దాలమర్రి క్రాస్‌ వద్ద కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కండ్లి పెద్ద గంగన్న (40) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేంపల్లె శ్రీరామ్‌ నగర్‌కు చెందిన కండ్లి పెద్ద గంగన్న కుటుంబం అద్దాలమర్రి క్రాస్‌ వద్ద పందులను మేపుకుంటూ జీవనం సాగించేవారు. వీరు ఆదివారం పందులను మేపుకొని రోడ్డు దాటిస్తుండగా.. వేముల మండల వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ నాగేళ్ల సత్యప్రభావతమ్మ కుమారుడు పవన్‌ విశ్వేశ్వరరెడ్డి, కోడలు కవిత గుర్రం కొండలో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. అద్దాల మర్రి క్రాస్‌ వద్ద పందులు రోడ్డుకు అడ్డంగా వచ్చాయి. వాటిని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న పందుల యజమాని పెద్ద గంగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా విశ్వేశ్వరరెడ్డి కుడి భుజానికి బలంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఇడుపులపాయ పోలీసులు కేసు నమోదు చేశారు.
పవన్‌ విశ్వేశ్వరరెడ్డిని పరామర్శించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి :
అద్దాలమర్రి క్రాస్‌ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో గాయపడిన పవన్‌ విశ్వేశ్వరరెడ్డి మెరుగైన చికిత్స కోసం పులివెందుల దినేష్‌ మెడికల్‌ సెంటర్‌కు తరలించారు.  విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలు దినేష్‌ మెడికల్‌ సెంటర్‌కు చేరుకొని పవన్‌ విశ్వేశ్వరరెడ్డిని పరామర్శించి తండ్రి నాగేళ్ల సాంబశివారెడ్డికి ధైర్యం చెప్పారు. వేముల జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement