పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి | one worker died due to thunder effect | Sakshi
Sakshi News home page

పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి

Published Fri, Jul 29 2016 9:04 PM | Last Updated on Thu, Mar 28 2019 6:31 PM

one worker died due to thunder effect

చింతలపూడి: పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన చింతలపూడి మండలం గణిజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు గణిజర్ల గ్రామంలో నాట్లు వేసే పనికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురవడంతో కూలీలంతా గట్టుపైకి చేరుకున్నారు. వారు నిలుచున్న చోట పిడుగు పడటంతో కొమ్ము నాగేసు (50) అక్కడికక్కడే మృతి చెందగా ఊడ్పుగంటి బాలస్వామికి గాయాలయ్యాయి. బాలస్వామి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement