- ఫోన్ వస్తుందన్న ఆశతో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు
తానూరులో ఆన్‌లైన్ మోసం
Published Sun, Jul 24 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
తానూరు : తానూరుకు చెందిన యువకుడు గంగాధర్ ఆన్‌లైన్‌లో మోసపోయాడు. అతడి సెల్‌కి ఇటీవలే ఓ కాల్ వచ్చింది. మీరు సామ్‌సాంగ్ జీ–7 మెుబైల్ గెలుచుకున్నారని ముందస్తుగా అభినందనలు తెలిపారు. గెలుచుకున్న ఫోన్ మీకు పంపుతున్నామని అందుకోసం సర్వీస్ చార్జీల కింద రూ.4 వేలు ఇచ్చి ఫోన్ పార్సిల్‌ను తీసుకోవాలని సూచించారు. ఫోన్‌లో అవతలి వైపు నుంచి వచ్చిన మాటలు విన్న యువకుడు తన వివరాలు నమోదు చేయించాడు. యువకుడి అడ్రస్‌పై పోస్టాఫీసులో ఓ పార్సిల్ వచ్చింది. పోస్టాఫీసులో పార్సిల్ కోసం రూ.4 వేలు చెల్లించాడు. తీరా ఇంటికి వెళ్లి పార్సిల్ ఓపెన్ చేస్తే అందులో పాత పేపర్లను కట్టకట్టి ప్యాక్ చేసి పంపారు. ప్యాకింగ్ తెరవగానే కాగితాల కట్ట బయటపడింది. దీంతో సదరు యువకుడు మోసపోయినట్లు గ్రహించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదే నంబర్లతో ఫోన్ చేశాడు
తాను ఫోన్ గెలుచుకున్నట్లు 9136501769, 9136967080, 7065175123 నంబర్లతో ఫోన్‌లు వచ్చాయని బాధిత యువకుడు గంగాధర్ తెలిపాడు. ఈ నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేస్తానని వివరించాడు.
Advertisement