‘పాగా’ వేయలేక.. | paaga veyaleka | Sakshi
Sakshi News home page

‘పాగా’ వేయలేక..

Published Wed, Oct 12 2016 7:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

‘పాగా’ వేయలేక..

‘పాగా’ వేయలేక..

– భారీగా తగ్గిన తలపాగా విక్రయాలు
– రూ.10 కోట్ల నుంచి రూ.కోటికి పడిపోయిన వ్యాపారం
– భగ్గేశ్వరం చేనేత కార్మికుల బేలచూపులు
పాలకొల్లు అర్బన్‌ :
తలపాగ కర్ణాటక, మహారాషీ్ట్రయుల సాంప్రదాయ వస్త్రం. పెళ్లికి వధువు దంపతులు వరుడుకి బహూకరించే గౌరవప్రదమైన గుర్తింపుగా పాగాని బహూకరిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం చే నేత కార్మికుడు చేతిలో తయారైన తలపాగ కర్ణాటక, మహారాషీ్ట్రయుల తలపై చేరి వారి కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేస్తుందనడంలో అతిశయోక్తిలేదు. అయితే పాగ తయారు చేసిన కార్మికుడు బతుకు మాత్రం దుర్భరంగా మారింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ముడిసరుకు ధరలు పెరిగిపోయాయి. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవడంతో ప్రత్యామ్నాయ వత్తిలవైపు కార్మికులు మరలుతున్నారు. గత ఐదేళ్ల క్రితం గ్రామంలో 400మగ్గాలతో ప్రతీ ఇంట్లోనూ పాగా అల్లుతున్న చప్పుడ్లే వినిపించేవి. దాదాపు రూ.10నుంచి 15కోట్లు వ్యాపారం సాగేదని కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ఉంది. గ్రామం మొత్తం వెతికితే 30మగ్గాలు మాత్రమే తలపాగా అల్లే మగ్గాలున్నాయి. సొసైటీలో ఆరు మగ్గాలతో పాటు చింతపర్రులో మరో నాలుగు మగ్గాలున్నట్లు కార్మికులు లెక్కలు చెబుతున్నారు.    ప్రతీ ఏటా నవంబర్‌ నుంచి మే నెల వరకు మాత్రమే తల పాగా నేతనేయడానికి విక్రయాలు చేయడానికి రద్దీ ఉంటుంది. ఆరు నెలలు అన్‌సీజనే. దీంతో కార్మికులు తలపాగా నేయడం కన్నా రోజువారీ కూలీకి వెళితే మంచిదనే భావంతో ఉన్నారు. పెయింటింగ్, తాపీ, వడ్రంగి, టైలరింగ్‌ తదితర వత్తిలపై చేనేత కార్మికులు మొగ్గుచూపుతున్నారు. 
తల పాగా తయారీ ఇలా...
తల పాగా తయారీకి అవసరమైన ముడిసరుకు (నూలు)  కర్నాటక రాష్ట్రంలోని రాయదుర్గం నుంచి ఆర్డర్‌పై రప్పించుకుంటారు. ప్రస్తుత ధరలను బట్టి  కిలో వార్పు (నిలువు) రూ.3200కి, వ్రెప్ట్‌ (అడ్డం) కిలో రూ.2500కి రాయదుర్గంలో లభిస్తుంది. దీనికి గంజిపెట్టి, ఉడకబెట్టి, రంగులు వేసి ఆరబెడతారు. ఆ తరువాత మగ్గంపై పేక చుడతారు. అనంతరం రాట్నంపై కండెలు చుట్టి, మగ్గంపై పాగా అల్లుతారు. ఒక వార్పు (పడుగు) నేయడానికి సుమారు 15రోజుల సమయం పడుతుంది. ఒక వార్పు 6 తలపాగాలు తయారవుతాయి. అయితే ఆర్డర్‌పై మాస్టర్‌ వీవర్స్‌ కిరాయికి తలపాగాలు అల్లిస్తున్నారు. వార్పు నేసినందుకు  రూ.2వేలు నేత నేసిన కార్మికుడికి కిరాయి చెల్లిస్తున్నారు. భార్యా, భర్త, సహాయకుడు ముగ్గురు కలిపి, పదిహేను రోజులు కష్టపడితే ఆరు పాగాలు తయారవుతున్నాయి. పోగు, పోగు జాగ్రత్తగా , ఓర్పుతో, నేర్పుతో, శరీరంలోని అన్ని అవయవాలకు పనికల్పించి నేత నేయాలి. 
ప్రభుత్వ ప్రోత్సాహం కరువు...
శలా సత్యనారాయణ, చేనేత కార్మికుడు
తలపాగా నేసి జీవనోపాధి పొందే కార్మికుడికి ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. సొసైటీలన్నీ మూతపడ్డాయి. ముడి సరుకు సరఫరా లేదు. దీంతో మాస్టర్‌ వీవర్స్‌ ఆర్డర్లపై తలపాగాలు నేయిస్తున్నారు. వయస్సు మళ్లిన వారు మాత్రమే దీనిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. పిల్లలు ఈ వత్తిపై ఆసక్తి చూపడం లేదు. 
అద్దె మగ్గంపై పాగా నేస్తున్నా...
తాళ్ల శివరాజు, చేనేత కార్మికుడు
సొసైటీలో ఆరు మగ్గాలున్నాయి. దీంతో ఒక మగ్గంపై పాగా నేస్తున్నా. నెలకి రూ.200అద్దె ఇవ్వాలి. ఫ్యాన్‌లు లేవు. దీంతో విసనకర్రతో పాగా ఆరడానికి విసరాల్సి వస్తోంది. ఫ్యాన్‌ సౌకర్యం కల్పిస్తే అదనపు అద్దె ఇవ్వాలి. దీంతో రెక్కలు కష్టం చేసి భార్య, నేను కలిపి పాగా నేస్తున్నా. 
వేన్నీళ్లకు చన్నీళ్ల సాయంగా...
తాళ్ల మంజుల, చేనేత కార్మికురాలు
మాకు సొంతంగా మగ్గం లేదు. తన భర్త సొసైటీలో మగ్గం అద్దెకు తీసుకుని తల పాగా అల్లుతారు. నేను కండెలు చుట్టి సహాయం చేస్తా. పిల్లలు కూడా సాయం చేస్తుంటారు. ఆరు నెలలు మాత్రమే పని, మిగిలిన ఆరునెలలు ఖాళీగానే ఉండాలి. కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వం చేనేత వత్తిని ప్రోత్సహించి   చేనేత కార్మికులను ఆదుకోవాలి. 
తలపాగాలు విక్రయంలో అనుభవశాలిని..
అందే కోట బసవ మల్లయ్య, వ్యాపారి
గత 35ఏళ్ల నుంచి తలపాగాలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నా. ప్రస్తుతం పాగాలు అల్లి చేనేత కుటుంబాలు జీవించాలంటే కష్టమే. 15రోజులు ముగ్గురు మనుషులు కష్టపడితే ఆరు పాగాలు తయారు చేయగలరు. దీనికి గాను మజూరి రూ.2వేలు కిడుతుంది. నెలకి రెండు వార్పులు మించి అల్లడం కష్టం. చేనేత కార్మికుల పిల్లలు ఈ వత్తిని పూర్తిగా వదిలేశారు. తలపాగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement