ఉల్లి కల్లోలం
– మార్కెట్లో ఎటు చూసినా కంపుకొడుతున్న ఉల్లి నిల్వలు
– పట్టించుకోని మార్కెట్ కమిటీ
కళ్లలో నుంచి నీళ్లు తెప్పించే ఉల్లి ముక్కు మూసుకునేలా కూడా చేయగలదు మరి. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనే సామెత మనకు తెలుసే. కానీ మార్కెట్ కమిటీ అలసత్వంతో అదే ఉల్లి కడుపులో తిప్పేలా దుర్గంధాన్ని కూడా వెదజల్లుతోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ఉల్లికి ఈ ఏడాది గిట్టుబాటు ధర లేకపోవడం కాదు కదా కనీసం రూ.50రూపాయలకు కూడా అడిగే నాథుడు లేకపోవడంతో రైతులు వందల క్వింటాళ్ల దిగుబడులను మార్కెట్లో ఇలా వదిలేసి వెళ్లారు. పరిసరాల శుభ్రతకు నెలకు రూ.లక్ష వెచ్చిస్తున్నట్లు చెప్పుకునే మార్కెట్ కమిటీ.. ఉల్లిని తొలగించకపోఽవడంతో కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. ఏడాదికి కోట్లలో ఆదాయం చేకూరుతున్నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడమేమిటని మార్కెట్‌కు వచ్చే రైతులు, కార్మికులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.
- కర్నూలు(అగ్రికల్చర్):